Showing posts with label Letter - "ధ". Show all posts
Showing posts with label Letter - "ధ". Show all posts

23 August 2015

ధీవర ప్రసర శౌర్య ధార

హు నన హూన్నన హూన్నన హూన్నన నచ్చానా
హు నన హూన్నన హూన్నన హూన్నన అంతగానా
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున్నా ఆ
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర

అలసినా సొలసినా ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడుపనా నీజంట పయనించనా
పడి పడి తల పడి వడి వడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా
సిగముడి విడిచిన శిఖరపు జలసిరి ధారల్ని జటాఝూటంలా
ఢీకొని సవాలని తెగించి నీవైపు దూసుకొస్తున్నా

ఉత్క్రమా అసమ శౌర్యధామ ప్రోధ్గమ తవ భీతిర్మా
ఉత్క్రమా అసమ శౌర్యధామ ప్రోధ్గమ తవ భీతిర్మా

నిలువనా ఎదుగరా నిను రమ్మంది నా తొందరా
కదలికే కదనమై గగనాకెదురీదరా
విజితరిపు రుధిరధార కలిత అసిధర కఠోర
కుల కుధర తిలిత గంభీర జయ విరాట్ వీరా
విలయ గగన తల భీకరా గర్జత్ ధారాధరా
హృదయ రసకాసారా విజిత మధు పారావార

భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి
భయదరం సౌ విభవ సింధు సుపర ధం గం భరణ రండి

ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార ఉత్సర స్థిర గంభీర

ధీవర ధీవర ప్రసర శౌర్య ధార
దరికి చేరరార ఉత్సర సుందర స్థిర గంభీర  చెలి నీదేరా

01 November 2011

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా ఢమక్కురో

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా ఢమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో

కసక్కు లయలు హొయలు చూశా
కసెక్కి వలపు వలలే వేశా
గుబుక్కు ఎదలో కథలే దాచా
గుటుక్కు మనక గుబులే దోచా
మజా చేస్తే మరోటంట మరోటిస్తే మగాణ్ణంట
సరే అంటే అతుక్కుంటా సరాగంలో ఇరుక్కుంటా
చుంబురుణ్ణై నారదుణ్ణై
చుంబ మీద పంబ రేపి పాడుతుంటే మీరు గోవిందే
గోవిందా గోవింద come on come on పాడండయ్యా
పబం పప్పా పబం పప్పా పబం పప్పా పబం పప్పా
పబం పం పాబం పపం పం పాబం పబం పం పాబా పాబా బాబాబం

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో

వయస్సు ఒడిలో చొడినే చూశా
వరించి సుడిలో పడవే వేశా
నటించే నరుడా ఘనుడా మెచ్చా
నమస్తే నడుమే నటిగా ఇచ్చా
ఉడాయిస్తే ఉడుక్కుంటా లడాయొస్తే హోయ్ ఉతుక్కుంటా
సఖి అంటే సరే అంటా చెలి అంటే గురు అంటా
బ్రేకు డ్యాన్సు షేకు డ్యాన్సు
mix చేసి steps వేసి tricks చేస్తే మీరు గోవింద
come on come on dance I say ఆడండ్రా
ధినక్కుతా ధినక్కుతా ధినక్కుతా ధినక్కుతా
ధినక్కు తార ధినక్కు తార ధినక్కు తారా తారా తారారా

ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురో
తళుక్కు తార మిణుక్కు స్టారా కథక్కు ఆట పాట చూస్తారా
ధినక్కుతా కసక్కురో ఝనక్కుతా చమక్కురోయ్

04 June 2011

ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి

ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి
ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి నచ్చిన సొగసులు

ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి

వేసంగి మల్లెల్లో శీతంగి వెన్నెల్లో
వేసారిపోతున్నారా రారా
హేమంత మంచుల్లో ఏకాంత మంచంలో
వేటాడుకుంటున్నానే నిన్నే
మొటిమ రగులు సెగలో
తిరగబడి మడమ తగులు వగలో
చిగురు వణుకు చలిలో
మదనుడికి పొగరు పెరిగె పొదలో
గోరింట పొద్దుల్లోన పేరంటాలే ఆడే వేళ

