Showing posts with label Movie - Pachani Kapuram. Show all posts
Showing posts with label Movie - Pachani Kapuram. Show all posts

07 June 2010

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
నీతొనే జీవితమూ నీప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధమూ
ఏ జన్మదో ఈ బంధమూ నింగి నేలా సాక్ష్యాలు
నింగి నేలా సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు

జ్ఞాపకమేదో నీడల్లే తారాడే
స్వప్నాలేవో నీ కళ్ళలోఆడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదూ
చుక్కలైనా నిన్ను నన్ను చూడకూడదూ
నీ సర్వమూ.. నాదైనదీ
నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే
ఏకమైన రాసలీలలోనా

అంతంలేనీ నీ రాగబంధంలో
అంచున నిలిచీ నీవైపే చూస్తున్నా
పున్నమింట కట్టుకున్న పూల డోలలూ
ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలూ
ఆముద్దులే మూడైనవీ
బాలచంద్రుడొస్తే నూలుపోగులిస్తా
ఇంటి దీపమాయె జంట ప్రేమ

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
నీతొనే జీవితమూ నీప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధమూ
ఏ జన్మదో ఈ బంధమూ నింగి నేలా సాక్ష్యాలు
నింగి నేలా సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు