20 October 2007

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్ని తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావా .. ఏడ తానున్నాడో బావా
జాడ తెలిసిన పోయి రావా …. అందాల ఓ మేఘమాలా
అందాల ఓ మేఘమాలా

గగన సీమల తేలు ఓ మేఘమాలా …
మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా
నీలాల ఓ మేఘమాలా … రాగాల ఓ మేఘమాలా
మమతలెరిగిన మేఘమాలా … మమతలెరిగిన మేఘమాలా
నా …. మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూసెనే బావకై ఎదని కాయలు కాసెనే
నీలాల ఓ మేఘమాలా … రాగాల ఓ మేఘమాలా …
మనసు తెలిసిన మేఘమాలా … మరువలేనని చెప్పలేవా
మల్లితో … మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గానీ
కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గానీ
మల్లి రూపే నిలిచెనే నా చెంత మల్లి మాటే పిలిచెనే
జాలిగుండెల మేఘమాలా … బావ లేనిది బ్రతుక జాలా
జాలిగుండెల మేఘమాలా … బావ లేనిది బ్రతుక జాలా
కురియు నా కన్నీరు గుండెలో దాచుకుని
వానజల్లుగ కురిసిపోవా … కన్నీరు పాలవాలుగ బావ గ్రోల …..

No comments: