20 October 2007

వేయి దీపాలు నాలోన వెలిగితే

వేయి దీపాలు నాలోన వెలిగితే అది ఏ రూపం నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే అది ఏ రాగం ఆ అనురాగం
ఈ చీకటి కన్నుల వాకిలిలో వెలుగుల ముగ్గులు వేసేదెపుడో
ఆ వెలుగుల మంగళ వేదికపై నా వేణులోలుని చూసేదెపుడో
చూడలేని నీ కన్నులకు ఎదురు చూపైనా ఉందొకటి
చూడగలిగే నా కన్నులకు చుట్టూ ఉన్నది పెనుచీకటి
వేయి దీపాలు నాలోన వెలిగితే ఏ రూపం నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే ఏ రాగం ఆ అనురాగం
సుడి పడి పోయే జీవితనౌక కడలి తీరం చేరేదెపుడో
కలలా తోచే ఆశా రేఖ నిజమై ఎదురై నిలిచేదెపుడో
వేచి ఉన్న నీ హృదయంలో రేపటి ఉదయం మెరిసింది
వేగిపోయే నా గుండెలో గతమే స్మృతిగా మిగిలింది
వేయి దీపాలు నాలోన వెలిగితే ఏ రూపం నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే ఏ రాగం ఆ అనురాగం

No comments: