Showing posts with label Music Director - M S Viswanath. Show all posts
Showing posts with label Music Director - M S Viswanath. Show all posts

07 July 2010

కదిలే మేఘమా కవితా రాగామా

కదిలే మేఘమా కవితా రాగామా
కాళిదాస కమనీయ భావనా గాంధర్వ రసయోగమా

నీ గగనవాణి ఎగిసిపోనీ శ్రుతులుగా నా నవ్య గీతాలలో..
నీ చెలితవేనీ కులికి పోనీ జాతులుగా నా భావ నాట్యాలాలూ
ఆవిరిలో ఉదయించే..జీవన మధుకోసామా ||ఆ||క||

నా ..కనులలోన కలల వాన కురిసినది నీ కన్నె పరవళ్ళతో
నా మనసు లోన విరాహ వీణా పలికినది నీ నీలి కన్నీళ్ళతొ
అనువణువూ నినదించే అనురాగ సంకేత మా ||ఆ||క||

11 June 2010

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో

ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమవునో (2)
తెలిసీ తెలియని అభిమానవునో

మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
భాషలేనిది బంధమున్నది
మన ఇద్దరిని జత కూర్చినది..
మన ఇద్దరిని జత కూర్చినది
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమవునో
తెలిసీ తెలియని అభిమానవునో

వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఎల్లలు ఏవి వల్లనన్నది
నీది నాదొక లోకమన్నది..
నీది నాదొక లోకమన్నది..
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమవునో
తెలిసీ తెలియని అభిమానవునో

తొలిచూపే నను నిలదీసినది
మరుమాటై అది కలవరించినది
మొదటి కలయికే ముడి వేసినది
తుదిదాకా ఇది నిలకడైనది..
తుదిదాకా ఇది నిలకడైనది..
ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమవునో
తెలిసీ తెలియని అభిమానవునో

03 June 2010

సన్నజాజులోయ్..హా..కన్నెమోజులోయ్

సన్నజాజులోయ్..హా..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..హా..కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే..తళుకు బెళుకు కనవేరా..
పాలవెల్లి పుంత కాడ పైట కొంగు జారిపోయె..పడుచు గొడవ వినవేరా..

సన్నజాజులోయ్..హా..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..హా..కన్నెమోజులోయ్
హా..కన్ను కన్ను గీటుకుంటె సన్న సన్న మంటరేగే..కలికి చిలుక ఇటు రావే
వళ్ళు వళ్ళు మీటుతుంటే వగలమారి సెగలు పుట్టె..వలపు పిలుపు విని పోవే

'బానిసగా వచ్చావు..నన్నే నీ బానిసగా చేసుకున్నవు
మగతనం చూపావు..నాలో ఆడతనాన్ని నిద్దుర లేపావు.'

రేయి తెల్లారి తెల్లారి పోతున్నదీ రారా నా దొరా..
తీగ అల్లాడి మాడి పోతున్నదీ రారా సుందరా..
ఒకటున్నది నీలో..ఒడుపున్నది నాలో..
అది వున్నది లేనిది తెలుసుకో..
మెరుపున్నది నాలో..ఉరుమున్నది నీలో..
అది నీదని ఇది నాదని మరిచిపో..

సన్నజాజులోయ్..

'ఈ ద్వీపానికి దీపానివి నువ్వు..ఈ లంకకే నెలవంకవు నువ్వు.'

మల్లెపువ్వంటి రవ్వంటి మనసున్నదిలే..మగతోడు వున్నదిలే
చింత చీరంటి పొగరు వున్నదిలే..వగరున్నదిలే సెగ రేగిందిలే
వలపున్నది నాలో..బలమునంది నీలో..ఆ పట్టుని ఈ విడుపుని కోరుకో..
సగమున్నది నాలో..సగమున్నది నీలో..రెంటిని జంటగా మలచుకో..

సన్నజాజులోయ్..హా..కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోనా పిల్ల గాలి జాతరాయే..తళుకు బెళుకు కనవేరా..
పాలవెల్లి పుంత కాడ పైట కొంగు జారిపోయె..పడుచు గొడవ వినవేరా

రా రా రా రావయ్యా రామేశం... ఏమయ్యా ఆవేశం...

