తెల్లవారనీకు ఈ రేయిని .. తీరిపోనీకు ఈ తీయని హాయినీ
తెల్లవారనీకు ఈ రేయిని .. తీరిపోనీకు ఈ తీయని హాయినీ
తెల్లవారనీకు ఈ రేయిని
నీ కన్నులలో మధువులన్ని జుర్రుకుని … ఆ కైపులో లోకాలే మరువని
మనసులో మనసునై మసలనీ . మనసులో మనసునై మసలనీ
నీ మనిషినై మమతనై మురిసిపోనీ
తెల్లవారనీకు ఈ రేయిని .. తీరిపోనీకు ఈ తీయని హాయినీ
తెల్లవారనీకు ఈ రేయిని
నీ కురులే చీకటులై కప్పివేయనీ .. ఆ చీకటిలో పగలు రేయి ఓకటైపోనీ
నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ .. నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ
తడి ఆరని మదిలో నను మొలకలెత్తనీ
తెల్లవారనీకు ఈ రేయిని .. తీరిపోనీకు ఈ తీయని హాయినీ
తెల్లవారనీకు ఈ రేయిని
మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ … అల్లరి పడుచుదనం కొల్లబోనీ
కొల్లగొన్న మనసే నా ఇల్లనీ … కొల్లగొన్న మనసే నా ఇల్లనీ
చల్లగా కాపురమూ ఉండిపోనీ ..
తెల్లవారనీకు ఈ రేయిని .. తీరిపోనీకు ఈ తీయని హాయినీ
తెల్లవారనీకు ఈ రేయిని
No comments:
Post a Comment