Showing posts with label Music Director - Mickey J Mayer. Show all posts
Showing posts with label Music Director - Mickey J Mayer. Show all posts

05 September 2015

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

విరిసిన పూమాలగా  వెన్నుని ఎద వాలగా  తలపును లేపాలిగా బాలా
పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపా ఇంతగా లేరా
కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినక
గడపల్లో కిరణాలు లేలెమన్నా కదలక
కలికి ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవని
నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచెనే కన్యామణి
నీ కోసమని గగనమే భువి పైకి దిగి వచ్చెనని
ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని
జంకేల జాగేల సంకోచాల జవ్వని
బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి
పిల్లనగ్రోవై ప్రియమార నవ రాగాలే పాడని
అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

ఏడే అల్లరి వనమాలి నను వీడే మనసున దయ మాలి
నంద కుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే
లీలా కృష్ణ కొలనులో కమలములా కన్నె మది
తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది
అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరి కన్నా ముందుగా తన వైపే రమ్మన్నది

విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక
చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారక
వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ

గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా
గోపికమ్మా చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మా నిను విడనీమ్మా మంచు తెరా

21 January 2011

చందమామలా అందగాడిని

చందమామలా అందగాడిని
చుక్కలెందరో నా వెనకే
చుక్కలెందరో చుట్టిముట్టినా
చెలి కొరకే నా పరుగే

పెదవులు పగడ కాంతులు
పలుకులు చెరుకు బంతులు
నడకలు నెమలి గంతులు
గలగలగలలు
కనులలో కోటి రంగులు
నడుములో మర ఫిరంగులు
కురులలో జలధి పొంగులు
జలజలజలలు
తన కొరకే కలవరమై
తన వరకే చెలి స్వరమై
తన దరికే నా ప్రాణమే ప్రయాణమై


జిగిబిగి మనసు సంకెల
తెగువగ తెంచా నేనిలా
మగువను మార్చా ప్రేమలా
తొలితొలితొలిగా
పరిచిన పసిడి దారిలా
విరిసిన వెలుగు ధారలా
నడిచా ఆమె నీడలా కలకలకలగా
తన వలపే అమృతము
తన వరమే జీవితము
తన పరమై తరించనీ ఈ సోయగము

14 August 2010

శ్రీలు పొంగిన జీవ గడ్డై

శ్రీలు పొంగిన జీవ గడ్డై..
పాలు పారిన భాగ్య సీమై.. ||శ్రీలు||
రాలినది ఈ భరత ఖండము..
భక్తి పాడర తమ్ముడా.. ||రాలినది|| ||శ్రీలు||

చరణం

దేశగర్వము కీర్తి చెందగ..
దేశచరితము తేజరిల్లగ....
దేశం మరచిన ధీర పురుషుల..
తెలిసి పాడర తమ్ముడా.. ||దేశం|| ||శ్రీలు|| ||2||

28 June 2010

లల్లలై లైలా మజ్ఞు మనమే అంటూ ఫీలైపోదాం

పల్లవి:

ఆమె:
లల్లలై లైలా మజ్ఞు మనమే అంటూ ఫీలైపోదాం
లల్లలై "ఎల్ ఓ వీ ఈ" మీనింగ్ ఏంటో కనిపెడదాం

అతను:
లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం
లల్లలై నువ్వే నేను నేనే నువ్వై కనపడదాం

ఆ:
మనం ఒకటైతే సరిపోదే మన నీడలనేం చేద్దాం

అ:
వాటినీ పక్కన నిలిపి ఒకటిగ కలిపీ ప్రేమని పేరెడదాం


చరణం:

అ:
నీ ఒంటి మీద చోటు చూసుకుంటా
చిన్న పుట్టమచ్చలాగ అంటుకుంటా
రోజుకొక్క మాటు నువ్వు నన్ను తానాల వేళలోన ముట్టుకుంటె చాలునంటా

ఆ:
పచ్చబొట్టులాగ నేను మారిపోతా
వెచ్చనైన ఛాతిపైన వాలిపోతా
లాలి పాడుకున్న లాయిలాయి లల్లాయి హాయిలోన చందానాలు జల్లుకుంటా

అ:
నీ నడుమొంపు మెలికై ఉంటా
నీ జడపాయ నలుపై పోతా
నీలో లాగు తళుకై ఉంటా
నీ చేతికున్న గాజునై గలగలమంటా

ఆ:
హ్మ్మ్ కొంటె దిగులంతా పలికిందా నీ వయసున గిలిగింతా

అ:
తీగలాగిందే నీవని తొణికిందేమొ పెంచిన ప్రేమంతా


చరణం:

అ:
నువ్వు పిల్లిమొగ్గలెయ్యమంటె రెడీ
ఎత్తుకొండలెక్కి దూకమంటె రెడీ
కన్నె కంటి సైగ చెప్పినట్టు తూచాలు తప్పకుండ చేసుకుంట ప్రేమ సందడి

ఆ:
నువ్వు గాలి ముద్దు పెట్టుకుంటె రెడీ
తేనె విందులోకి దించుకుంటె రెడీ
నిన్ను రాసుకుంటు పూసుకుంటు రాగాలు తీసుకుంటు పాడుకుంట ప్రేమ మెలొడీ

అ:
నువ్వేదంటె అవునని అంటా
నీ పెదవంచు నవ్వై ఉంటా
నీ అరచేత పువ్వై ఉంటా
నా తూరుపెక్కడున్నదంటె నిన్ను చూపిస్తా

ఆ:
పట్టు తెర తీస్త ఎదురొస్తా నువు కోరిన అలుసిస్తా

అ:
అందుకే రేయీ పవలు రెప్పలు కాస్తూ నీకోసం చూస్తా

22 June 2010

Confusion confusion teenege confusion..

Confusion confusion teenege confusion..
మాటల్లొ చెతల్లొ total confusion..
Confusion confusion ఈ life ఏ confusion..
choiceఉల్లొ feelings లొ total confusion..

నిన్నె తెలిసింది మాకు హ్రుదయలున్నయి.. నెడె స్పందిస్తున్నయి..
యెన్నొ wonders ఏ make చుపిస్తున్నయి..ఇంక ముందుంది ఏదొ ఏవొ కావలన్నయి……

ఒక్కొ క్షణం కన్నుల్లలొ temptation..ఒక్కొ క్షణం గుండెల్లలొ sensation

నీకె షూ తొడిగాము.. poison scent పులిమాము
pepe jeans కొన్నము.. అవి మా స్కిన్ను కి చర్మాలె..
Pocket లొన cell phone బరువై. నిలిపింది పరువె
wallet లొన fifty బదులె .. Hundreds ఏ లె..

cinema hall లొ వెసె whistle ఏ.. పెంచింది level ఏ..
fashion channel చుసె కనులె leftఒ rightఒ చుడదన్నయె….

అందల్నే కలిగారు.. గాలుల్లొ వదిలారు..
శ్వాసల్లొ కలిపారు… మనసున ఊపిరి ఉప్పెన లే…
మెరిసె సొగసె మెరిపించెస్తె నరముల్లొ కుదిపె
నిలువద్దము లె magnets లాగ లాగెసాయె..
కలలొ మీరె బయట మీరె…కనిపిస్తున్నరె ..
తనతొ నిజమె fighting చెసె ..మీతొ friendship అయ్యె దాకె….

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..


ఈ వయస్సులో ఒక్కో క్షణం..ఒక్కో వసంతం..
నా మనస్సుకే ప్రతీ క్షణం..నువ్వే ప్రపంచం..
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం..
అడుగులలోనా అడుగులు వేస్తూ..నడిచిన దూరం ఎంతో వున్నా..
అలసట రాదు గడిచిన కాలం ఇంతని నమ్మను గా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..


నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే..
నా గతాలనే కవ్వింతలే పిలుస్తూ ఉంటే..
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే..
పెదవికి చెంపా తగిలిన చోటా..
పరవశమేదో తోడవుతుంటే..పగలే అయినా గగనం లోనా..తారలు చేరెనుగా..

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..

14 June 2010

ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం..

ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం..పొందిగ్గా ఉండం..పరిగెడుతూ ఉందాం..
పక్షుల్లా పోదాం..నక్షత్రాలవుదాం..నింగి అంతా అందం..నిచ్చెనలూ వేద్దాం..
భూలోకం మొత్తం మనకేరా సొంతం..జనమంటే అర్థం..మన చెంతే అందాం..
ఎవరూ లేరందాం..ఉన్నా అటు చూడం..తొలి ఈవ్ ఎండ్ ఆడం మనమే అనుకుందాం..

హరిలో రంగా హరి ఇదేం తమాషే..కారంగా వాడే జోడి తరవాత రాసే..
భాగోతం బాగుందా ఓ సరే సభాసే..ఐసే ఐసే ఒకటే దురుసే..
ఆనందో బ్రహ్మా అంటూ షికార్లు చేస్తే..అమ్మోరు పూనినట్టు ఈరంగమేస్తే..
ఎన్నాళ్లీ చోరా చోరీ తోచింది చేస్తే..చూస్తే గీస్తే మతే మటాషే..

జంట కుదిరిన జోషే..కంటపడితే వెంటపడక ఒంటి కలతో ఉంటదా..
నిష్ట చెదిరిన మనసే వింటదా చెబితే..
కత్తి పదునై కోసే..కొత్త చినుకు గుండె తొడుగుతుంటే కునుకు పడతదా..
నరం నరం నములు గరం గరం గుబులు..క్షణం క్షణం దిగులు ఇచ్చే అంటంతా..
అదో రకం తెగులు అయోమయం సెగలు..పుట్టించడం తగని పనే కదా..


లోకుల్లారా దీవిస్తే మీకే మేలంటాం..కాకుల్లాగా కవ్విస్తే 'కేర్ ఏ పిన్' అంటాం..
ఏం చేస్తారో మీ ఇష్టం మాకేం అనుకుంటాం...మున్ముందుకు పోతాం ఆగం మీ కోసం..
........................................
సయ్యన్నారా సరదాగా సంగతి చెప్పుకుందాం
కాదన్నారా..ఎసేయి రా..సేయి రా అనుకుందాం..
అసలెందుకులే మీ అందరి ఒప్పందం..
వై...కాపేస్తే కంచెలు తుంచుకు పోతాం..
వై..ఆపేస్తే తప్పక తప్పుకు పోతాం..
వై..కోపిస్తె కొండల నుంచి కిందికి వచ్చి కిక్కున తుంచే కొంపలు ముంచే గోదారైపోతాం..
వై..ఆవారా గాలిని బంధిస్తారా..
వై..కెరటాలకు కొరడా చూపిస్తారా..
వై..గుప్పెట్లో నిప్పును పట్టి కప్పడమంటే ముప్పని ఎవరూ చెప్పక ముందే తెలిసిందే..

పొందేయ్ లాభం..మ్..మ్..మ్..

జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..
జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..

ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం..పొందిగ్గా ఉండం..పరిగెడుతూ ఉందాం..
పక్షుల్లా పోదాం..నక్షత్రాలవుదాం..నింగి అంతా అందం..నిచ్చెనలూ వేద్దాం..
భూలోకం మొత్తం మనకేరా సొంతం..జనమంటే అర్థం..మన చెంతే అందాం..
ఎవరూ లేరందాం..ఉన్నా అటు చూడం..తొలి ఈవ్ ఎండ్ ఆడం మనమే అనుకుందాం..

[జంట కుదిరిన జోషే]

జైరాం..జైరాం..జై జై జైరాం...జైరాం...జై జై జైరాం...జైరాం..జై జై ..జై జై ..రాం..

నా న నానా నానానా..

నా న నానా నానానా..నా న నానా నానానా..నా న నానా నానానా..నా..నానానానా..
ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..
పుట్టుకొచ్చే పిచ్చి..నువ్వు నచ్చి..పట్టుకొచ్చా మెచ్చి..పంచుకోవ లవ్ రుచి..
పట్టపగలే వచ్చి..బరితెగించి..పచ్చి వగలే తెచ్చి..వెంట రాకే కొంటెగా కవ్వించి..
ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..

