Showing posts with label Lyrics - Sai Sri Harsha. Show all posts
Showing posts with label Lyrics - Sai Sri Harsha. Show all posts

24 June 2010

కొండకోనపాలైన సీతమ్మ మదిలోన

కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
సీత సర్వమూ రామ పాదము
రామచంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము
కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన

నీలాగ ఒకతుంటే ధర్మరాజు జూదరిగా పేరొందునా
భారతాన యుద్ధమునకు తావుండునా
లోపమంటూ లేనివాడు లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు
తప్పు దిద్దుకున్నవాడె ఆ దేవుడు
నీ సహనానికి నా భాష్పాంజలి
నీ హృదయానికి ఇది పుష్పాంజలి
ఏ దేవుళ్ళు దిగి వచ్చి దీవించినారో నోము పండెను

కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
రాయల్లె ఉన్న ఈ రామయ్యపైన

కన్ను కాచే రెప్ప నీవే
ఆకలైన వేళ అమ్మ లాలింపువే
కన్ను చెమ్మగిల్లు వేళ చెల్లమ్మవే
కంటి చెమ్మ చూడలేని
తోడు నీడ వీడలేని ఇల్లాలిని
జన్మ జన్మనందు నేను నీదానిని
ఈ జగమంతటా నిను తిలకించనీ
నీ సగభాగమై నను తరియించనీ
నా బంగారు కలలన్ని ఫలించి ఇల్లే స్వర్గమైనది

కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
సీత సర్వమూ రామ పాదము
రామచంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము
కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
రాయల్లె ఉన్న ఈ రామయ్యపైన

04 June 2010

సయ్యారి నాఎంకి వయ్యారి వల్లంకి కనిపెట్టి పట్టాలిరా

||పల్లవి||
సయ్యారి నాఎంకి వయ్యారి వల్లంకి కనిపెట్టి పట్టాలిరా
సింగారి నారంగి బంగారి సారంగి కనికట్టు కట్టాలిరా
మరి గట్టి ఒట్టుపెట్టి..... భూమంత చాపచుట్టి
జాబిలిని బతిమిలాడి..... సూరీడ్ని చితకబాది
పడదాం.... గుట్టు..... రట్టేచేయ..... చేయ
ఎరుపు..... బొట్టు..... ఛామన్‌ఛాయ.... ఛాయ
ఒక క్షణము మనము నిలువ వలదు ఉరకని ఉరుకుల పరుగులుగా
తన ఉనికిగనక కునుకు తగదు గడవని గొడవల ఘడియలురా
ఇదిరా తరుణి తరుణం మిగతా తరువాతరా..... ||సయ్యారి||

||చరణం 1||
చిరుతత్తరది..... కడుబిత్తరది లలనా......
బలెచక్కనిది... బహుటక్కరిది జాణా.......
అరె ఎక్కడ ఎక్కడ చప్పున చెప్పర తొందరగున్నదిరా
ఇంతకుముందర ఎప్పుడు చూడని వెన్నెలసానిదిరా
చిక్కులుపెట్టుట చక్కగ నేర్చిన టక్కులమారిదిరా
హా..... ఇక్కడె ఇక్కడె పక్కనె పక్కనె నక్కుతు ఉన్నదిరా
ఇలలో కలగా మెరిసే మగువను విడలేనురా........ ||సయ్యారి||

||చరణం 2||
ఎందిర ఇది సుందరి అని రందిన పడుతూ.......
మాపని సరి తన్నులుతిని రంకెలు పెడుతూ....
మది మరచిన మన కళలను తను తడుమునురా
వెలుగారిన తెలుగందం తల నిమురునురా
సృష్టే ఏమైనా నా దృష్టే తనపైన
ఎవరు ఎదురైనా ఇక నన్నే ఆపేనా
ఆ అందం ఆ చందం ఆ పరువం ఆ గర్వం ఆ సర్వం అది నా సొంతం ||సయ్యారి||

అతనొక్కడేలే అందర్లోను

అతనొక్కడేలే అందర్లోను
ఈ జీవితమంటే ఓ కోరికరేపే అతనొక్కడేలే
అతనొక్కడేలే ఎవ్వరికైనా ఓదార్పును చూపే
ఓ దారిని చూపే అతనొక్కడేలే
అతనొక్కడేలే అతనికి తోడు ఆనందంలోను బాధే అయిననూ
అతనొక్కడేలే అందర్లోను తానొలడై కూడా ఉన్ననూ.....

ఈ లోకమంతా మనలో ఉంది మనకోసం ఉంది
మనతోడై ఉంది నీడనంది
మదికోరుకుంది ఇస్తానంది నవ్విస్తానంది
కవ్విస్తానంది నేస్తమంది
మనమొంటరైతే వెంటే ఉంది
మనజంటే అంది ప్రాణం లాంటిది
మన బాధ అంతా నాదేనంటూ నేనున్నానంటు అన్నది

ఓ చిన్ని ఆశతో సాగావంటే
కేకేసావంటే ఆకాశంకూడా అదిరిపోదా
నీ చిన్ని గుండెలో దాచావంటె
భూగోళంకూడా భూపాలంతోటి నిదురపోదా
ఏం చెయ్యాలన్నా నీలో ఉంది
అడుగేసావంటే అడ్డేఉన్నదా
నీఅంత నువ్వే వద్దన్నావో నీవద్దే అంతా చెరదా

నువు పుట్టిన రాశి ఏమో కానీ ఓ ప్రేమమ్మా

నువు పుట్టిన రాశి ఏమో కానీ ఓ ప్రేమమ్మా
నీ కలయిక నుదుటన రాసి లేదు ఇదియే నిజమమ్మా

నువు పుట్టిన రాశి ఏమో కానీ ఓ ప్రేమమ్మా
నీ కలయిక నుదుటన రాసి లేదు ఇదియే నిజమమ్మా
కన్నులు నిండే హాయిలో నువ్వే కలవమ్మా
కన్నుల నిండా నీటితో నీకిక సెలవమ్మా
ఇప్పటికింతే సంగతులూ వెళ్ళిపోవమ్మా..మంచిరోజులొచ్చాక మళ్ళీ రావమ్మా !

శతమానం భవతని అన్నది ఆ లోకం
జతమానం అన్నా వినదే ఈ లోకం

నువు పుట్టిన రాశి ఏమో కానీ ఓ ప్రేమమ్మా
నీ కలయిక నుదుటన రాసి లేదు ఇదియే నిజమమ్మా

కలసిన మనసుల గాధా..కళ్యాణాలే కాదా
కలలే చిదిమీ కల చేసేవో ఏమో మరీ
నీకే ఇంతటి ఘనతా..ఇది ఒక నూతన చరితా
చెరిపేసేవో తెగ మురిసేవో నీవే సరీ

ఎదిరించే ఆ బలమేమో ప్రేమికులకుందీ
ఎదిరిస్తే చిరునామా నీకెక్కడుందీ
నీకే..లేదూ..నీ పైన అభిమానం !

శతమానం భవతని అన్నది ఆ లోకం
జతమానం అన్నా వినదే ఈ లోకం

వాకిలి వరకూ వచ్చీ..రమ్మని పిలుపే ఇచ్చీ
తీరా వస్తే తీరాలన్నీ మూసేవులే
నిన్నే గెలిపించేసీ..త్యాగాలెన్నో చేస్తే
ఆ లైలా మజ్ఞూ కధనే తిరిగీ రాసావులే

నిలువెల్లా నీ మదికే ప్రతిబింబమైనా
నలుసంతా దయలేదా నీ మనిషి పైనా
వ్యధనే..సుధగా..ఇచ్చావు బహుమానం !

శతమానం భవతని అన్నది ఆ లోకం
జతమానం అన్నా వినదే ఈ లోకం
శతమానం భవతని అన్నది ఆ లోకం
జతమానం అన్నా వినదే ఈ లోకం

చినుకై రావా..

చినుకై రావా..
చిలకై రావా..
చిన్ని గుండెలో..నువు చిందులెయ్యగా

వలపై రావా..
వరమై రావా..
సంధ్యవేళలో..స్నానాలు చేయగా

నీ మోము చూపగా అద్దమై జాబిలీ..వళ్ళంత కళ్ళులే కోమలీ
ఈ వెన్నెలేమిటో తీయనీ అల్లరీ..లోలోన చేసెలే ఎందుకో మరీ
ఈ గాలిలో ఊగాలిలే ఓ సారి వచ్చెయ్ వా ..వా.. వా.. వా !

చినుకై రావా..
చిలకై రావా..
చిన్ని గుండెలో..నువు చిందులెయ్యగా

'ఒరేయ్ సిద్దూ..ఏం చేస్తున్నావ్ ? ఎలా ఉన్నావ్ ?
హుం ! నాకేమో పిచ్చి పిచ్చి కలలన్నీ వస్తున్నాయ్ !
నిన్ను చూడాలని ఉంది ప్లీజ్ !'