లేలేత నీ అందం నా గీత గోవిందం
నా రాధ నీవేలేవే రావే
నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు
నా ఉట్టి కొట్టేస్తున్నా రావా
వయసు తెలిసె ఒడిలో
యద కరిగి తపన పెరుగు తడిలో
మనువు కుదిరె మదిలో
ఇంకిపుడు చనువు ముదురు గదిలో
వాలారు సందెల్లోన వయ్యారాలే తాకే వేళ

27 December 2010

ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది

ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది
ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది
హా ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది

మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా
నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగా
నువ్వలా కొంటెగా తొంగి చూస్తే ఎలా
సిగ్గుగా ఉండదా చీర మార్చేదెలా
హో ల ల ల ల ల

హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది

ఈ వేళ ఏమైందో ఈ గాలి ఏదో రాగాలు తీస్తున్నది
ఈ నేలపై ఉన్న పాదాలకేవో పాఠాలు చెబుతున్నది
ఊరికే ఇక్కడే ఉండిపోకన్నది
కోరికే రెక్కలై ఎగరవేయన్నది
హో ల ల ల ల ల

ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది
హా ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది
హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది

23 November 2010

ధన్యోహం ఓ శబరీశ ధన్యోహం ఓ శబరీశ

ధన్యోహం ఓ శబరీశ ధన్యోహం ఓ శబరీశ
ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ఉత్తుంగ శబరిగిరి శృంగ నిత్య నిస్సంగమంగళాంగ
పంపాతరంగ పుణ్యానుషంగ మునిహృదయ జలజబృంగ
ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశ

బ్రహ్మచారినై భక్తియోగినై ద్వంద్వము అన్నది వీడి
విగతకామినై మోక్షగామినై తాపత్రయమును విడిచి
కన్నెస్వామినై కర్మధారినై కాలాంబరములు తొడిగి
నీ దరి చేరితి నీలగిరీశా బంధము తెంచితి పందలవాస

ధన్యోహం ఓ శబరీశా నీ శుభరూపం నేటికి చూశా
ధన్యోహం ఓ శబరీశ

శరణం శరణం భవతరణ శబరిగిరీశా అయ్యప్ప
శుభదం శుభదం నీ చరణం హరిహరపుత్ర అయ్యప్ప
అయినరేఖల సంగమవేళ మిధ్యావాసపు మధ్యస్థలిలో
శూన్యజగతిలో సూక్ష్మ పరిధిలో శిఖరపు వెలుగుల కాంతిపుంజమై
సకలచరాచర సృష్టిదీపమై మకరజ్యోతిగ వెలిగేది
నీ మహిమ ఒక్కటే అయ్యప్ప
ఈ మహికి దేవుడే అయ్యప్ప
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పో, అయ్యప్పో స్వామియే
శబరిగిరీశా ధన్యోహం శబరిగిరీశా ధన్యోహం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం

01 September 2010

ధిక్తన ధిక్తన ధిక్తన ధీక్ ధిక్తన ధిక్తన

ధిక్తన ధిక్తన ధిక్తన ధీక్ ధిక్తన ధిక్తన ||2||
మా వధినే చిరు నవ్వుల వాన

మా ఇంటికే వేలుగన్నదే వాదినమ్మ లా వచ్చిండిలా
ఇంటిని మొత్తం ప్రెమాలయమే మార్చెను నేడీల
మా ఇంటికే వేలుగన్నదే వాదినమ్మ గా వచ్చిండిలా
పసివాడుగా కాన లేదు లే ఈ ప్రేమ ఇప్పటి దాకా ||ధిక్తన||

ఐతే మరి అహా వాదినమ్మ నా పెళ్లి నువు చేయాలమ్మా..
తోడి కోడలిని వెతకాళమ్మా ఎవరి మాట వినోద్దమా
ఐతే మరి అహా వాదినమ్మ నా పెళ్లి నువు చేయాలమ్మా..
ముమ్మూర్తుల నీ రూపమే అమ్మాయి కి ఉండలంటా ||ధిక్తన||


