Showing posts with label Movie - Ramayya Thandri. Show all posts
Showing posts with label Movie - Ramayya Thandri. Show all posts

29 June 2010

వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు

వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు
అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు

పెద్దలంత పిల్లలుగా మారే రోజు
పల్లేదో పట్టణమేదో తెలియని రోజు
దీపావళి రోజు దీపావళి రోజు ||వెన్నెల రోజు||

చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు
మింటనున్న తారకలు ఇంటింట వెలిగే
దీపావళి రోజు దీపావళి రోజు
వెన్న్నెల రోజు ఇది వెన్నెల రోజు

జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది
గువ్వల్లే బతకాలని తారాజువ్వ చెబుతుంది
నిప్పుతోటి చెలగాటం ముప్పుతెచ్చిపెడుతుందని
తానందుకు సాక్ష్యమని టపాకాయ చెబుతుంది ||వెన్న్నెల రోజు||