27 October 2007

అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే

అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే
సత్తు రేకు కూడ స్వర్ణమేలే
అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్షమార్గం
వయస్సులా సంగీతమే
భూమికీ భుపాలమే 2

అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో
పిచ్చి రాతలయిన కవితలౌనులే
ప్రేమకెపుడు మనసు లోన భేదముండదే
కాకి ఎంగిలైన అమృతమ్ములే

గుండు మల్లి ఒక్క రూపాయి
నీ కొప్పులోన చేరితే కోటి రూపాయిలు
పీచుమిఠయి అర్ధ రూపాయి
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్ష రూపయిలు

అందమైన

ప్రేమ ఎపుడు ముహూర్తాలు చూసుకోదులే
రాహు కాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంసచేత రాయబారమేలనే
కాకి చేత కూడా కబురు చాలునే

ప్రేమ జ్యోతి ఆరిపోదె
ప్రేమ బంధం ఎన్నడు వీదిపోదె
ఇది నమ్మరానిది కానే కాదే
ఈ సత్యం ఊరికీ తెలియలేదే

ఆకశం భూమీ మారినా మారులే
కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడినా పాటలే
ఇంకా వినిపించులే

ప్రేమా తప్పుమాట అని ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో
ప్రేమా ముళ్ల బాట కాదు వెళ్లవచ్చు
అందరూనువ్వు వెళ్లు నిర్భయంగా

No comments: