Showing posts with label Movie - Sriranga Nithullu. Show all posts
Showing posts with label Movie - Sriranga Nithullu. Show all posts

02 June 2010

పంచమి పూటా మంచిదనీ మాటిచ్చాను పొరపాటు

పంచమి పూటా మంచిదనీ మాటిచ్చాను పొరపాటు..
వచ్చేవారంముచ్చటనీ రాసిచ్చను ఎదచాటు..
ఆ మాటే నా కొంప ముంచిందీ.. ఆ రాతే నా దుంప తెంచిందీ.. ||౨||
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో
అయ్యో పాపం మంచోడనీ చనువిచ్చాను పొరపాటూ..
ఊపిరి నేనే అన్నాడనీ మనసిచ్చాను గ్రహపాటూ..
ఆ చనువే నా కొంప ముంచిందీ ఆ మనసే నా దుంప తెంచిందీ..||2|\
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో

కళ్ళల్లోకీ చూస్తే సంకెళ్ళు వేసేస్తావు.. నీ పైట చాటుకు వస్తే చాపల్లె చుట్టేస్తావూ
కలలోకి రావద్దన్నా వస్తావు రేయంతా..
ఈ ప్రేమ ముద్దరలన్నీ వేస్తావు ఒళ్ళంతా
సరదాలే ఈ వేళా సరిగమలే పాడాయి
ఆ మాటే అన్నావు చాలింకా నీ మోజే మళ్ళిందీ నా వంక
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో

||పంచమి||

ఎదురుగ ఉన్నా కానీ ఎదలోకి రమ్మన్నానా
ఎగతాళికన్నా కాని నను దోచుకొమ్మన్నానా
వగలన్నీ చూస్తూ ఉంటే వయసూరుకుంటుందా
కనుసైగ చేస్తూ ఉంటే వలపాపుకుంటుందా
సరికొత్త గుబులేదో గుండెల్లో రేపేవు
ఈ వింతే పులకింత కావాలి నీ చెంతే బ్రతుకంత సాగాలి
అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో

||పంచమి||

అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా

అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా...||అందాలమ్మా||
ఉత్తరాన మబ్బుల్లాగా కొత్తనీటు పొంగుల్లాగా ||2||
సిత్తరాలు చూపించాలమ్మా

అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా...||అందాలయ్య||
సన్నజాజి రమ్మంటుందీ సందె పొద్దు సయ్యంటుందీ.. ||2||
ఆశలన్నీ నువ్వే కన్నయ్యా...

||అందాలమ్మా||

చూపూ చూపూ చేరాలీచోటా రోజూ మోజూ తీరాలీపూటా
నీలో నేను నిండుగ నిండాలి నీతో నేనూ నీడగ సాగాలి
పాడాలి ముచ్చట్లే పసిడి తలపు తలుపు తెరచి
కొట్టాలి చప్పట్లే మూగ మనసు ఆద మరిచి..
చిందాలి సందళ్ళే చిలిపి చిలిపి వలపు చినుకు
వెయ్యాలి బంధాలే నింగీ నేల నిలుచు వరకు
ఆయోగం నాదీ అనురాగం నీదీ అదే అదే పదే పదే నా గుండె కోరేది

||అందాలమ్మా||

పూచే పువ్వు నీలా నవ్విందీ.. పోంగే తేనే నాదేనంటుందీ..
పారే వాగు నీలా దూకిందీ రేగే జోరూ నాదే నంటూందీ..
చూడాలి చూపుల్లో గడుసు వయసు సొగసులన్నీ
తీరాలి నవ్వుల్లో దుడుకు మనసు ఛణుకులన్నీ
చూసానూ నీలోనూ కన్నుల ఎరుపు కలల మెరుపు
విన్నాను నీలోను మమత తెలుపు మనసు పిలుపు
ఇంకెందుకంటా ఈ వాదులాట అంతే చాలు అంతే చాలు నా పంట పండిందీ

||అందాలమ్మా||

13 February 2010

లా..లా...హె.హె..లా..

లా..లా...హె.హె..లా..


తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంతా తెలుసుమాకు చందమామా
దోరదోర వయసులో చందమామా
ఆ తారనేంచేశావు చందమామా
వావి వరస చూశావ చందమామా
నీ వయసునాపుకున్నావ చందమామా
అంత మచ్చ పెట్టుకొని చందమామా
నీకెందుకింత మశ్చరం చందమామా


వెన్నెల్లో వేడుకుంది కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
ఇద్దర్లో వేగముంది వద్దన్న ఆగకుంది పైడిబొమ్మా
పూలబాణాలు వేసుకుందమా ప్రేమగాయాలు చేసుకుందమా
పూలబాణాలు వేసుకుందమా ప్రేమగాయాలు చేసుకుందమా
కలిసే ఉందామా కరిగే పోదామా
హొయ్ చుప్పనాతి చుక్కల్ని దాటుదామ
అరె చూడలేని చంద్రున్ని తరుముదామా


గుండెల్లో తాళముంది గొంతుల్లో రాగముంది కలుపుదామా
పొద్దెంతో హాయి ఉంది ఎంతెంతో పొద్దు ఉంది గడుపుదామా
ముద్దు మురిపెంలో మునిగిపోదమా తీపి తాపాలలో తేలిపోదమా
ముద్దు మురిపెంలో మునిగిపోదమా తీపి తాపాలలో తేలిపోదమా
స్వర్గం చూద్దామా సొంతం చేద్దామా
ఆ మశ్చరాలు మాననీ మచ్చమామా
దండమెట్టి ఇద్దరం కొలుచుకోమా


తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంతా తెలుసుమాకు చందమామా
దోరదోర వయసులో చందమామా
ఆ తారనేంచేశావు చందమామా
వావి వరస చూశావ చందమామా
నీ వయసునాపుకున్నావ చందమామా
అంత మచ్చ పెట్టుకొని చందమామా
నీకెందుకింత మశ్చరం చందమామా