ఒంటరి ఈడు కదా..తుంటరి తొందర ఉండదా..ఎందుకు ఈ బెడదా..తగునా..
అందుకు ఆడ జతా..తప్పక అవసరమే కదా..నువ్వది కాదు కదా..అవునా..
ఇంతలేసి కళ్లు ఉన్నా గంతలేసుక్కుచున్నావా..నన్ను చూస్తే కొంచెమైనా గుండె తడబడుకుంటుందా..
బాప్ రే బాప్ తెగ బెదిరానే..నమ్మవేం చెబుతున్నా..గాభరా పడుతున్నానే..చాలదా..పులి కూనా..

ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..

దక్కిన చుక్కనిలా..తక్కువ చేయకు ఇంతగా..మక్కువ దాచకలా మదిలో..
కమ్ముకు రాకే ఇలా..తిమ్మిరి పెంచకె వింతగా..గమ్మున ఉండవెలా తెరవో..
ఆశపుడితే ..దాగుతుందా.. రాసకార్యం ఇన్నాళ్లుంటే..మూతపెడితే దాగుతుందా.. చాలు రాదది జోకొడితే..
క్యా కరే నాకేం దారి..నౌకరీ పోతుందే..పోకిరి వైఖిరి చాలే..ఛోకిరి వదిలెయ్వే..

ప్యార్ కర్నా సీఖోనా..పారిపోతే పరువేనా..కోరుకుంటే ఏదైనా..నే కాదంటానా..
యా ఖుదా జర దేఖోనా..దూకుతున్నది పైపైనా..దిక్కు తొచక చస్తున్నా..ఏం జోరే జాణా..
పుట్టుకొచ్చే పిచ్చి..నువ్వు నచ్చి..పట్టుకొచ్చా మెచ్చి..పంచుకోవ లవ్ రుచి..
పట్టపగలే వచ్చి..బరితెగించి..పచ్చి వగలే తెచ్చి..వెంట రాకే కొంటెగా కవ్వించి..
నా న నానా నానానా..నా న నానా నానానా..నా న నానా నానానా..నా..నానానానా..

నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..

నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..
ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా....ఓ..ఓ..ఓ..ఓ..

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..
వలపేదో వల వేసింది..వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే రుజువేముంది..ఓ..ఓ..ఓ..ఓ..
సుడిలో పడు ప్రతి నావా..ఓ..ఓ..ఓ..ఓ..చెబుతున్నది వినలేవా..

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా..
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా..
కడ తేరని పయనాలెన్ని..పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేశాయా చరిత పుటలు..వెనుజూడక ఉరికే వెతలు..
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు....ఓ..ఓ..ఓ..ఓ..

ఇది కాదే విధి రాత....ఓ..ఓ..ఓ..ఓ..అనుకోదేం ఎదురీత..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో..సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా ....ఓ..ఓ..ఓ..ఓ..

ఓ కే అనేసా

ఓ కే అనేసా
దెఖో నా భరోసా
నీకే వదిలేశ
నాకెందుకులే రభసా || ఓకే

భారమంతా నేను మోస్తా అల్లుకో అశాలతా
చేర దీస్తా సేవ చేస్తా రాణి లా చూస్తా
అందుకే గా గుండెలో నీ పేరు రాశా
తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా
కధ మొదలనుకొ తుది వరకూ నిలబడగలదా ||ఓ కే

