Showing posts with label Movie - Badra. Show all posts
Showing posts with label Movie - Badra. Show all posts

14 June 2010

తిరుమలవాసా సునధురహాసా

తిరుమలవాసా సునధురహాసా ఈ హారతి గొనవయ్యా
సృతజనపోష జయజగదీశ మా ఆర్తిని కనవయ్యా
అడుగే పడనీ పయనాన
వెలుగై నడిపే నీ కరుణ
ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకొందుకే తపములు చేసా

ఓమనసా ఓమనసా చెబితే వినవా నువ్వు

ఓమనసా ఓమనసా చెబితే వినవా నువ్వు
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు
చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచి బ్రతకాలే మనసా

ఎగసిపడే అలకోసం దిగివస్తుందా ఆకాశం
తపనపడీ ఏం లాభం అందని జాబిలి జతకోసం
కలిసి వున్న కొంత కాలం వెనక జన్మ వరమనుకో
కలిసిరాని ప్రేమ తీరం తీరిపోయిన ఋనమనుకో
మిగిలే స్మృతులే మనవకో మనసా

తన వడిలో పొదువుకుని భద్రంగా నడిపే నౌక
తననొదిలీ వెల్లకనీ ఏ బంధాన్నీ కోరదుగా
కడలిలోనె ఆగుతుందా కదలనంటూ ఏ పయనం
వెలుగువైపు చూడనందా నిదర లేచే నా నయనం
కరిగే కలనే తరిమే ఓ మనసా

ఏమైంది సారు ఏంటా హుషారు

ఏమైంది సారు ఏంటా హుషారు
బాగుంది జోరు వూరంత హోరు హొయ్ హొయ్

ఆనందమొస్తే ఇంతే కాదా అందరూ
ఆరాలు తీసే వింతే లేదే నమ్మరు

సససై సైర సైర ససససై సైరసైర....

హే చాల్లే జతులు చెడిపోవా మతులు
ఇల్లాంటి కుప్పిగంతులు వేస్తార చెప్పు నీలాంటి బుద్ధిమంతులు
హె ఎన్నో పనులు వెనకబడి తరిమేటపుడు
తీరిగ్గ చమ్మచక్కలు ఆడేదెలాగ చెప్పండె అమలక్కలు

ఆహా చూసాం లే ఎంత భారం నువు మోసే రాచ కార్యం
చేస్తాంలే మేము సైతం చేతనైన సాయం

సససై సైర సైర ససససై సైరసైర....

వేసే అడుగు ఎటువైపో అడుగూ
ఏ నింగి చుక్కవరకు తూరంగిలాగ నీ కొంటె గాలి పరుగు
తీసే పరుగు బిడియపడి ఆగే బెరుకూ
పెళ్లీడు ఆడపిల్లకే వుండాలి కాని మాలాంటి వాళ్లకెందుకు

అరెరెరె అబ్బాయీ నీ బడాయి ఆకాశం తాకెనోయీ
మాతోనా నీ లడాయి చాలు ఆపవోయి

సససై సైర సైర ససససై సైరసైర....