Showing posts with label Lyrics - Indraganti Srekanth Sharma. Show all posts
Showing posts with label Lyrics - Indraganti Srekanth Sharma. Show all posts

03 June 2010

ఈ కోవెల వాకిలిలో .. ఏదో అడుగు సవ్వడి

'ఈ కోవెల వాకిలిలో .. ఏదో అడుగు సవ్వడి ..
ఏ దేవుడు దయతో నా ఎదలో .. అడుగిడు .. వడి వడి '

కనుబొమ్మల పల్లకిలోనా ..
కన్నెసిగ్గు వధువయ్యిందీ .. విరి మొగ్గల మధువయ్యిందీ
హరివిల్లై పెదవి వదలినా ..
చిరునవ్వే వరమయ్యిందీ .. సిరిమువ్వల వరదయ్యిందీ

నీ కన్నుల వెన్నెల చూసీ ..
మనసే చిరుతరగయ్యిందీ .. కృష్ణవేణి పరుగయ్యిందీ
దయ నిండిన గుండెను చూసీ ..
తనువే ఒక పులకయ్యిందీ .. నును సిగ్గుల మొలకయ్యిందీ

కనురెప్పల గొడుగును వేసీ .. తోడునీడనౌతాను
అడుగులకే మడుగులుగా .. నా అరచేతులు పడతాను

నీ జడలో మొగలిరేకునై .. బతుకు పంచుకుంటాను
నీ జడలో మొగలిరేకునై .. బతుకు పంచుకుంటానూ !

కనుబొమ్మల పల్లకిలోనా ..
కన్నెసిగ్గు వధువయ్యిందీ .. విరి మొగ్గల మధువయ్యిందీ
హరివిల్లై పెదవి వదలినా ..
చిరునవ్వే వరమయ్యిందీ .. సిరిమువ్వల వరదయ్యిందీ

అంతరంగమిదుగో స్వామీ .. నేడు మీకు నెలవంటానూ
మూగబడిన నా గుండెలలో .. రాగలహరివనుకుంటానూ
అవధిలేని అంబరమే .. నా ఆనందపు పరిధంటానూ

అవధిలేని అంబరమే .. నా ఆనందపు పరిధంటానూ !

నీ కన్నుల వెన్నెల చూసీ ..
మనసే చిరుతరగయ్యిందీ .. కృష్ణవేణి పరుగయ్యిందీ
దయ నిండిన గుండెను చూసీ ..
తనువే ఒక పులకయ్యిందీ .. నును సిగ్గుల మొలకయ్యిందీ