మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం

పచ్చదనాల పానుపుపైన అమ్మై నేల జో కొడుతుంటే

పున్నమి నదిలో విహరించాలి…పువ్వుల ఒళ్ళో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి .. తొలకరి జల్లై దిగి రావాలి
తారల పొదరింట రాతిరి మజిలీ … వేకువ వెనువెంట నేలకు తరలీ
కొత్త స్వేచ్ఛనందించాలి …. నా హృదయాంజలి
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
నువ్వే …. వాగుగా నేస్తం చెలరేగె వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగి పంతమే ఎపుడూ నా సొంతం
వాగుగా నేస్తం చెలరేగె వేగమే ఇష్టం మనలాగే

ఊహకు నీవే ఊపిరి పోసి … చూపవే దారి ఓ చిరుగాలి
కలలకు సైతం సంకెల వేసి కలిమి ఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి
పేద గరిక పూలకు ఇస్తా …నా హృదయాంజలి
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
పచ్చదనాల పానుపుపైన అమ్మై నేల జో కొడుతుంటే
పచ్చదనాల పానుపుపైన అమ్మై నేల జో కొడుతుంటే
మానస వీణ మౌన స్వరాన ఝుమ్మని పాడే తొలి భూపాలం
నువ్వే …. వాగుగా నేస్తం చెలరేగె వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగి పంతమే ఎపుడూ నా సొంతం
వాగుగా నేస్తం చెలరేగె వేగమే ఇష్టం మనలాగే
నింగికే నిత్యం ఎదురేగి పంతమే ఎపుడూ నా సొంతం
No comments:
Post a Comment