27 October 2007

నవ్వే వాళ్ళు నవ్వనీ

నవ్వే వాళ్ళు నవ్వనీ
ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ
పొగిడే వాళ్ళు పొగడనీ
తిట్టే వాళ్ళు తిట్టనీ
don't care

పూలే నీపై చల్లనీ
రాళ్ళే నీపై రువ్వనీ
ఎత్తుకు నిన్నేగరెయ్యనీ
గోతులు నీకై తీయనీ
don't care... నవ్వే వాళ్ళు

అనుకొన్నది నీవ్వే చెయ్‌
అనుమానం మాని చెయ్‌
నీ మనసే గట్టి చెయ్‌
నీదే రా పై చెయ్‌ ॥నవ్వే వాళ్ళు ॥

ఎంత ఎదిగినా ఒదగాలన్నది చెట్టును చూసి నేర్చుకో
క్రమశిక్షణ తో మెలగాలన్నది చీమను చూసి నేర్చుకో
చిరునవ్వుతో బ్రతకాలన్నది పువ్వును చూసి నేర్చుకో
ఓర్పు సహనం వుండాలన్నది పుడమిని చూసి నేర్చుకో
ఎంత తొక్కినా .. నిన్నెంత తొక్కినా ..
అంత పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో
నేర్చుకొన్నది పాటించేయి, ఓర్చుకొంటూ పనులే చేయి
నీదే రా పై చెయ్‌ ॥నవ్వే వాళ్ళు ॥

ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో
పరులకి సాయం చేయాలన్నది సూర్యుణ్ణి చూసి నేర్చుకో సోమరితనాన్ని వదలాలన్నది గడియారాన్ని చూసి నేర్చుకో ప్రేమనందరికి పంచాలన్నది భగవంతుణ్ణి చూసి నేర్చుకో
ఎంత చెప్పినా... నేనంత చెప్పినా
ఇంకెంతో మిగులున్నది అది నీకు నీవు తెలుసుకో
నేర్చుకొన్నది పాఠం చేయి నలుగురికీ అది నేర్పించేయి
నీదే రా పై చెయ్‌ ॥నవ్వే వాళ్ళు॥

No comments: