Showing posts with label Movie - O Seeta Kadha. Show all posts
Showing posts with label Movie - O Seeta Kadha. Show all posts

04 July 2010

చింత చిగురు పులుపని చీకటంటె నలుపని

చింత చిగురు పులుపని చీకటంటె నలుపని
చెప్పందే తెలియని చిన్న పిల్ల
అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చి పిల్ల

చింత చిగురు పులుపని చీకటంటె నలుపని
చెప్పందే తెలియని చిన్న పిల్ల
అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చి పిల్ల

గట్టుమీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి
హత్తుమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల
గట్టుమీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి
పుట్టమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల
చెంగు చెంగు న చెరువు దాటి చెంత నిలిచి చేయి చాచి
చెలిమి చేయ పిలిచింది చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చి పిల్ల

చింత చిగురు పులుపని చీకటంటె నలుపని
చెప్పందే తెలియని చిన్న పిల్ల
అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చి పిల్ల

చింత చిగురు పులుపని చీకటంటె నలుపని
చెప్పందే తెలియని చిన్న పిల్ల
అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చి పిల్ల

ఎర వేసిన పిల్లవాడు ఎవరనుకుందో
ఎగిరి వచ్చి పడ్డదీ ఆతని వడిలో
తుళ్ళి తుళ్ళి ఆడే ఏ ఏ చిలిపి చేప పిల్ల
తాళి లేని తల్లాయే అమ్మ చెల్లా
నాన్న లేని పాపతో నవ్వే లోకంలో
ఎన్నాల్లు వేగేను చేప తల్లి
అభం శుభం తెలియని పిచ్చి తల్లి పిచ్చి తల్లి