అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామ స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామ దానికి సలాము చేద్దామా
శాంతికపోతపు కొత్తుక తెంచి తెచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మ ఓ పవిత్ర భారతమా
కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువను చూపి తగువుకి లేస్తారె
జనాలు తలలర్పిస్తారె
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకు తనం లో
ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని
నిజం తెలుసుకోరె తెలిసి భుజం కలిపి రారె
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
ఈ చిచ్చుర సింధూరం జవాబు చెప్పే భాద్యత మరచిన
జనాల భారతమ ఓ అనాధ భారతమ
అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూరమ్రుగంల దాక్కుని ఉండాల
వెలుగుని తప్పుకు తిరగాల
శత్రువుతో పోరడే సైన్యం
శాంతి ని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణిచే విధిలో
సవాలూ చెయ్యాల అన్నల చేతిలో చావాలా
తనలో ధైర్యం అడవికి ఇచ్చి
తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ
సంఘం శిలల నిలుచుంటే నడిచే శవంలా సిగలో
తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్య సింధూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మ
గతి తోచని భారతమ
తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే
వదులుకొని తనలో భీతిని తన అవినీతిని
తన ప్రతినిధులుగ ఎన్నుకొని
ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాశిస్తుందట అధికారం
క్రిష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం
చూస్తూ ఇంక నిదురిస్తావ విశాల భారతమ ఓ విషాధ భారతమ
Showing posts with label Music Director - Srinivas Chakravarthi. Show all posts
Showing posts with label Music Director - Srinivas Chakravarthi. Show all posts
04 October 2010
14 June 2010
ఊరికే వుండదే ఉయ్యలూగే మనసు
ఊరికే వుండదే ఉయ్యలూగే మనసు
ఊహకే అందడే అసలేమైందో నాకు
ఊరికే వుండదే ఉయ్యలూగే మనసు
ఊహకే అందడే అసలేమైందో నాకు
ఏనాడు లేదే కనుకనే అనుకుంటునే వున్నా
ఈనాడే ఇలా ఎదురై ఏదో ఆయిపోతున్నా
ఔననా కాదనా అతనేదో అన్నాడు ఆగనా సాగనా అంటుందే నాయీడు
రోజు అలవాటైనా తనకేసి చూడాలంటే మరి యి రోజేమో బిడియంగా వుందమ్మ
ఇన్నాళ్ళు ఇపుడైనా యీ సిగ్గులు తెలిసోచ్చేనా
తన చూపులోనే ఎదో మాయుందమ్మ
అడుగుల అలికిడీ వింటే ఎందుకు అలజడి అంటే
ఏం చెప్పేదమ్మ నిలువునా గిలిగింతే రేపాడే
ఊరికే
చూసిపోవే పైట నీకే మెచ్చిందిపూట ఈ బరువంత ఇన్నాళ్ళేమైందంట
ఏదో ఆరాటంతో ఎద కంగారవుతు వుంటే
ఇది హాయో కాదో చెప్పే వారెవరంట
కాని కనబడకుంటే ప్రాణం నిలబడదంటు
ఒట్టేసేమరి అతనికి చెపాలనిపిస్తుంది
ఊరికే
ఊహకే అందడే అసలేమైందో నాకు
ఊరికే వుండదే ఉయ్యలూగే మనసు
ఊహకే అందడే అసలేమైందో నాకు
ఏనాడు లేదే కనుకనే అనుకుంటునే వున్నా
ఈనాడే ఇలా ఎదురై ఏదో ఆయిపోతున్నా
ఔననా కాదనా అతనేదో అన్నాడు ఆగనా సాగనా అంటుందే నాయీడు
రోజు అలవాటైనా తనకేసి చూడాలంటే మరి యి రోజేమో బిడియంగా వుందమ్మ
ఇన్నాళ్ళు ఇపుడైనా యీ సిగ్గులు తెలిసోచ్చేనా
తన చూపులోనే ఎదో మాయుందమ్మ
అడుగుల అలికిడీ వింటే ఎందుకు అలజడి అంటే
ఏం చెప్పేదమ్మ నిలువునా గిలిగింతే రేపాడే
ఊరికే
చూసిపోవే పైట నీకే మెచ్చిందిపూట ఈ బరువంత ఇన్నాళ్ళేమైందంట
ఏదో ఆరాటంతో ఎద కంగారవుతు వుంటే
ఇది హాయో కాదో చెప్పే వారెవరంట
కాని కనబడకుంటే ప్రాణం నిలబడదంటు
ఒట్టేసేమరి అతనికి చెపాలనిపిస్తుంది
ఊరికే
Subscribe to:
Posts (Atom)