Showing posts with label Movie - Rakshakudu. Show all posts
Showing posts with label Movie - Rakshakudu. Show all posts

03 June 2011

సోనియా సోనియా సోనియా సోనియా

సోనియా సోనియా
సోనియా సోనియా
సోనియా సోనియా
స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటు
పిల్లా కళ్లను చూసే చేసెయ్
గురువా ఫైటు

పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లే
చెక్కిళ్ళు తడితే అది నీటు
కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లే
ఒడి చేర్చుకుంటే అది నాటు
పచ్చిక మీద పడే చినుకుల మల్లే
చిరుముద్దులు పెట్టి శృతి చేయడమే నీటు
కసిగా మీద పడే ఉప్పెన మల్లే
చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు
నీ కురుల మీద పువ్వును నేనై
మురిపించేయాటలాడించనా
మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే
మంచంలో మాటలకీ చోటే ఉందే
మత్తెక్కే కౌగిట్లో ముంచేస్తా అమ్మడు

ఊరించే ఒడిలో ఉప్పొంగే తడిలో
బుగ్గల్ని ఎంచక్కా పిండేస్తుంటే
పరువాల పిలుపు కళ్లల్లో
మెరుపై గుండెల్లో సెగలే రగిలిస్తుంటే
కౌగిలి క్రికెట్ కి సిస్టమ్ లేదే
అంపైరు లేదే మగతనముంటే చాలే
పట్టీ పడదోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా
ఎద మల్లెల పూమాలోయ్
నలిపేకపోతే అందం లేదే
కసిలేని మోహం మోహంకాదే
కోమలితో వాదిస్తే అర్థముందా
కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా
ప్రేయసిని గెలిచేది నా చూపు తనమేగా

26 January 2011

నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది

నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది
కన్నుల కరిగిన యవ్వనమా
ఒంటరి బ్రతుకే నీదమ్మా నిన్నటి కధలే వేరమ్మా
నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది

పువ్వా పువ్వా నీ ఒడిలో ఒదిగిన క్షణం ఎక్కగే
కలిగిన సుఖం ఎక్కడే
అభిమానంతో తలవంచినా ప్రేమకి చోటెక్కడే
నిలిచితి నేనిక్కడే
కళ్ళలోని ముళ్ళుంటే కనులకి నిదరెక్కడే
వలచినవారే వలదంటే మనిషికి మనసెందుకే
నిన్నటి వలపే నిజమని నమ్మాను
నిజమే తెలిసి మూగబోయి వున్నాను
నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది
కళ్ళలోని ఆశా కరగదులే కౌగిలిలోనే చేర్చులే
నిన్నటి బాధా తీర్చులే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే

ప్రేమా ప్రేమా నా మనసే చెదిరిన మధువనమే
వాడిన జీవితమే
విరహమనే విధి వలలో చిక్కిన పావురమే
మరచితి యవ్వనమే
కలలొనైనా నిన్ను కలుస్తా ఆగనులే ప్రియతమా
లోకాలన్ని అడ్డుపడినా వీడను నిను నేస్తమా
చీకటి వెనుకే వెలుగులు రావా భాధేతొలిగే క్షణమగుపడదా
నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది
కళ్ళలోని ఆశా కరగదులే కౌగిలిలోనే చేర్చులే
నిన్నటి బాధా తీర్చులే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే

11 June 2010

చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా

చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా
కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2)
చందురుని తాకినది నీవేగా అరె నీవేగా
వెన్నెలని దోచినది నీవేగా అరె నీవేగా
వయసు వాకిలిని తెరిచే వయ్యరం నీ కలల మందారం శృతిలయల శృంగారం

ఓ.. పువ్వులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే (2)
పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే
ఓ.. తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా
తనువుని పొదువుకొని ప్రియునే కలుసుకున్నా
తాపాల పందిరిలో దీపమల్లే వెలుగుతున్నా
మగసిరి పిలుపులతో తేనెలాగా మారుతున్నా
కోరికల కోవెలలో కర్పూరమవుతున్నా
చందురునీ…. చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా
కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2)

రమ్మనే పిలుపు విని రేగుతోంది యవ్వనమే
ఏకమై పోదమంటూ జల్లుతుంది చందనమే
నీటిలోన చేప పిల్ల నీటికి భారమవునా
కోరుకున్న ప్రియసఖుడు కౌగిలికి భారమవునా
చెంత చేరి వచ్చినానే చెయ్యిజారి పోకే పిల్లా
పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల
ఓ.. అలిగిన మగతనమే పగపడితే వీడదు
చందురునీ…. చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా
కలల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం (2)