రా రా రా రావయ్యా రామేశం... ఏమయ్యా ఆవేశం...
నాజూకు చూపావో నా చుట్టూ తిప్పిస్తాను
గిరుక్కు గిరుక్కు గిరుక్కున గిర గిర గిర గిర గిర...
చిన్నారి నాంచారీ మన్నించూ ఈ సారీ..
నా వెంటే పడుతుంటే నీ భరతం పట్టిస్తాను..
తళాంగు తళాంగు తళాంగుతోం తక తక తక తక తక
నిలువూ ఏమంత బిగువూ..నిను నిలదీసి వలవేసి లాగేస్తా ||2||
అందాక నువ్వొస్తే ఆపైన నే చూస్తా తీరా నువు లాగేస్తే
తీయంగా అంటిస్తా..చురుక్కు చురుక్కు చురుక్కున చుర చుర చుర చుర చుర
రమ్మంటూ నేనంటే..రానంటూ నువ్వుంటే గారాలే పోతుంటే..
నీ బుగ్గ చిదిమేస్తాను చిటుక్కు చిటుక్కు చిటుక్కున చిట చిట చిట చిట చిట
||చిన్నారి నాంచారీ ||
అలకా బంగారు తునకా.. ఏదో అలవోకగా అంటే అంత కినుకా...||2||
నీ వైనం చూస్తుంటే హైరానా అవుతుందీ..నీ అల్లరి చూస్తుంటే నా
గుండే అంటుంది కలుక్కు కలుక్కు కలుక్కునా కల కల కల కల కల
రమ్మటూ నువ్వంటే రానంటూ నేనుంటే నా మాటా వినకుంటే
నీ ఆట కట్టిస్తాను గబుక్కు గబుక్కు గబుక్కున గబ గబ గబ గబ గబ
||రావయ్యా రామేశం||

రెక్కలు తొడిగీ రెప రెప లాడీ రివ్వంటుంది కోరికా...

రెక్కలు తొడిగీ రెప రెప లాడీ రివ్వంటుంది కోరికా...
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా
||రెక్కలు||
వయసు దారి తీసిందీ..వలపు ఉరకలేసిందీ ||2||
మనసు వెంబడించిందీ...నిముషమాగకా..
మనసే వెంబడించిందీ...నిముషమాగకా..
||రెక్కలు||

చెంతగా...చేరితే...
చెంతగా చేరితే వింతగా ఉన్నదా..
మెత్తగా తాకితే కొత్తగా ఉన్నదా...||2||
నిన్న కలగా ఉన్నదీ..నేడు నిజమౌతున్నదీ..||2||
అనుకున్నది అనుభవమైతే అంతకన్న ఏమున్నదీ...

వయసు దారి తీసిందీ..వలపు ఉరకలేసిందీ
మనసు వెంబడించిందీ...నిముషమాగకా..
మనసే వెంబడించిందీ...నిముషమాగకా..
రెక్కలు తొడిగీ రెప రెప లాడీ రివ్వంటుంది కోరికా...
రివ్వంటుంది కోరికా...

హా ఆఅ హాఆఆ

కళ్ళతో... నవ్వకూ...
కళ్ళతో నవ్వకూ ఝల్లు మంటున్నదీ
గుండెలో చూడకూ గుబులు గా ఉన్నదీ..||2||
తొలిచూపున దాచిందీ..మలిచూపున తెలిసిందీ..||2||
ఆ చూపుల అల్లిక లోనే పెళ్ళి పిలుపు దాగున్నదీ...

వయసు దారి తీసిందీ..వలపు ఉరకలేసిందీ
మనసు వెంబడించిందీ...నిముషమాగకా..
మనసే వెంబడించిందీ...నిముషమాగకా..
రెక్కలు తొడిగీ రెప రెప లాడీ రివ్వంటుంది కోరికా...
దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుకా...

హా ఆఅ హాఆఆ

02 June 2010

నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి..

నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి..
చూపులోనే ఆపలేని మత్తు మ౦దు జల్లిరి
నన్ను ఎవరో చూసిరి కన్నె మనసే దొసిరి
చూపులోనే ఆపలేని మత్తు మ౦దు జల్లిరి

ఆ బుగ్గల లేత సిగ్గు నా కోస౦ పూచినదేమో
సిగ్గులన్ని దోచుకు౦టే తొలివలపే ఎ౦తో హాయి
ఆ మగసిరి అల్లరి అ౦తా నాకోస౦ దాచినదేమో
అ౦దగాడు ఆశ పెట్టే సయ్యాటాలు ఎ౦తో హాయి

ఆ నల్లని జడలో మల్లెలు నాకోస౦ నవ్వినవేమో
మల్లెలాగ నేను కూడా జడలోనే ఉ౦టే హాయి
ఆ చల్లని కన్నుల కా౦తి నాకోస౦ వెలిగినదేమో
కా౦తిలాగ నేను కూడా ఆ కన్నుల నిలిచిన చాలు

10 May 2010

ఓ మహాత్మా , ఓ మహర్షి

ఓ మహాత్మా , ఓ మహర్షి
ఏది చీకటి, ఏది వెలుతురు
ఏది జీవితమేది మృత్యువు
ఏది పుణ్యం, ఏది పాపం
ఏది నరకం, ఏది నాకం
ఏది సత్యం, ఏదసత్యం
ఏదనిత్యం, ఏది నిత్యం
ఏది ఏకం, ఏదనేకం
ఏది కారణమేది కార్యం

ఓ మహాత్మా , ఓ మహర్షి

ఏది తెలుపు, ఏది నలుపు
ఏది గానం, ఏది మౌనం
ఏది నాది, ఏది నీది
ఏది నీతి, ఏది నేతి
నిన్న స్వప్నం, నేటి సత్యం
నేటి ఖేదం, రేపు రాగం
ఒకే కాంతి ఒకే శాంతి

ఓ మహాత్మా , ఓ మహర్షి

13 February 2010

కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు

కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు
వినిపించిన మాయకోసం వెతికి వెతికి పోయేదొకరు
కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు

తపన ఆగిపోగానే వలపు వీగిపోయేను
తపన ఆగిపోగానే వలపు వీగిపోయేను
పోనీ వెతికి పోని వలపే బ్రతికి పోనీ

కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు
వినిపించిన మాయకోసం వెతికి వెతికి పోయేదొకరు
కనిపించిన ఛాయతోనే కలవరించిపోయేదొకరు

సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి

సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
అహ సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది అహహహ
మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది
దొరికింది గుర్రపు నాడం దొరుకుతుందనుకుంటి గుర్రం
ఊరంత గాలించినాను గాడిదై పోయాను నేను
నేనలసిపోయి సొలసిపోయి మరచిపోయి నిలిచిపోతే మెరుపల్లే వచ్చావు శంభో
నా నిదురపోయి అదిరిపోయి మూగపోయి ఆగిపోతె గిలిగింత పెట్టావు శంభో

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది

నీ కళ్ళు నా కళ్ళు కలిసి నీ కోర్కె నా కోర్కె తెలిసి
నీ సొగసు పువ్వల్లే విరిసి నా వయసు గువ్వల్లే ఎగసి
నేనదును చూసి తెగువ చేసి చెయ్యి వేసి చుట్టుకుంటె మంచల్లే కరిగావే శంభో
నీ సిగ్గు చూసి ఆకలేసి చెమట పోసి దాహమేసి అల్లాడిపోతున్న శంభో

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మ
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుంది
రాజమండ్రి కోడలుగ రానుంది

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నీసరి ఎవరమ్మ

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నీసరి ఎవరమ్మ
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

ఒకే రోజు దినము దినము ఒక గమకం ఒక మధురం
ఒకే రోజు దినము దినము ఒక గమకం ఒక మధురం
ఒక మేఘం క్షణ క్షణము ఒక రూపం ఒక శిల్పం
ఆ సరిగమలు ఆ మధురిమలు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు
ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు
ఒక కౌగిలి ప్రతి రేయి ఒక స్వర్గం ఒక దుర్గం
ఆ జివజివలు ఆ మెలుకువలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
మనసుంటే మనకోసం ప్రతి మాసం మధుమాసం
ఋతువుల సొగసు చిగురుల వయసు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
మమతలతో మనసల్లిన హరివిల్లే మన ఇళ్ళు
వలపుల జల్లులు పలుపలు వన్నెలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము

హల్లో నేస్తం బాగున్నావా

హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా
హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా

ఊగే అలపై సాగే పడవ ఒడ్డు పొడ్డు చేర్చింది
ముచ్చటలన్ని మోసే గాలి దిక్కుదిక్కులను కలిపింది
కలకల పోయే చిలుకల గుంపు వరసా వావి నేర్పింది
నేల పీటగా నింగి పందిరిగా జగతికి పెళ్ళి జరిగింది
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా
హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా

ఏ కళ్ళైనా కలిసాయంటే కలిగేదొకటే అనురాగం
ఏ మనసైనా తెరిసాయంటే తెలిపేదొకటే ఆనందం
సరిగమలైనా డొరనిపలైనా స్వరములు ఏడే గానంలో
పడమటనైనా తూరుపునైనా స్పందన ఓకటే హృదయంలో
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా
హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా
చైనా ఆట మలయా మాట హిందూ పాట ఒకటేను
నీ నా అన్నది మానాలన్నది నేటి నినాదం కావాలోయ్
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా

హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ friendship welcomes యు

శంభో శివ శంభో శివ శంభో శివ శంభో

శంభో శివ శంభో శివ శంభో శివ శంభో
వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో
వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో

అందాన్ని కాదన్న ఆనందం లేదన్న
బంధాలు వలదన్న బ్రతుకంతా చేదన్న
సిరులున్నా లేకున్నా చెలితోడు నీకున్నా
అడవిలో నువ్వున్నా అది నీకు నగరంరా

వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో


ఈ తేటిదీ పువ్వు అని అన్నదెవరన్న
ఏ తేనె తాగిన తీపొకటేకదరన్న
నీదన్న నాదన్న వాదాలు వలదన్న
ఏదైనా మనదన్న వేదాన్నే చదువన్న
ఊరోళ్ళ సొమ్ముతో గుడికట్టి గోపన్న
శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న
భక్తైనా రక్తైనా భగవంతుడేనన్న
ఈనాడు సుఖమన్న ఎవడబ్బ సొమ్మన్న

వినరా ఓరన్నా అనెరా వేమన్న
జగమే మాయన్నా శివ శంభో
నిన్న రాదన్న రేపూ లేదన్న నేడే నీదన్న శివ శంభో

గాలికదుపు లేదు.. కడలికంతులేదు

ఆఆ అ .. ఆఆ అ.. ఆఆఆ అ.. ఆ ఆ ఆ ఆ.. అ అ అ.. అ అ అ
అ అ అ.. అ అ అ

గాలికదుపు లేదు.. కడలికంతులేదు
గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా..
ఉరికే మనసుకు గిరిగీస్తే ఆగేదేనా

గాలికదుపు||

సనిస స.. సరి సరి సరి రిస సని.. సనిస స.. సరి సరి సరి రిస సని (౨)

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నేమలినై ఆడనా ఆటలు ఎన్నో..
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేడి కేది కట్టుబాటు
మళ్ళి మళ్ళి వసంతంమొస్తే మల్లె కేల ఆకుచాటు

గాలికదుపు||

ఓ తెమ్మెరా.. ఊపవే ఊహల ఊయల నన్ను..
ఓ మల్లికా.. ఇవ్వవే నవ్వుల మాలిక నాకు..
తల్లి మళ్ళి తరుణయ్యింది.. పువ్వు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది

గాలికదుపు||

అ అ ఆ ఆ అ అ
అ అ ఆ ఆ అ అ

అందమయిన లోకమని రంగురంగులుంటాయని

అందమయిన లోకమని రంగురంగులుంటాయని
అందరు అంటుంటారు రామ రామ ..
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా ..
చెల్లెమ్మా .. అందమైంది కానేకాదు చెల్లెమ్మా..

ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా ..(2)

ఆకలికి అందముందా రామ రామా ..
ఆశలకి అంతముందా చెప్పమ్మా .. చెల్లెమ్మా
ఆశలకి అంతముందా చెప్పమ్మా ..

అందమయిన లోకమని ||

గడ్డిమేసి ఆవు పాలిస్తుంది..పాలు తాగి మనిషి విశమౌతాడు..(2)

అది గడ్డి గొప్ప తనమా..ఇది పాల దోశ గుణమా..(2)

మనిషి చాల దొడ్డాడంమా చేలేమ్మ..
చెల్లెమ్మా.. తెలివి మీరి చెడ్డాడమ్మ చిన్నమ్మా..

అందమయిన లోకమని ||

ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి..మొగలిపువ్వులోన నాగుంటాది..(2)

ఒక మెరుపు వెంట పిడుగు .. ఒక మంచిలోన చెడుగు
లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మా
చెల్లెమ్మా .. లోతుకెళ్తే కధే వేరు పిచ్చమ్మా ..

అందమయిన లోకమని ||

డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా .. పేదవాడు నాడే పుట్టాడమ్మా (2)

ఆ ఉన్నవాడు తినడు .. ఈ పేదను తిననివ్వడు
కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా ..
ఈ లోకం కుళ్ళు నీవు చూడలేవు చెల్లెమ్మా

అందమయిన లోకమని ||

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు

తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ (2)
రాలేరు ఎవరూ నాతో చేరీ
నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా
జరిగే నాడే జరుగును అన్నీ (2)
జరిగిన నాడే తెలియును కొన్నీ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసూ
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసూ

నాలో ఉన్న మనసూ నాకు గాక ఇంకెవరికి తెలుసూ !

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
పదహారేళ్ళకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు
వెన్నెలల్లే విరియ బూసి
వెల్లువల్లే ఉరకలేసే

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు
పాటలు పాడిన చిరు గాలులకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
తెరచాటొసగిన చెలులు శిలలకు
దీవెన జల్లులు చల్లిన అలలకు
కోటి దండాలు శతకోటి దండాలు

నాతో కలిసి నడచిన కాళ్ళకు
నాలో నిన్నే నింపిన కళ్ళకు
నిన్నే పిలిచే నా పెదవులకు
నీకై చిక్కిన నా నడుమునకూ
కోటి దండాలు శతకోటి దండాలు

భ్రమలో లేపిన తొలి జాములకు
సమయం కుదిరిన సందె వెళలకు
నిన్నూ నన్ను కన్న వాళ్ళకు
నిన్నూ నన్ను కన్న వాళ్ళకు
మనకై వేచే ముందు నాళ్ళకు
కోటి దండాలు శతకోటి దండాలు

భలె భలె మగాడివోయ్

భలె భలె మగాడివోయ్
బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్
నీ ఆన నీ దాననోయ్
I don't know what you say
తెలియంది మానేసేయ్
నీకు తెలిసింది ఆడేసేయ్
తీయంది ఒక బాటే
That's love shall blush I say
I don't know what you say to me
But I have so much to say
I wanna fly with you up the sky
and dance all the night
I can't help darling falling in love
With you and only with you
Come darling let's play the game
Come darling let's sing and sway

నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే
Let's be merry my dove
Hey Let's be merry my love
ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో
ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో
One fine day you will be mine
It will be full of sunshine
One fine day you will be mine
It will be full of sunshine
నాతోటి నీవుండ నాకు ఇంకేల నీరెండ
నాతోటి నీవుండ నాకు ఇంకేల నీరెండ
Come baby let's have some fun
Down here there is no one
భలె భలె మగాడివోయ్
బంగారు నా సామివోయ్
I wanna fly with you up the sky
and dance the whole night

నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకోనీ
No need to feel shy my girl
No need to hold back my doll
నా వంపు వంపులోన నీ వయసు ఆపుకోనీ
Hand in hand let's say my dear
Come near don't fear dear
సాగించు పయనాన్నీ నీవే చూపించు స్వర్గాన్ని
Let's start the game of our live And you'll be my dear wife

12 February 2010

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా
గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్యా
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
దోర పాపాన్న వున్నాను నేను
కొత్త లోకాన్ని నాలోన చూడు

