Showing posts with label Lyrics - S Veerendra Reddy. Show all posts
Showing posts with label Lyrics - S Veerendra Reddy. Show all posts

04 June 2010

ఎన్ని ఊసులో ఎద గూటిలో

ఎన్ని ఊసులో ఎద గూటిలో
మూగబోయెనే విధి ఆటలో
ఏడురంగుల హరివిల్లులలో .. ప్రేమ వర్ణమే ఏమైనదో
నిను చేరు దారేది .. నిను కోరు వరమేది

ఓ నేస్తమా .. ఓ నేస్తమా !
ఓ నేస్తమా.. ఓ నేస్తమా !!

ఎన్ని ఊసులో ఎద గూటిలో
మూగబోయెనే విధి ఆటలో

రాలే పూల గుండెలో .. అలజడెన్నడు చూపునా
నవ్వే కళ్ళ మాటునా .. బాధ ఎరుగరు ఏడ్చినా
చెలిమే ప్రేమ వరమే ఇచ్చెనే .. ఓ ఓ
ఆ వరమే ముళ్ళ శరమై గుచ్చెనే ..ఓ ..హోహో

ఓపలేనీ వేదనా ..ఇది అంతులేనీ రోదన
ఎదలోతుల్లో సెలయేరల్లె కన్నీరు వరదాయెలే !

ఓ నేస్తమా .. ఓ నేస్తమా !.
ఓ నేస్తమా.. ఓ నేస్తమా !!

ప్రాణం అయిన బంధమా .. దూరమైతే భారమా
సాగే స్నేహగానమా .. మౌనమాయెను భావమా
గతమే తీపి కలగా వచ్చినా .. ఆ ..ఆ
కలిసే ఆశ కలగా మారెనే .. ఓ ..హోహో

కానరాని తీరము .. ఇది చేరలేని గమ్యము
ఎదసంద్రంలో అలసే నీకు ఓదార్చె దిక్కెవ్వరూ !

ఓ నేస్తమా .. ఓ నేస్తమా !.
ఓ నేస్తమా.. ఓ నేస్తమా !!

ఎన్ని ఊసులో ఎద గూటిలో
మూగబోయెనే విధి ఆటలో
ఏడురంగుల హరివిల్లులలో .. ప్రేమ వర్ణమే ఏమైనదో
నిను చేరు దారేది .. నిను కోరు వరమేది

ఓ నేస్తమా .. ఓ నేస్తమా !.
ఓ నేస్తమా.. ఓ నేస్తమా !!