20 October 2007

సరికొత్త చీర ఊహించినాను …

సరికొత్త చీర ఊహించినాను … సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత … పడుగు పేక … చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత … నా వన్నెల రాశికి సిరిజోత
నా వన్నెల రాశికి సిరిజోత
ముచ్చట గొలిపే మొగలిపొత్తుకు … ముల్లు వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు … అలక కులుకు ఒక అందం
నీ అందాలన్నీ కలబోసా .. నీ కొంగుకు చెంగున ముడివేస్తా
నీ అందాలన్నీ కలబోసా .. నీ కొంగుకు చెంగున ముడివేస్తా
ఇది ఎన్నో కలల కలనేత … నా వన్నెల రాశికి సిరిజోత
నా వన్నెల రాశికి సిరిజోత
చురచుర చూపులు ఒకమారు … నీ చిరుచిరు నవ్వులు ఒకమారు
మూతి విరుపులు ఒకమారు … నువ్వు ముద్దుకు సిద్ధం ఒకమారు
నువ్వు ఏ కళనున్నా మా బాగే … ఈ చీర విశేషం అనాలే …
నువ్వు ఏ కళనున్నా మా బాగే … ఈ చీర విశేషం అనాలే …
సరికొత్త చీర ఊహించినాను … సరదాల సరిగంచు నేయించినాను
మనసు మమత … పడుగు పేక … చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత … నా వన్నెల రాశికి సిరిజోత
నా …. ఆ….. ఆ….. ఆ….. వన్నెల రాశికి సిరిజోత ……..

No comments: