27 October 2007

ఎవరినెప్పుడు తన వలలో

ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమా
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమా
అర్ధం కాని పుస్తకమే అయిన గాని ఈ ప్రేమా
జీవిత పరమార్ధం తానె అనిపిస్తుంది ఈ ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా

ఇంతక ముందర ఎందరితో ఆటడిందో ఈ ప్రేమా
ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమా
కలవని జంటల మంటలలో కనబడుతుంది ఈ ప్రేమా
కలసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ
ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా

No comments: