01 October 2007

ఊరుకో హృదయమా

ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా
మాట మన్నించుమా బయట పడిపోకుమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల
నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా

చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం
చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం
కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడి
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా

దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరని మమకారం
పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చెయ్యనీ అభిమానం
నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా
చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా

No comments: