Showing posts with label Movie - Nee Sneham. Show all posts
Showing posts with label Movie - Nee Sneham. Show all posts

23 June 2010

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం

ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం
ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం
ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం
o honey I love u o honey I need u

1--> నమ్మనంటావొ ఏమో నిజమే తెలుసా అమౄతం నింపే నాలో నీ చిరు స్పర్శ
ఒప్పుకొలేవొ ఏమొ మురిసే మనసా రెప్పనే దాటి రాదే కలలో ఆశ
పొద్దే రాని నిద్దర్లొనే ఉండి పోని నినే చూసే కలకోసం
సర్లే కాని చీకట్లోనే చేరుకొని నువ్వు కోరె అవకాశం
తక్కువేం కాదు లే ఈ జన్మలో ఈ వరం

2--> వానలా తాకగానే ఉరిమే మేఘం వీణలా మోగుతుంది యదలో రాగం
స్వాగతం పాడగానే మదిలో మైకం వచ్చి వడి చేరుతుందా ఊహలొకం
ఉన్నటుండి నిన్నట్నుండి రాజ యోగం దక్కినంత ఆనందం
అయ్యొ పాపం యకడలేని ప్రేమ రోగం తగ్గదేమొ యే మాత్రం
తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం

11 June 2010

ఏమో అవునేమో నిజమేమో

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఏంచేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో

ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం
మబ్బులో మెరుపులా తగలటం
అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం
నిద్రలో నడకలా సాగటం
ఆ మెరుపు కంటపడకుంటే
తన జంట కలిసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
చెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి
ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో

ఆమెనే వెతకటం అందుకే బతకటం
కొత్తగా ఉన్నదే అనుభవం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం
బొత్తిగా నేర్పదీ సతమతం
తన కంటి చూపులో మౌనం
చదివేదెలాగ నా హృదయం
తన గుండె గూటిలో నే వాలేదెలా
చెప్పమ్మా కలవరమా ఆమెతో నీ అలజడి

ఏమో అవునేమో నిజమేమో
నాలో మైమరపే రుజువేమో
ఏంచేసిందో ఆ చిన్నది
ప్రేమించేసానందీ మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి

18 April 2009

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా ఆ ఆ

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో బ్రహ్మ
స్వచ్చమైన వరిచేల సంపదలు
అచ్చతెనుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావె ముద్దుగుమ్మా
పాలకడలి కెరటాలవంటి నీ లేత అడుగు
తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా ఆ ఆ ఆ
ఆగని సంబరమా ఆ ఆ ఆ

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

వరములన్ని నిను వెంటబెట్టుకుని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మా
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగారకీర్తనం వర్ణనలకు ఆకారమైన
బంగారు చిలకవమ్మా
ఆ ఆ ఆ ఆ కముని సుమ శరమా ఆ ఆ

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

01 October 2007

వేయి కన్నులతో

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెరచాటు దాటి చేరదా నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవ నేస్తమా

నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్ను
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంతగా తపించినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా

ఊరుకో హృదయమా

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయట పడిపోకుమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల
నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా

చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా

దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరని మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చెయ్యనీ అభిమానం
నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా

కొంత కాలం కిందట

కొంత కాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపను కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా
నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి

బొమ్మా బొరుసు లేని నాణానికి విలువుంటుందా
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గల గల మని సిరిమువ్వగా కలతెరుగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై సాగాలి నీ స్నేహం

వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం
నువు నాలాగ నే నీలాగ కనిపించడమే సత్యం
నువు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదురించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలి ఈ స్నేహం