Showing posts with label Movie - Super Police. Show all posts
Showing posts with label Movie - Super Police. Show all posts

07 June 2010

పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని

పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని...
పూల పక్కే వేసి చక్కా వస్తావా ||2||
ఆఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా
పాల చుక్కే చూసి పై పైకొస్తావా... ||2||
కులాసాలా ఘంటసాలా కొత్త కూనిరాగమందుకో...
మారా ఓ కుమారా కుర్ర కూచిపూడి ఆడుకో...

||పక్కా జెంటిల్మాన్ ని||

ఆడోళ్ళు మెచ్చినవాడ్నీ...ఆఆ..ఆ.
ఆడోళ్ళు మెచ్చినవాడ్నీ ఈడోళ్ళ లో చిన వాడ్ని
యే రాసలీలకైన గాన లోలుడైన వాణ్ణి
కుర్రోళ్ళు కోరిన దాన్ని కుచ్చీళ్ళు జారిన దాన్ని
ఏ ప్రేమ లేఖ రాక చిన్న బోయి ఉన్న దాన్ని
పాట సిరి వేటలాడి పైత చాటు లడిగిన వాడ్ని
ఆటలకు హంస లాడె ఆడగాలి తగిలిన వాడ్ని..
అజంతాల అందాలన్ని కుదించి మధించి వధించి పోరా..

||పక్కా జెంటిల్మాన్ నీ||

పైటేసి పుట్టినదాన్నీ ఆ...ఆ..ఆ..ఆ
పైటేసి పుట్టినదాన్ని మొగ్గేసి పెరిగిన దాన్ని
యే తీపి కాటుకైన ఓపలేని వయ్యారాన్ని...
మాటేసి పొంచిన వాణ్ణీ మావిళ్ళు విసిరిన వాణ్ణి
నీ కోణమంటుకున్న పూల బాణమంటి వాణ్ణి..
నిన్ను గని కన్నె ఈడు జున్నులార విడిచిన దాన్ని
వెన్నెలకు వేసవల్లే మల్లె సోకు విరిసిన దాన్ని
వసంతాలు నాతో ఆడి రసాల కితాబు రచించి పోవే
పక్కా...ఆహా...100%

||పక్కా జెంటిల్మాన్ ని ||