నీ ఊహ ఎక్కడుంది?
నీలోన ఉందీ
నన్నేవి చేస్తుంది?
ఊరిస్తూ ఉంది
ఏమి ఘటనా..ప్రేమ నటనా..ఎంత పని చేసింది

ఎచట నేను ఉన్నా..
ఆ చోటే ఉన్నా
ఏ మాట నేను అన్నా..
ఆ మాటే విన్నా
ఎవ్వరమ్మా..ఎప్పుడమ్మా..ప్రేమ కనిపెట్టిందీ

ఏ మాయ చేసిందో నీ కొంటే మనసూ
ఏ మంత్రమేసిందో నాకేవి తెలుసూ

వేవేల వందనాలు వెన్నెల్లో చందనాలు చల్లేసి వచ్చెయ్యవా..వా..వా..వా !

వలపై రావా..
వరమై రావా..
సంధ్యవేళలో..స్నానాలు చేయగా

' హ హ హ ..ఏయ్ మహీ !
ఒసేయ్ దొంగమొహమా ! ఎందుకే నన్నిలా ఇబ్బంది పెడతావ్ !
నిద్దర రావట్లేదే..చచ్చిపోతున్నానే..'

చూడాలి నిన్ను నేనూ..
నీ నీడ నేను
కళ్ళల్లో దాచలేనూ..
నేనుండలేను
ఇంతవరకూ..ఇంత వింతా..మించినది మరి లేదూ !

నా ఊపిరంత నువ్వే..
చీకట్లో దివ్వే
చిందించు చిన్న నవ్వే..
నీ పైన లవ్వే
ఊహనైనా..ఊగలేదూ..గుండె గుడి ఉయ్యాలా !

నా కంటీ నీడల్లో నీ రూపు చూసా
నా గుండెమేడల్లో నీ బొమ్మ వేసా

జన్మంత ప్రేమకిచ్చి..జాబిల్లి చేతికిచ్చి..ఓ జాబు పంపించవా..వా..వా..వా !

చినుకై రావా..
చిలకై రావా..
చిన్ని గుండెలో..నువు చిందులెయ్యగా

వలపై రావా..
వరమై రావా..
సంధ్యవేళలో..స్నానాలు చేయగా

నీ మోము చూపగా అద్దమై జాబిలీ..వళ్ళంత కళ్ళులే కోమలీ
ఈ వెన్నెలేమిటో తీయనీ అల్లరీ..లోలోన చేసెలే ఎందుకో మరీ
ఈ గాలిలో ఊగాలిలే ఓ సారి వచ్చెయ్ వా ..వా.. వా.. వా !

కదిలే కాలమా కాసేపు ఆగ వమ్మ

కదిలే కాలమా కాసేపు ఆగ వమ్మ
జరిగే వేడుక కళ్ళాన చూడ వమ్మ
పేరిగే కధలగ సీమంత మాయలే ప్రేమ దేవతకు నేదే

కధిలె||

లాలించే తల్లి పాలించే తండ్రి నేనేలే నీక్కన్ని
కానైన అమ్మ నీకంటి చమ్మ నే చూడలేను అమ్మ
కనీళ్ళలో చెలికడినే
నీ కడుపులో పసివడినే
యే నాడు తోడుని నీడను వీడనులే

కధిలె||

తాతైయ్య పేజం పేదనన్న నైజం
కల్లిసున పసి రూపం
నీ రని తోనము నా రాచ గుణము ఒకటైన చేరు దీపం
పేరుగేనులే నా అంసము వేలిగేనులే మా వంసము
ఏన్నేనో తరమలు తరగేని యేసముల్లతో

ఎన్నో నోముల్లే గత మందు నోచ్చి వుంట
మీకే భర్యనై ప్రతి జన్మ అంధువుంట
నదిచే దైవమ
నీ పాద ధుళ్ళులే పసుపు కుంకముల్లు నాకు

ఎన్నో నోముల్లే గత మందు నోచ్చి వుంట
మీకే భర్యనై ప్రతి జన్మ అంధువుంట

03 June 2010

వెన్నెల్లొ హయి హయి మల్లెల్లొ హయి హయి

హయి హయి హయి హయి
వెన్నెల్లొ హయి హయి మల్లెల్లొ హయి హయి
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హయి హయి త్రుంపెత్లు హయి హయి
ఇవ్వాళ మనసే మురిసే
మే నెల్లొ ఎండ హయి ఆగస్ట్ లొ వాన హయి
జనవరి లొ మంచు హయి హయి రామ హయి
హయిగుంటె చాలు నండి వెయ్యి మాటలెందుకండి

కనుల ఎదుట కలల ఫలము నిలిచిన్నది తందానా సుధ చిందేనా
కనులు గనని వనిత ఎవరొ మనకు ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లగైన కళ్ళారానే చూడాలి
పగలు మరి కల్లొనైన యెల్లొరాతొ ఆడాలి
మధుర లలన మదన కొలన కమల వదన అమల సదన
వదలతరమ మదికివశమా చిలిపితనమా
చిత్రమైన బంధమాయె అంతలొన అంతులేని చింతన అంతమంటు వున్నదేనా

గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఎం కావాలి
మదిని బరువు పెంచుకుంటు ఎవరికెం చెప్పాలి ఎం చెయ్యాలి
అసలు తను ఎల్లా వుందొ ఎంచేస్తుందో ఏమొలే
స్పెషల్ మనిషయినా కూడా మనకేముంది మామూలే
కళలు తెలుసా ప్రేమ బహుశ కవిత మనిషా కలల హంస
మనసు కుంచెం తెలుసుకుంది కలిసిపొయే మనిషి లాగ
మంచి పద్దతంటు వుంది మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది

ఎన్నెన్నో వర్ణాలు.........అన్నింట్లో అందాలు..........

ఎన్నెన్నో వర్ణాలు.........అన్నింట్లో అందాలు..........
ఎన్నెన్నో వర్ణాలు, అన్నింట్లో అందాలు, ఒకటైతే మిగిలేది తెలుపేనండి
నలుపేమో నాకిష్టం, మీ మనసు మీ ఇష్టం, నాకోసం మీ ఇష్టం వదలొద్దండి
మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపోండలా
మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపోండలా
ఇదే ఇదే నా మాటగా............పదే పదే నా పాటగా........

నేనంటూ ప్రత్యేకం, నాదంటూ ఓ లోకం, పడలేను ఏజోక్యం అంతేనండి
బాగుంది మీ టెస్టూ, నాకెంతో నచ్హేట్టు, మనసెంతో మెచ్హేట్టు, మీ మీదొట్టు
అందుకె నే దిగివచ్హా, వంచని నా తల వంచా, స్నేహభావమా
కలా నిజం నీ కోసమే....... అనుక్షణం ఉల్లాసమే........

పొగడమాకు అతిగా.... చెసెయ్యమాకు పొగడపూల లతగా

పొగడమాకు అతిగా.... చెసెయ్యమాకు పొగడపూల లతగా.....
రాసినావు చాలా.... ఆ రాతలంత నేను ఎదిగిపోలా.......
నువ్వనే వచ్హింది నానోట చనువుగ
పిలుపులొ తడబాటు ఆ మాట పలుకగ
తెలుసుకుంటి పొరబాటు.........

నువ్వు అంటు పిలువు........నాకెంతో నువ్వు దగ్గరైన తలపు
పరిచయాల మలుపు... దాచేసుకున్న మాటలన్ని తెలుపు
చిగురులే వేశాయి ఈ కొమ్మ హొయలుగ
పూవులై పూసేను ఈ జాబు చదవగ
ఊహలేవో ఉదయించే..........

కథలో రాజకుమారి ప్రేమగమారి పిలిచేరా

||పల్లవి||
కథలో రాజకుమారి ప్రేమగమారి పిలిచేరా.........
ఇలలో రాజకుమరుడు రాజసవీరుడు నిలిచేరా........
హ్రుదయములోని మనసును రేపీ....... బ్రతుకులలోని తీపిని చూపీ.........
కొవెలమ్మ మెట్టు, ప్రేమ ఒట్టు, గట్టు చూపెట్టితీరేట్టు........ ||కథలో||

||చరణం 1||
ఆలయమందున్నది......... ఆరిపోనట్టి ప్రేమేరా..........
ఆకాశము నేల ఒకటై వచ్హేసి ఆశీస్సులిచ్హేనురా
ప్రేమొక పిచ్హిదిరా........ ప్రాణమిచ్హేంత మంచిదిరా.........
చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ ఆ ప్రేమ అందేనురా
కొరుకున్న కోరికలూ........సాగిపోవు దీపాలు...........
చేరువగును చేరికలూ......తీరిపొయి శాపాలు............
శుభకరములు, తన కరములు వరమాలై అల్లేరా......... ||కథలో||

||చరణం 2||
శ్రావణ మూర్తాలలో......... ప్రేమ ప్రమిదలు వెలిగేరా.........
తాళాలు రేగంగ, మేళాలు మోగంగ మాంగల్యధారణరా
బంగరు మేఘలురా.....రంగు పందిళ్ళు వేసేరా.........
కళ్ళకు దిద్దందగ ఆ నీలి మేఘం కాటుక అయ్యేరా...........
తార బొట్టు పెట్టేను........తాళిబొట్టు అల్లేను........
నింగి వేదికేసేను....... చూడ వేడుకయ్యేను.......
వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్ళే జరిగేరా.............. ||కథలో||