Showing posts with label Movie - Rushya Srunga. Show all posts
Showing posts with label Movie - Rushya Srunga. Show all posts

14 July 2010

హే సురేశా! సుఖజీవన దాత

హే సురేశా! సుఖజీవన దాత!
పయోధర వాహనా! పర్జన్యా
నభోలోనాయకా ప్రభో వీరదాయకా
కావరా! మొరాలకించరా
ఘోడు ఘోడు ఘోషించె ప్రజల
గొంతు మీకు వినిపించలేదా
హాహాకారాలాల్లాడే ప్రజలా ఆర్తిమీకు కనుపించలేదా
ఓ ఋతుపవనా నీల జలదమా
కనికరాన ఈధర చరించరే జలాలనించరే
||నభో||


బీటలు వారిన హృదయాల
ఆరాటాలు ఆలించవేల
కన్నీటి జాలే ప్రవహించునేల
పన్నీటి జల్లై వర్షింపనేల
ఓ వరుణా దేవతా వర్షదేవతా
కనికరాన ఈధరా చరించవా జలాలనించవా
||నభో||


దళం ధళస్మనోనోజ్ఞ చంచలా ప్రకాశమా
ఫెళఫెళా గర్జించు ఘనాఘన నిర్ఘోషమా
ఘులఘుల ఘులగలగల గల ఘల్లున వర్షించరే
ఈ ఇలతనియించగ తరియించగ వర్షించరే