Showing posts with label Movie - Erra Mallellu. Show all posts
Showing posts with label Movie - Erra Mallellu. Show all posts

12 May 2010

నాంపల్లి టేషను కాడి రాజాలింగో

నాంపల్లి టేషను కాడి రాజాలింగో...రాజాలింగా...
రామ రాజ్యం తీరం సూడు శివా శంబు లింగా
లింగా రామ రాజ్యం తీరం సూడు శివా శంబు లింగా

తిందామంటే తిండీ లేదూ వుందావంటె ఇల్లే లేదు
తిందామంటే తిండీ లేదూ వుందావంటె ఇల్లే లేదు
చేద్దామంటే కొలువూ లేదు పోదామంటే నెలవు లేదు

||నాంపల్లి||

గుక్కెడు గంజీ కరువై పాయే బక్కడి ప్రాణం బరువై పాయె...
గుక్కెడు గంజీ కరువై పాయే బక్కడి ప్రాణం బరువై పాయె...
బీదా బిక్కీ పొట్టలు గొట్టి మేడలు గట్టే చీకటి శక్తీ

||నాంపల్లి||

లేని అమ్మదీ అతుకుల బతుకు వున్న బొమ్మకీ అందం ఎరువు
కారుల్లోనా తిరిగే తల్లికి కట్టే బట్టా బరువై పాయె..

||నాంపల్లి||

ముందు మొక్కులూ ఎనక తప్పులూ వున్న వాడికే అన్ని చెల్లును
ముందు మొక్కులూ ఎనక తప్పులూ వున్న వాడికే అన్ని చెల్లును
వులకావేమీ పలకావేమీ బండా రాయిగ మారిన సామి...

||నాంపల్లి||