ఈ నాటికీ నే పసివడినే ఇంకో చిన్నోడు పుడతాడంటా
ముద్దు మాటల మూసి మూసి నవ్వుల బుజ్జి బాబుని ఇవ్వమ్మా
ఈ నాటికీ నే పసివడినే ఇంకో చిన్నోడు పుడతాడంటా
మేమిద్దరమూ ఈ ఇంటిని నవ్వులతో వెలిగిస్తాము ||ధిక్తన||

10 July 2010

ధీంతర ధీంతర ధిర ధిర ధిరన

ధీంతర ధీంతర ధిర ధిర ధిరన
ధిర ధిర ధిర ధీంతనన
ధిర ధీంతర ధీంతర ధిర ధిర ధిరన
ధిర ధిర ధిరన

అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు

There is something new about today
There is something nice about today
There is something cool about today
I never never seen before

నాలోనాకే కొత్తగుందిరో
లావా లాగ మరుగుతోందిరో
లావాదేవీ జరుగుతోందిరో
ఈ తికమక ఏంటిరో

అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లేఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు


ధీంతర ధీంతర ధిర ధిర ధిరన
ధిర ధిర ధిర ధీంతనన
ధిర ధీంతర ధీంతర ధిర ధిర ధిరన
ధిర ధిర ధిరన

ప్రపంచమంతా జయించినట్టు ఉప్పొంగిపోతోంది ప్రాణం
పెదాలలోన పదాలు అన్ని క్షణాల లోనే మాయం
శరీరమంతా కరెంటు పుట్టి భరించలేకుంది ప్రాయం
నరాలలోన తుఫాన్ రేగి ఇదేమి ఇంద్రజాలం

There is something new about today
There is something nice about today
There is something cool about today
I never never seen before

అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లేఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు

క్షణలనేమో యుగాలు చేసి తెగేడిపిస్తోంది కాలం
ఎడారిలోన చలేసినట్టు ఇదేమి వింత మైకం
తపస్సులన్నీ ఫలించినట్టు తమాషగుంటోంది వైనం
మనస్సుతోటి మనస్సులోకి రహస్య రాయబారం

There is something new about today
There is something nice about today
There is something cool about today
I never never seen before

అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లేఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు

01 July 2010

ధీర ధీర ధీర మనసాగలేదురా

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రారా శూర సొగసు అందుకో దొరా
అసమాన సాహసాలు చూడ రావమే దొర
నియమాలు వీడి రాణి వాసం ఏలుకోర ఏకవీర ధీర

సమరములొ దుకగా చాకచక్యము నీదేరా సరసములొ ఉట్టిగా చూపరా
అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగ అధిపతినై అది కాస్తా దొచైనా
పోరుకైన ప్రేమకైన అను దారి ఒకటేగా చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇటు ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్ర పుత్ర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రారా శూర సొగసు అందుకో దొరా

శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగ కుసుమముతో ఖడ్ఘమే ఆడగా
మగసిరితో అందమే అంటు కడితే అంతేగ అణూణువు స్వర్గమే అయిపొదా
శాశనాలు ఆప జాలని తాపము ఉందిగా చెఱసాల ఖైదు కాని కాంఛ ఉందిగా
శత జన్మలైన ఆగిపొని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నను చేరుతుందిరా
గుండెలొను నగార ఇక మోగుతుందిరా నవ సొయగాలు చూడ రాదు నిద్దురా
ప్రియ పూజలేవొ చేసుకొన చేతులార సేద తీరురా

08 June 2010

ధిన్ ధినక్ తరె నక్తిక్ తొం

ధిన్ ధినక్ తరె నక్తిక్ తొం ధిన్ ధినక్ తరె నక్తిక్ తొం
ధిన్ ధినక్ తరె నక్తిక్ నక్తిక్ తొం
గుప్పెడంత గుండెల్లొ చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతొ సంతొషం
జీవితం చిరునవ్వుతొ గడిపేయ్యడమే కద ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కద సంతొషం
ధిన్ ధినక్ తరె నక్తిక్ తొం ధిన్ ధినక్ తరె నక్తిక్ తొం
ధిన్ ధినక్ తరె నక్తిక్ నక్తిక్ తొం

అమ్మయిల చెతలకి కుర్రాళ్ళ కూతలకి హద్దంటూ లెదయ్యో ఈ దినం
సందంట్లొ సందుల్లొ పెళ్ళవని జంటలకి ఆనందం అందించే ఈ క్షణం
పేకాట రాయుళ్ళ చేజొరు చూడాలి ఈ పెళ్ళి లోగిళ్ళలొ
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్ళు విడిదింటిలొ
కన్నె పిల్లలకు బ్రహ్మచారులకు కొంటె సైగలే ఇష్టమంట

ఈ పెళ్ళి పందిరిలొ సరదాల సందడిలొ ఈ నేలకొచిందయ్యొ అంబరం
ఈ ఊరు వాడంతా పొంగిపొయెలాగ ఈ ఇంట జరగాలయ్యొ సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేటి ఈ వేళలొ
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేద మంత్రాలలొ
కన్నెదాతకి అప్పగింతలు కంటితుడుపులు తప్పవంట

04 June 2010

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

హే.. ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
తప్పదు నెగ్గే లేత జవాని..నచ్చాయే నీలో హొయలన్నీ..

నిన్నే నేనే మెచ్చా వాలా..
వినుకోరా హిమ్మత్ వాలా..మెప్పిస్తా అల్లేసియ్యాలా..

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

ఆటే కట్టు నీ బెట్టు కౌగిళ్ళకు తాకట్టు
చాటూ మాటు నీ గుట్టు వొద్దికలో చూపెట్టు
చేస్తూ చిలిపి ఆగడం .. వేస్తా కళ్ళతో శరం
తెస్తా నీలో కలకలం ..దేఖోనా !

హయ్యో కలికి కోమలం .. ఆపై చిలిపి యవ్వనం
దాచేదెట్టా సోకంతా..నాలోనా..లోలోనా !!

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

దేఖో దేఖో నీకేలే నా సోకుల యావత్తూ
రేపో మాపో అంటూనే దాటేయ్యకు నీ వొట్టు
చూసా తమరి వాలకం .. చేసా తుదకు సాహసం
నన్నే చేసుకో వశం .. దీవానా !

ఇట్టా తనువు తగలడం .. ఆపై మనసు రగలడం
చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాట నేనిట్టా !

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనలిసా..
తెగ పొంగే వయ్యారాలే అన్నీ..
నీకే నే కానుక చేసా..

హే.. ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
తప్పదు నెగ్గే లేత జవాని..నచ్చాయే నీలో హొయలన్నీ..

హే తధిగిణతోం తక ధీంతక తారా.. తధిగిణతోం తక నువ్వే కావాలా !
తధిగిణతోం తక ధీంతక రసలీలా.. తధిగిణతోం తక రంగుల రంగీలా !!

ధిరణ ధిరణ ధిర..

ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిరణ..
ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధింతన..

ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ దిరణ ధిరణ ధిరణ ధిరణ ధిర ధిరణా..

ఘణణ ఘణ ఘల్ ఘల్..మువ్వలై.. మొగింది నాలొ నీ రాగం..
ఝణణ ఝణ ఝల్ ఝల్.. రువ్వలై.. పొంగింది నాలొ సంగీతం..
కదిలె పెదాల సడి లొ స్వయాన తను గ చనించె ప్రణవం
ఎగిసె స్వరల జత లొ విలీన మొదగ జ్వలించె సమయం..
మహతి సునాద సుధగ తరించు ప్రాణమై సుమించె హ్రుదయం..
వ్రతమె ఫలించి..వరమై లభించి..పదాన చలించు పదాల గమ్యం..


ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిరణ..
ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధింతన..2

ని ని స స స స ని ని సగ గ గ గ ని ని సగమ మ మ గమపనీ పా..
ని ని స స స స ని ని సగ గ గ గ ని ని సగమ మా గమపనీ సా ఆ..
దిన్ దిన్ తాన న న న నాన దె ఈ ఈ ఈ ఈ త న..
ని ని స గ గ స ని ని స ని ని స ని ని ని ద ద ద ప ప ప మ మ గ మ ప గ మ ని గ మ సా ని ప మ గ రి గ మ ప ని ప
ఘనన ఘన ఘల్ ఘల్..ప ని స రి స ని ని ప మ ప ని ప మ గ రి స ని స గ మ ప స రి గ మ ప స రి గ మ ప
ఘణణ ఘణ ఘల్ ఘల్..

ఘణణ ఘణ ఘల్..ఘన్ ఘణణ ఘల్..ఘన్ ఘణణ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్....

03 June 2010

ధిరణతోం తకిట ధిరణతోం తకిట

ధిరణతోం తకిట ధిరణతోం తకిట
ధిరణతోం తకిట తానాన
నిదుర ఉండదట కుదురు ఉండదట
మధురమైన ఈ మైకాన
నిమిషమైన ఇక నిలవనీయదట
మొదట అందరికి ఇంతేనా
తగని తొందరట చిలిపి చిందులట
అదుపులేని అనందనా
వలపు తేనె రుచి తెలుసుకున్న మది
ఆగనన్నది ఏమైన


మనసుతో...మనసు ముడిపడినదీ
కనులతో... కనులు కలిసినవీ
వయసుతో... వయసు జతపడినదీ
వలపుతో ...వరుస కుదిరినదీ
చెలియలో ...హొయలు తికమక పడినవీ
కులుకులో... కునుకు చెదిరినదీ
నడకలో... నడుమునడిగిన బరువిదీ
బిగుతుతో ..సొగసు రగిలినదీ
చలువ నీడవని తగిన తోడువని
ఒడికి చేరిన అల్లరిని

బిడియమా... అవును సహజము కదా
కుదురుకో... ఉడుకు తెలియదు కదా
తమకమా.. తమకు తెలుసును కదా
అణుచుకొ ..తెగని తగువు కదా
చినుకులా.. ఎదను తడిమిన గొడవిది
వరదలా ..ఎదిగి తడిమినదీ
పిలుపుల.. మెలిక తిరిగిన కథకళి
తనువులో తళుకు తెలిసినదీ
అదురుతున్న తడి పెదవి అలజడికి నిదుర లేవని కలలన్ని

12 May 2010

ధీం తనక్ ధీం ధీం తనక్ ధీం

ధీం తనక్ ధీం ధీం తనక్ ధీం
కొత్త గుంది ప్రేమా
ఓ ఓ ఓ
ఈ పరిచయం ఈ అనుభవం
మత్తు గుంది భామా
ఓ ఓ ఓ
ఈనాడే తెలిసింది నీ తోడె కలిసింది
జగమే సగమై యుగమే సగమై ఉండమా

వలెసి కలెసి నిలేసి మనసుల

1|| చలో మేరీ స్వీటీ బుల్ బుల్ బ్యూటీ
భలే గుంది భేటీ నీ తోటి
నిదానించు నాటీ ఏమా ధాటి
మజా కాదు పోటీ మనతోటి
సిగ్గు లూటీ
చెసెయ్యి కళ్ళతోటి
ఇచ్చేయ్యి ముద్దు చీటీ
కౌగిళ్ళు దాటి
ఒకటే సరదా
వయసే వరదా
కలలే కనక కధలే వినక మర్యాదా
చురుక్‌కు చలెక్కి అడక్క అడిగిన

2|| ఇదే ప్రేమ మాపు ఇలా ఛంపుతోంది
అదే ధ్యాస నాలో మొదలయింది
పడారేళ్ల ప్రేమ కధంతెను లెమ్మా
అదో కొత్త క్రేసీ హుంగమా
పొద్దు పోదు
ముద్దైన ముట్ట నీదు
నిద్రైన పట్టా నీదు
నా వల్ల కాదు
ఒకటే గొడవా
ఒడిలో పడవ
నిన్న మొన్న లేనే లేదు ఈ చొరవా
ఇవాళ ఇలాగ దొరక్క దొరికిన ||ధీం తనక్

12 February 2010

ధనమేరా అన్నిటికీ మూలం

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం

మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా
ధనమేరా అన్నిటికీ మూలం

ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే
ధనమేరా అన్నిటికీ మూలం

కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం