20 October 2007

మమతలు లేని మనుజుల లోన

మమతలు లేని మనుజుల లోన
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు ఎవరో
మమతలు లేని మనుజుల లోన
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు ఎవరో
ఎవరికి ఎవరో
ఏ కులమైనా .. నెలవెది ఐనా
మదిలో కూరిమి జాలుకొన
పిలిచి లాలించి కొడుకు చందాన
పిలిచి లాలించి కొడుకు చందాన
చూచి గాచే దాతే నాయన కాదా
మమతలు లేని మనుజుల లోన
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు
ఎవరో …. ఎవరికి ఎవరో
మాటలు నమ్మి మనసు నీరై
దరికి తీసిన తండ్రులను
మాటలు నమ్మి మనసు నీరై
దరికి తీసిన తండ్రులను
దేవుని చందాన తలచి పూజించి
దేవుని చందాన తలచి పూజించి
కొలువు చేసే వాడే కొడుకౌగాదా
మమతలు లేని మనుజుల లోన
ఎవరికి ఎవరో తండ్రి .. తనయుడు
ఎవరో …. ఎవరికి ఎవరో
ఆ… ఆ…. ఆ…. ఆఆఆఆఆ., ఊ…ఊ.. ఊఊఊ…….

No comments: