Showing posts with label Movie - Bhale Rangadu. Show all posts
Showing posts with label Movie - Bhale Rangadu. Show all posts

24 March 2010

అల్లరి చూపుల అందాల బాలా

అల్లరి చూపుల అందాల బాలా
నవ్వులు చిలికి కవ్వించువేళ
నీ ఆశలకే నే జాలిపడనా
నీ మాటలకే నే నవ్వుకోనా

నాలో మెరిసే నా రాణి రూపం
నీలోనే చూసి మురిసేను
రూపం చూసి పులకించినావు
మనసే తెలిసి మెలగాలి నీవు

ఆ సోయగమే నీలో కనిపించే
ఆ పిలుపే నేడే వినిపించే
జతగా విరిసిన రోజలు నీవో
పోలికలొకటే భావాలు వేరు

వయ్యారాల ఓ మరదలు పిల్లా
నీ మదిలోనే నే వున్నానే
ఆమె: చిలిపి మాటల ఓ బావ గారు
అంతటితోనే ఆగండి మీరు