20 October 2007

ఆవేశం రావాలి ఆవేదన కావాలి

ఆవేశం రావాలి … ఆవేదన కావాలి
గుండెలోని గాయాలు మండించే గేయాలు
గుండెలోని గాయాలు మండించే గేయాలు
వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు …. రగలాలి విప్లవాలు
ఆవేశం రావాలి … ఆవేదన కావాలి
నరజాతిని భవితవ్యానికి నడిపేదే ఆవేశం
పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన
వేగంతో వేడిమితో సాగేదే జీవితం … సాగేదే జీవితం
ఆవేశం రావాలి … ఆవేదన కావాలి
రణదాహం ధనమోహం కాలి కూలిపోవాలి
సమవాదం నవనాదం ప్రతి ఇంటా పలకాలి
ప్రతి మనిషీ క్రాంతి కొరకు రుద్రమూర్తి కావాలి … రుద్రమూర్తి కావాలి
ఆవేశం రావాలి … ఆవేదన కావాలి
తరతరాల దోపిడీల ఉరితాళ్ళను తెగతెంచి
నరనరాల అగ్నిధార ఉప్పెనలా ఉరికించి
మరో కొత్త ప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలీ …
నిదురించిన నా కవితను కదలించిన ఆవేశం
మరుగు పడిన నా మమతకు తెర విప్పిన ఆవేదన
కన్నుగప్పి వెళ్ళింది నన్ను మరచిపోయింది … నన్ను మరచిపోయింది ..

No comments: