Showing posts with label Movie - Om Shanthi. Show all posts
Showing posts with label Movie - Om Shanthi. Show all posts

07 June 2010

నేను నేనుగా ఇక లేనెలేనుగా

I follow you raama chilakaa..
u can find me niku thelusa?
now the lights on.here the sounds on..
now you start singing only for me..

నేను నేనుగా ఇక లేనెలేనుగా..
నేను నేనుగా ఇక లేనెలేనుగా..
వెలుగు నీడలా వెంటాడుతోందిగా..
మేఘాల మెరుపు దారుల్లో..
ఊరేగాలా తనువు తారల్లో..
ఓ నేస్తం ఈ మాయే నీదేనా?

I am flying on the moon...flying on the moon..

నేను నేనుగా ఇక లేనెలేనుగా..
వెలుగు నీడలా వెంటాడుతోందిగా..



కోరుకున్నవన్ని కలగనే కన్ను..
కానరాని నిన్నే వెతుకుతోంది..
నిన్న లేని ఆశే ఇపుడిలా నన్ను..
నిన్ను చూపమంటూ తరుముతోంది..
గాలివెంట తిరుగు ఊహకీ..
గమ్యమంటు ఒకటి ఉందనీ..
ఆకతాయి గడుసు గుండెలోనా..
ఆశయాలు తెలుపు జీవితాన్నీ..
ఈ రోజు నాకు చూపింది నువ్వా?..
చీకటే చేరినా తొడయ్యే వెలుగువా?..

నేను నేనుగా ఇక లేనెలేనుగా..
వెలుగు నీడలా వెంటాడుతోందిగా..



ఉన్నపాటుగానే పరిచయం మంచి
ఊహలెన్నో రేపి అల్లుకుంది
అందమైన లోకం ఎదురుగా వచ్చి
అంతు లేని హాయే పంచుతోంది
ఇప్పుడింక ఎవరు ఆపినా
వెల్లువైన మనసు ఆగునా
నింగిలోని తళుకు తారనైనా
తెంచుకొచ్చే తెగువ నేనయ్యానా?
ఏ చోటనున్నా నీ గుర్తులేనా?
మాటలే బాటలై నన్నిలా నడిపెనా?


నేను నేనుగా ఇక లేనెలేనుగా..
వెలుగు నీడలా వెంటాడుతోందిగా..
మేఘాల మెరుపు దారుల్లో..
ఊరేగాలా తనువు తారల్లో..
ఓ నేస్తం ఈ మాయే నీదేనా?

I am flying on the moon...flying on the moon..
I am flying on the moon...flying on the moon..
I am flying on the moon...flying on the moon..