28 October 2007

హత్తెరీ అదో మాదిరి

హత్తెరీ అదో మాదిరి
హరి హరి ఇదే మాధురి
హత్తెరీ అదో మాదిరి
హరి హరి ఇదే మాధురి
చేసావే చేతబడి
చెడిపోయే పాత మడి
చిక్కవే లేడి

గువ్వ గూడెక్కె గుండె వేడెక్కె
ఒళ్ళు ఊపెక్కె కళ్ళు మీదెక్కె
రా జరా ఇలా
మోజు ఆకట్టె ముద్దు జోకొట్టె
సిగ్గు అరికట్టె ముగ్గు గిలకొట్టె
జా మరో మజా
ముద్దొచ్చే కోరికలే ముందిచ్చే కానుకలై తేరాదా
ఒక్కొక్క మైవిరుపే పక్కేసే పై మెరుపై రారాదా
కొత్త గొంతొచ్చి కోన కూసింది కోయిలలా
హత్తెరీ అదో మాదిరి
హరి హరి ఇదే మాధురి
ఇన్నాళ్ళు మూతబడి
వున్నాది వలపు గుడి
వెయ్యనా బేడి
చేసావే చేతబడి
చెడిపోయే పాత మడి
చిక్కవే లేడి హోయ్

సందె చీకట్లో పొందు ముచ్చట్లొ
పండు వెన్నెట్లో పాడు నిదరట్లో
ఓ అదో సుఖం
మావి తోపుల్లో మండుటెండల్లో
ఏమీ దాగుళ్ళో ఎన్నీ కౌగిళ్ళో
ఆ అదో జ్వరం
పన్నీట ఆరేదా కన్నీట తీరేదా ఆ దాహం
వాకిట్లో ఆగేదా గుప్పిట్లో దాగేదా ఆ మోహం
జాము రేయొచ్చి ప్రేమ నవ్వింది జాబిలిలా

No comments: