Showing posts with label Movie - Mukkupudaka. Show all posts
Showing posts with label Movie - Mukkupudaka. Show all posts

22 June 2010

చినుకు చినుకుగా... చిగురు మెత్తగా

చినుకు చినుకుగా... చిగురు మెత్తగా
గోరు వెచ్చగా... గుండె విచ్చగా
చేరుకో సరాగిణీ.. చేరుకో తరంగిణీ

అల్లన ఉదయించే ప్రతి కిరణం చల్లగ చలియించే నీ చరణం
నింగిని విహరించే ప్రతి మేఘం పొంగిన ప్రేమకు సందేశం
ఊహలే ఊసులై ఆశలే బాసలై
హే హే..ఊహలే ఊసులై ఆశలే బాసలై
మధువులు చిలుకగా మధురిమలొలకగా
ప్రణయవేద మంత్రమేదో పలుకగా

వలచిన జంటను కనగానే చిలకలకే కన్ను చెదిరిందీ
కవితలకందని పలుకులలో కమ్మని దీవెన కురిసిందీ
కడలియే గగనమై గగనమే కడలి ఐ
సహచరి నడకల స్వరఝరి తొణకగ
సరసరమ్య దివ్యసీమ నిలుపగ