Showing posts with label Movie - Jockey(1985). Show all posts
Showing posts with label Movie - Jockey(1985). Show all posts

07 June 2010

అలా మండి పడకే జాబిలీ

అలా మండి పడకే జాబిలీ..
చలీ ఎండ కాసే రాతిరీ..
దాహామైన వెన్నెల రేయీ
దాయలేను ఇంతటి హాయి
ఎలా తెలుసుకోనూ ప్రేమనీ
ఎలా పిలుచుకోను రమ్మనీ

నిన్ను చూడకున్నా నీవు చూడకున్నా
నిదురపోదు కన్ను నిశిరాతిరీ..
నీవు తోడు లేకా నిలువలేని నాకు
కొడి కట్టనేలా కొన ఊపిరీ
ఇదేనేమో బహుశా తొలినాటి ప్రేమా
ఎలా పాడుకోను నిట్టూర్పు జోలా
ఈ పూలబాణాలు ఈ గాలి గంధాలు
సోకేను నా గుండెలో తుది లేని సయ్యాటలో


పూటకొక్క తాపం పూల మీద కోపం
పులకరింతలాయె సందెగాలికీ
చేదు తీపి ప్రాణం చెలిమిలోని అందం
తెలుసుకుంది నేడే జన్మ జన్మకీ
సముఖాన ఉన్న రాయబారమాయే
చాటు మాటునేవొ రాసలీలలాయె
ఈ ప్రేమ గండాలు ఈ తేనె గుండాలు
గడిచేది ఎన్నాళ్ళకో కలిసేది ఏనాటికో

కరివరద మొరను వినలేవా..శశివదన చెలిమి కనలేవా...

కరివరద మొరను వినలేవా..శశివదన చెలిమి కనలేవా...
నా మాటే మన్నించీ..నాతోటే నిన్నుంచీ మన రాదా మహరాజా
బిరానా చేరుకోరా సరాగమాడుకోరా వరించి ఏలుకో...వసంతమాడుకో..

||కరివరద ||

హా ఆ హ్హా జాజి పూలే చూసే జాలిగా..
హే ఏ హ్హే జంట కమ్మాన్నాయి జాలీ గా..
తెలుసు నా జాకీ నువ్వనీ..అహా మనసే రాజాల రవ్వనీ..
ఓ రాకుమారుడా.. నీ రాక కోసమే వేచి వేచి వేగుతున్నాను రా..

||కరివరద ||

హా ఆ హ్హా ఎందుకో నువ్వంటే ఇది ఇది గా...
హే ఏ హ్హే అందుకే నీ తోడు నేనడిగా...
చెంగు ఎన్నటికీ వదలకూ..ఏయ్ చెలిమి ఎప్పటికీ విడవకూ..
ఓ ఈ ప్రతాపమా ఓ హో నా ప్రియతమా పేచీ మాని రాజీకొచ్చేయరా...

హయగమన మొరలు వినలేనా శశివదన మనసు కనలేనా...
నన్నల్లే నిన్నెంచీ నాలోనే నిన్నుంచీ
వలచానే వల రాణి
బిరాన చేరుకోనా సరాగమాడుకోనా వరించి ఏలనా...వసంతమాడనా
లలాలలాలలాలలాలలాలలా