దేశాన్ని దోచేటి ఆసాములున్నారు
దేవుణ్ణి దిగమింగు పూజారులున్నారు
ప్రాణాలతో ఆడు వ్యాపారులున్నారు
మనిషికీ మంచికీ సమాధి కట్టారు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు
మహాత్ములెందరు సహాయ పడిన మంచి జరగ లేదు
జాతి వైద్యులే కోత కోసినా నీతి బ్రతకలేదు
భోగాలు వెతుకాడు వయసు
అనురాగాల జతి పాడు మనసు
నీ దాహాని కనువైన సొగసు
నీ సొంతాన్ని చేస్తుంది పడుచు

కాటుకెట్టిన కళ్ళలో కైపులున్నవి
మల్లెలెట్టిన కురులలో మాపులున్నవి
వన్నె తేరిన కన్నెలో చిన్నెలున్నవి
అన్ని నీవే అనుటకు రుజువులున్నవి
చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల
చక్కని చుక్కా సరసనుండగ పక్క చూపు లేల
బాగుపడని ఈ లోకం కోసం బాధ పడేదేల
మోహాన్ని రేపింది రేయి
మన పేగుల్లో వుందోయి హాయి
ఈ అందానికందివ్వు చేయి
ఆనందాల బంధాలు వేయి

తుహై రాజా మై హు రాణి

తుహై రాజా మై హు రాణి
ఫిర్ భి నహి హై బాత్ పురాని
తుహై రాజా మై హు రాణి
ఫిర్ భి నహి హై బాత్ పురాని
దోనోంకీ ఇక్ దిల్ కి జబానీ
షురు హుఇ హై నయి కహానీ
దోనోంకీ ఇక్ దిల్ కి జబానీ
షురు హుఇ హై నయి కహానీ

ప్యార్ మే మగన్ ఝీల్ హై గగన్
నాం హై లగన్ సాత్ హై పవన్
హం సె దూర్ హై జిందగీ కి ఘం
క్యూ కహి రుకే ప్యార్ కే కదం
తారోన్సె ములఖాత్ కరే
ఉజియారో కి బాత్ కరే
చాంద్ సె జాకర్ సైర్ కరే
దునియా వాలోన్ సే న డరే
దునియా వాలోన్ సే న డరే

దడ్కనోన్ కి ధున్
సున్ మెరే సనం
జాన్ హై తెరీ జాన్ కీ కసం
మై తెరీ జుబాన్
తూ జవాన్ కలం
షాయరీ కొ దీ హం నయా జనం
హం సె నయే గుల్ కయీ ఖిలే
దర్పన్ అప్ని జమీన్ పె ఖులే
జనం జనం మే సాత్ చలే
జల్నే వాలే ఔర్ జలే
జల్నే వాలే ఔర్ జలే

అన్నది నీవెనా నా నా నా నా స్వామి....

అన్నది నీవెనా నా నా నా నా స్వామి....
అన్నది నీవెనా నా నా నా నా స్వామి....
ఉన్నది నీవె...
ఉన్నది నీవె...నా లొన నా స్వామి...
నా లొన నా స్వామి...
అన్నది నీవెనా నా నా నా నా స్వామి....
చెదరిన జీవితమా నా కా నాకా...
ఏమి పరీక్ష ఎలా నా నా స్వమి...
అన్నది నీవెన నా నా నా నా స్వామి....

అగ్ని సాక్షిగా ఆలుమగలై అలరితిమింతటి దాక
పసుపు కుంకుమల పరిమలమంత పతి రూపమ్మె కాగా ||2 TIMES||
వినలెను విడలెను వేరై మనలెను
శొధనలొ వెదనలొ బాధను కాలెను
ఇటులన్నది నీవెన నా నా నా నా స్వామి....

దైవదత్తమౌ ప్రెమ కుసుమమె వీధిని విసురుట తగునా
పరులు తాకినా విరి గుండెలలొ మలి ఆమని వెలిసెనా ||2 TIMES||
నీ కరమె నా వరము నీవె నా జగము
మరణమ్మె సరణమ్ము మారదు నా మనము
అన్నది నీవెన....