Showing posts with label movie - Parugu. Show all posts
Showing posts with label movie - Parugu. Show all posts

06 July 2010

హృదయం ఓర్చుకోలేనిదీ

హృదయం ఓర్చుకోలేనిదీ..గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం
పెదవులు విడిరాదా
నిలువవే కడదాకా
జీవం ..లో ఒదగవే ఒంటరిగా
లో..లో ముగిసే మౌనంగా
ఓ ఓ ఓఓఓ...ఓ ఓ ఓఓఓ...

హృదయం ఓర్చుకోలేనిదీ..గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం

ఊహల లోకంలో ఎగరకు అన్నావే..
తేలని మైకంలో పడకని ఆపావే..
ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా..
మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలి కాంతి నీవో
బలికోరు పంతానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ

హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం

వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు
చల్లని చూపులతో దీవెనలిస్తాడు
అంతటి దూరం ఉండే బ్రతికించే వరమౌతాడు
చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు
హలాహలం నాకు సొంతం
నువు తీసుకో అమృతం
అనుకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ ఓ ఓ

హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం

01 July 2010

చల్ చల్ చలొ చల్ రే చల్ చలొ

చల్ చల్ చలొ చల్ రే చల్ చలొ
సరదాగ సాగలి చలొ
చల్ చల్ చలొ చల్ రే చల్ చలొ
వరదల్లె పొంగాలి చలొ
గిర గిర గిర తిరిగే నైజం
నిలబడనిక ఆ నిమిషం
జర జర జర సాగె వేగం
ఆగదు పయణం
Right now....Go re Go re Go re Go re Go ......Right now ....Go re Go re Go re Go re Go

6:20 మా చంటి గాడి ఇంటికి
6:30 మా బంటి రెస్టారెంటుకి
6:40 అట్నుంచి ఐమాక్స్ కి
7:00 కి యాడుంటానొ మరి
కుదురుగ స్థిరముగ
రాయల్లె ఉన్నవంటె లాభం లేనే లేదు
క్షణముతొ స్థలము లొ
బంతల్లె పరిగెడుతుంటే
సంతొషాలె చూడు

సురీడుకి సెలవుంతుందండి రాత్రికి
జబిలికి కునుకుంటుందండి పగటికి
నా వొంటికి అలుపే రాదండి జన్మకి
నా దారిలొ వెలుతుంట పైపైకి
గెలవడం ఒడడం
ఆ రెండు మాటలకర్థం చుద్దాం లేవొయి రేపు
బ్రతుకుతొ ఆడటం
రెపంటే లాభం లేదొయి
ప్రారంబించేయ్ నేడు.... Right now....Go re Go re Go re Go re Go... Right now.....Go re Go re Go re Go re Go

22 June 2010

ఎలగెలగ ఎలగెలగ ఎలగా

ఎలగెలగ ఎలగెలగ ఎలగా ||3||
ఎల మా ఇంటికొచ్చి మాయ చెసావో
ఎల నా నాలొపనె గొల పెంచావు
ఎల నా దారినిట్టా మార్చివెసావూ
ఎలా నీ దారిలొకి తీసుకొచావూ
ఎలగెలగ ఎలాగ యెలగెలగా ఆ
ఎలగెలగ ఎలగెలగ ఎలగా

పిల్లా నీలాంటి దాన్నె కొరుకున్ననూ
పిల్లా ఆ మాట నాలొ దాచుకున్నానూ
పిల్లా నెనింతకాలం వెచి వున్నాను
పిల్లా ఆ చొట నిన్నె చూసుకుంటాను
ఎలగెలగ ఎలాగ ఎలగెలగా ఆ
ఎలగెలగ ఎలగెలగ ఎలగా

కలలొ ఒహ్ రొజు బ్రమ్హ దెవుడొచ్చాడు
సరిగా నా గుండెపై నీ బొమ్మ గీసాడు
ఎలగెలగ ఎలగ
ఇదిగొ ఈ పిల్ల నీకె జంట అన్నాడూ
పరుగూన వెళ్ళమంటు తన్ను తన్నడు
ఎలగెలగ ఎలగ
కొండలు దాటి కొనలు దాటి
పుట్టాలి దాటి గట్టులు దాటి
దెబ్బకి అక్కడ ఎగిరి పడ్డాను
నీ దగ్గర పడ్డాను...
అలగలగ అలగ అలగలగ ఆ
అలగలగ అలగ అలగలగ

అలా నీ ఇంటికొచ్చి మాయ చెసాను
అలా నీ లొపలె ఈ గొల పెంచాను
అలా నీ దారినట్టా మార్చి వెసాను
అలా నా దారిలొకి తీసుకొచానూ
అలగలగ అలగ అలగలగ ఆ
అలగలగ అలగ అలగలగ

ఎపుడొ మా బామ్మ నాకొ మాట చెప్పింది
ఎవడొ వలవెసి నన్నె లాగుతదంది
ఎలగెలగ ఎలగ
పొవె నె వెర్రి దన్ని కాదు అన్నానూ
కాని నువ్వు ముందుకొస్తె ఆగుతున్నాను
ఎలగెలగ ఎలగ
యెప్పటికప్పుడు ఎమఔతుందని
తియ్యని తప్పులు ఎంచెస్తానొ అని
నిద్దర మాని అలొచిస్తున్నా
నిన్ను ఆరతీస్తున్నా..
ఎలగెలగ ఎలాగ ఎలగెలగా ఆ
అలగలగ అలగ అలగలగ
ఎలగెలగ ఎలాగ ఎలగెలగా ఆ
ఇలగిలగ ఇలగ ఇలగిలగ ఇలగా...

29 May 2010

ఎన్నెన్నెన్నెన్నో ఊహలె గుండెల్లో వున్నాయీ

ఎన్నెన్నెన్నెన్నో ఊహలె గుండెల్లో వున్నాయీ
నిన్నే వూరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నెన్నో ఆశలె కళ్ళళ్ళొ చేరాయీ
నిన్నే ప్రేమించాలని అమ్మాయి
దూరం పెంచినా.. కరిగించాను గా
కళ్ళెంవేసినా ఊ.ఓ.ఓ..కదిలొస్తాను గా ఊ.ఓ.ఓ..

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంటా కొలిచే ప్రేమికుడె రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో....

||ఎన్నెన్నెన్నెన్నో||

అసలిట్టా నీ వెంట నే నెట్టా పడ్డానే
అనుకుంటే అప్సరసైనా నా గుమ్మం లోకొస్తారె
విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చేయొద్దే
చనువిస్తె న చిరునవ్వే నీ పెదవుల్లొ వుంటాదె
ఇన్నాళ్ళు భూలోకం లో.. ఏ మూలో వున్నావే
అందిస్తా ఆకాశాన్నె అంతో ఇంతో ప్రేమించావంటే

||మనకన్నా||

అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే
బలమైనా వారధి కట్టి సీతని ఇట్టే పొందాడే
మనమధ్య నీ మౌనం సంద్రం లా నిండిందే
మన ప్రేమే వారధి చేసి నీ కింక సొంతం అవుతానే
చంద్రుణ్ణె చుట్టేస్తానే.. చేతుల్లొ పెడతానే..
ఇంకా నువ్వాలోచిస్తూ కాలాన్నంతా ఖాళి చెయ్యొద్దే

||మనకన్నా||

నమ్మవేమో గాని.. అందాల యువరాణి

నమ్మవేమో గాని.. అందాల యువరాణి
నేలపై వాలింది.. నా ముందే మెరిసింది ||2||
అందుకే.. అమాంతం నా మదీ.. అక్కడే.. నిశ్శబ్ధం అయినదీ
యెందుకో.. ప్రపంచం అన్నది.. ఇక్కడే.. ఇలాగె నా..తో.. వుంది

నిజం గా కళ్ళతో వింత గా మంత్ర మేసింది
అదేదొ మాయలొ నన్నిలా ముంచి వేసింది ||2||

నవ్వులు వెండి బాణాలై నాటుకు పోతుంటే
చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే
చూపులు తేనె దారాలై అల్లుకు పొతుంటె
రూపం యేడు బారాలై ముందర నుంచుంటె
ఆ సోయ గాన్ని నే చూడ గానె
ఓ రాయి లాగ అయ్యాను నే నే
అడిగ పాదముని అడుగు వెయ్యమని..
కదల లేదు తెలుసా..

||నిజం గా||

వేకువ లోన ఆకాశం ఆమెను చేరిందీ
ఓ క్షణమైన అధరాల రంగుని ఇమ్మందీ
వేసవి పాపం చలి వేసి ఆమెను వేడిందీ
శ్వాసల లోన తలదాచి జాలిగ కూర్చుంది
ఆ అంద మంతా నా సొంత మైతే
అనందమైనా వందేళ్ళు నావే
కలల తాకిడి ని మనసు తాళదిక
వెతికి చూడు చెలిని

||నిజం గా ||