28 October 2007

కల్యాణం కానుంది కన్నె జానకికీ

కల్యాణం కానుంది కన్నె జానకికీ కల్యాణం కానుంది కన్నె జానకికీ
వైభోగం రానుంది రామ చంద్రుడికి వైభోగం రానుంది రామ చంద్రుడికి
దేవతలే దిగి రావాలి జరిగే వేడుకకీ
రావమ్మ సీతమ్మ సిగ్గు దొంతరాలో రావయ్య రామ్మయ పెళ్ళి షొభలతో
వెన్నెల్లో నడిచె మబ్బులాగ వర్షంలో తడిసె సంద్రంలాగ
యేదేదో పువ్వులో చూసే కన్నుల్లో అంతా సౌందర్యమే
అన్ని నీ కోసమే

నాలో ఎన్ని ఆశలు అలల్లా పొంగుతున్నవి
నీతొ యెన్నీ చెప్పిన మరెన్నో మిగులుతున్నవి
కళ్ళల్లోనే వాలి నీలాకాశం అంత యెలా వొదిగిందో
ఆ గగనాన్ని యేలే పున్నమి రాజు యెదలో ఎలా వాలాడో
నక్షత్రలన్ని ఇలా కలలయ్యి వొచ్చాయి
చూస్తునె నిజమయ్యి అవి యెదటే నిలిచాయి
అణువణువు అమౄతంలో తడిసింది అద్భుతంగా

ఇట్టె కరుగుతున్నది మహ ప్రియమైన ఈ క్షణం
వెనకకు తిరగనన్నది యెలా కాలాన్ని ఆపడం
మదిల మంటె ఈడు తీయని సౄతిగా మారి యెటో పోతుంటే
కావాలంటే చూడు నీ ఆనందం మనతో తను వస్తుంటే
ఈ హాయి అంత మహ భద్రంగ దాచి
పాపాయి చేసి నా ప్రాణాలే పోసి నూరెళ్ళ కానుకల్లే

No comments: