Showing posts with label Movie - Seethakoka Chiluka. Show all posts
Showing posts with label Movie - Seethakoka Chiluka. Show all posts

16 November 2007

సాగర సంగమమే - ప్రణయ సాగర సంగమమే

సాగర సంగమమే
ప్రణయ సాగర సంగమమే
కలలే అలలై ఎగసిన కడలికి
కలలో ఇలలో దొరకని కలయిక

కన్యాకుమరి నీ పదములు నేనే
కడలి కెరటమై కడిగిన వేళ
సుమ సుకుమారీ నీ చూపులకే
తడబడి వరములు అడిగిన వేళ

అలిగిన నా తొలి అలకలు నీలొ
పులకలు రేపి పువ్వులు విసిరిన
పున్నమి రాతిరి నవ్విన వేళ
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే

భారత భారతి పద సన్నిధిలో
కులమత సాగర సంగమ శ్రుతిలో
నా రతి నీవని వలపుల హారతి
హ్రుదయము ప్రమిదగ వెలిగిన వేళ

పరువపు ఉరవడి పరువిడి నీ వొడి
కన్నుల నీరిడి కలిసిన మనసున
సందెలు కుంకుమ చిందిన వేళ
సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే

28 October 2007

మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా

మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా
పల్లె కోనెటి తామర్ల్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దు పొడిచె

మిన్నేటి

ఓ చుక్క నవ్వవే వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాల జంట పేరంటాలా
ఓ చుక్క నవ్వవే నావకు చుక్క నవ్వవే
పొందు ఆరాటాల పొంగు పోరాటాలా
మొగ్గ తుంచుకుంటె మొగమాటాలా
బుగ్గ దాచుకుంటె బులపాటాలా
దప్పికంటె తీఋచడానికిన్ని తంటాలా

మిన్నేటి

ఓ రామచిలకా చిక్కని పృఏమమొలక
గూడు ఏమందమ్మా ఈడు ఏమందమ్మా
ఈడుకున్న గూడు నువ్వె గోరింకా తోడుగుండిపోవె అంటి నీవింకా
పువ్వు నుంచి నవ్వునూ తుంచలేనులే యింక

మిన్నేటి

మాటే మంత్రము మనసే బంధము

ఓం శతమానం భవతి శతాయు పురుష
శతెంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్తటి

మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యానం కమనీయం జీవితం
మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యానం కమనీయం జీవితం

నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శౄతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వు తావిగా
సమ్యోగాల సంగీతాలు విరిసే వేళలో

నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
యెదనా కోవెలా యెదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

అలలు కలలు యెగసి యెగసి

స గా మా పా నీ సా
స ని ప మ గ సా
మ మ పా ప ప పా
గ మ ప గ మ గ సా
ని ని సా స స గ గ సా స స
నీ స గా గ మ మ పా
సా స నీ నీ పా ప మా మ
గా గ సా స నీ స

స స స ని ని ని ప ప ప మ మ మ గ గ గ స స స ని ని సా
అలలు కలలు యెగసి యెగసి అలసి సొలసి పొయే
స గ పా ప ప పా మ మ పా ప ప పా
పగలు రేయి అలసి మురిసే
ప ని ప ని ప స ని ప మా గా
సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకొంటే
నీ పులుపు అనె కులులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబికని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ
ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మా
నా పుత్తడి బొమ్మ