1|| పరిగెడదాం పదవే చెలీ ఎన్దాక వెళ్ళాలొ
కనిపేడదాం తుది మజిలీ
ఎక్కడున్నా
ఎగిరెలదామ్ ఇల నొదిలీ నిన్నాగా మన్ననా
ఎగరగలమ్ గగనాన్ని
ఎవరాపినా
మరో సారి అను ఆ మాట
మహారాజునై పోతాగా
ప్రతి నిమిషం నీకోసం
ప్రాణం సైతం పందెం వెసెస్తా
పాత రూణమో కొత్త వరమొ
చెంగు ముడి వేసిండిరా
చిలిపి తనమూ చెలిమి గుణమూ
ఏమిటీ లీలా
స్వప్న లోకం ఏలూకుందాం రాగామాల
అదిగదిగో మది కెదురై కనబడలేదా
కధ మొదలనుకొ తుది వరకూ నిలబడగలదా
2|| పిలిచినదా చిలిపి కలా వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియ నిలా పరుగు తీసా
వదిలినదా బిడియామిలా
ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవగా చిక్కు వలా
ఎటో చూశా
భలే గున్దిలె నీ ధీమా
ఫలిస్థున్దిలీ ఈ ప్రేమా
ఆదరకుమా బెదరకుమా
త్వరగా విదిరా సరదా పదదామా
పక్కనుంటే ఫక్కుమన్తూ నవ్విరారా ప్రియతమా
చిక్కు నుండి బిక్కుమాంటూ
లెక్క చేస్తావా
చుక్కలన్నీ చిన్న బోవా
చక్కనామ్మ
మగతనుకో మగతనుకో మతి చెడిపోడా కధ మొదలనుకొ తుది వరకూ నిలబదగలదా

సరిగా పడనీ ఇపుడే తొలి అడుగూ

సరిగా పడనీ ఇపుడే తొలి అడుగూ
సుడిలో పడవై ఎపుడూ తడబడకూ
మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్లు
వేకువై వెలగనీ తెరవనీ నీ కళ్ళు
కన్నఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే
మన్ను తడి తగలాల్సిందే మునుముందుకు సాగాలంటే
కిందపడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే
చలో చలో

నిన్నే చూసే అద్దం కూడా నువ్వా కాదా అనదా
అచ్చం నీలా ఉండేదెవరా అంటూ లోకం ఉలికిపడదా
సూర్యుడ్లో చిచ్చల్లే రగిలించె నీలో కోపం
దీపంలా వెలిగిందా జనులందరిలో
చంద్రుడ్లో మచ్చల్లే అనిపించే ఏదో లోపం
కుందేలై అందంగా కనపడదా
నీలా నవ్వే క్షణాలలో

చెక్కే ఉలితో నడిచావనుకో దక్కే విలువే తెలిసీ
తొక్కే కాళ్ళే మొక్కేవాళ్లై దైవం అనరా శిలను కొలిచీ
అమృతమే నువు పొందూ విషమైతే అది నావంతూ
అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు
అందరికీ బతుకిచ్చే పోరాటంలో ముందుండు
కైలాసం శిరసొంచీ నీ ఎదలో ఒదిగే వరకూ
చలో చలో

తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..

ఇవ్వాళ నాకు చాలా హ్యాపీ గా ఉంది.
లైఫ్ అంతా నాతో ఇలాగే ఉంటావా

తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..
మదేం విందో విందో లేదో కలేంకాదే ఇదంతా..
ఇంత లోనే అంత మైకం పనికి రాదే ప్రాణమా
పరవశం లో మునిగి పోతే పైకి రాగలమా...

తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..
మదేం విందో విందో లేదో కలేంకాదే ఇదంతా..

కుడివైపున ఇంకో హృదయం ఉన్నాసరిపోదో ఏమో..
ఈ వెలుగును దాచాలంటే..
పడమరలోనైనా ఉదయం ఈ రోజే చూశానేమో..
మనసంతా ప్రేమై పోతే..
ఎగిరొచ్చిన ఏదో లోకం నాచుట్టూ వెలిసిందేమో..
మైమరపున నేనిలిచుంటే...

ఇంత లోనే అంత మైకం పనికి రాదే ప్రాణమా
పరవశం లో మునిగి పోతే పైకి రాగలమా...
తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..
మదేం విందో విందో లేదో కలేంకాదే ఇదంతా..

ఇదే క్షణం శిలై నిలవనీ..
సదా మనం ఇలా మిగలనీ..
జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళూ..
నీ జంటై ఇవ్వాళ్ళే జీవించా నూరేళ్ళూ..

తనేమందో.. మదేంవిందో..
తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..
మదేం విందో విందో లేదో కలేంకాదే ఇదంతా..
ఇంత లోనే అంత మైకం పనికి రాదే ప్రాణమా
పరవశం లో మునిగి పోతే పైకి రాగలమా...

తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..
మదేం విందో విందో లేదో కలేంకాదే ఇదంతా..

07 June 2010

పొద్దులెగలి స్నానంచెయాలి బస్సు ఎక్కాలి

పొద్దులెగలి స్నానంచెయాలి బస్సు ఎక్కాలి college కెళ్ళాలి ... ఒహ్హ్హ్హ్హ్హ్హ్ ఒహొహొహొహ్ 4
bathroom లొ పాటలు breakfast లొ మాటలు అమ్మ ముందు wonderఉ
నాన్న ముందు blunderలు pocket money కి tenderలు
ఇక busలకై waitingఊ foot board లొ fightingఊ canteen లొ meetingఊ ..

జిల్ జిల్ జింగ 8

teachers తొ classలు class లొ sms తొ మాటలు mms తొ అటలు
last bench seatingఉ cellphone తొ gamingఉ interval కె waitingఉ
last bench seatingఊ magazines readingఊ interval కె waitingఊ ....
యేహ్ యేహ్ యేహ్ ....

జిల్ జిల్ జింగ 8

పొద్దులెగలి స్నానంచెయలి ...
imax లొ cinemaలి morningఉ matineeలు లొ bowling food court లొ datingఉ...
హెయ్ పిల్ల what man నీ styleఎంతె పిల్ల నె confirmation nil ఆ ... హెయ్ పిల్ల హెయ్ పిల్ల
పిల్ల పిల్ల హెయ్ పిల్ల హెయ్ పిల్ల ....హెయ్ హెయ్

జిల్ జిల్ జింగ 8

ఇక bus లకి waitingఉ busstop లొ chattingఉ waitingఉ waitingఉ...
ఇక busలకి waitingu waitinguuu waitinguu... footboard లొ fightingఊఉ

వీడుకొలె వెదికైన....

వీడుకొలె వెదికైన....
వీడలెని... స్నెహమైనాఅ...
అనంతమూఊ ఊఒహ్హ్హ్ ఊఊ ఊఒ
అసంతమాఆ ఊహ్హ్హ్ ఊఒ ఊఒ

happydays happydays happydays
happydays happydays happydays

పరిచయాల పరిమళాల్లె...అనుభవాల అల్లికలు వెళ్ళి....
చెలిమికి నెలవైనా...చదువుల కొలువైనా....
ప్రతిక్షణం ఒహ్హ్హ్ ఊఒ ఊ ఊఊ
మహొదయమ్మ్మ్మ్ ఊహ్హ్ ఊఒ ఊ ఊఒ ఊఊ...

happydays happydays happydays
happydays happydays happydays

happydays happydays happydays
happydays happydays happydays

ఊఊఊఊఒహ్హ్హ్హ్ ఊఊఒ ఊఊఊ
ఊఊఊఊఊహ్హ్హ్హ్ ఊఒ ఊఊఊ.......

మనస్సు నీలో వున్నా

మనస్సు నీలో వున్నా
పదవి కోసం కాదన్నా
వలపు చాలా వున్నా
ప్రజల సేవే భేషన్నా

భారతీయ ఒబామా నువ్వేనా
తోడు నీడ లాగ నేనుండలేన
అబ్దుల్ కలామే నువ్వైనా నీదాన్ని కాలేన!

హే సి. ఎం!
రాష్ట్రం నీకు ఓకే
సిక్స్ పి.ఎం ప్రాయం నీకు నాకే
నీ సాయం పి.ఎ గా, ప్రియాగా నీకు నేను లేనా!
||హే సి. ఎం||

మనస్సు నీలో వున్నా
పదవి కోసం కాదన్నా

ప్రేమంటే చేదా! అది దాచేదా?
ఒంటరిగా ఉంటావే
వన్ ప్లెస్ వన్ కారాద!
అవినీతికి దూరమైతే పర్వాలేదు
ఆడది నీ దూరం అయితే పరువే లేదు!

హాయ్ హాయ్ ప్రేమిక
అన్నదిలే పావురాయి
సై సై ఆగక
అన్నదిలే పంజరం!

హే సి. ఎం!
రాష్ట్రం పారిపోదు
స్వీట్ వెల్కం! ప్రాయం రేపు రాదు
హే ప్రీతం! మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా!
||హే సి. ఎం||

లేదంటూ లేదా! అది బాలేదా!
ఒంటరిగా ఉంటేనే జెంటిల్ మెన్ మర్యాదా?
వయసైందని చేసుకుంటే వతికి పోరు
మనసే చంపేసుకుంటే ఎట్టా సారూ!
హాయ్ హాయ్ ప్రేమిక
సత్యమిదే సుందరం
కాయ్ కాయ్ కోరిక
ఉత్తరమే పెత్తనం!

భారతీయ ఒబామా నువ్వేనా
తోడు నీడ లాగ నేనుండలేన
అబ్దుల్ కలామే నువ్వైనా నీదాన్ని కాలేన!

హే సి. ఎం!
రాష్ట్రం నీకు ఓకే
సిక్స్ పి.ఎం ప్రాయం నీకు నాకే
నీ సాయం పి.ఎ గా ప్రియాగా నీకు నేను లేనా!

హే సి. ఎం!
రాష్ట్రం పారిపోదు
స్వీట్ వెల్కం! ప్రాయం రేపు రాదు
హే ప్రీతం! మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా!

అందరాన్నా భలే అందగాడ

అందరాన్నా భలే అందగాడ
ఎందులోన సరే-లేని వాడ
రేగిపోరా ఒరేయ్ రాజా
కాయ్ రాజా కాయ్ రాజా
కమ్ముకో రాజా

హాయి హాయి
హాయి హాయి నాయక
హాయినింక వాయిదాలు వేయక
ఊరుకైన పొందుకైన నీవిక
దేశమైన దేహమైన నీవేగా
||హాయి హాయి ||

రాజశేఖర! రాజశేఖరా!
రాజశేఖర నీ పై మోజు తీరలేదురా
రాజసాన ఏల రారా రాజ రాజ రాజా
||రాజశేఖర|| ||రాజశేఖర||

చూపులన్నీ పూల బాణాలే
తోరుణపు తీసిప్రాణాలే
మోజులెన్నో రాజుకున్న రాసుకున్న వేళలో
మీసమాడి మేళ్ళమాడే మేనమాడే గోలలో
ఒంటికుట్టి ఇదలేని ఈడులో
ఒంటినిండా వేసవాయే వేడిలో వేసవి |మోజులెన్నో|

రాజు నీవైతే
రాజు నీవైతే రాణి నేను అవుతా
మోజుగా మొహనాలే చేసుకో రాజ రాజ రాజా
||రాజశేఖర||
||అందరాన్నా||

స్వగాతాలేలే పూలహారాలే
కాగితాలు ఏలే సంతాకాలల్లె
నన్ను గీటే కోరిక
సనగిల్లె ఓపిక
చిక్కదోయి తీరిక
దక్కినంతే చాలిక |నన్ను గీటే|
మాట నువ్వుంటే మంత్రినైపోత
నీ మొఘల్ మోజులన్ని తీర్చుకో రాజ రాజ రాజా
||రాజశేఖర|| ||రాజశేఖర|| ||రాజశేఖర||

అవుననా! కాదనా! నాదనా!

అవుననా! కాదనా! నాదనా!
లేదనా! రాదనా! వేదనా!

మూగమైనా రాగమేనా
నీటిపైనా రాతలేనా
||అవుననా||

తారకా రా దూరమైన చోటనే ఆకాశాలు
తను నేను వెల్లువైతే వెన్నెలే కాబోలు
నింగి నేల ఏకమైన పొద్దులో సింధూరాలు
నీకు నేను చేరువైనా ఎందుకో దూరాలు
దొరికింది దొరికింది తోడలే దొరికింది
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
దొరికింది దొరికింది తొడలే దొరికింది
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
ఇందుకేనా! ప్రియా ఇందుకేనా!
||అవుననా||

ఆశలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే
శ్వాసలేలే బాసలన్నీ బాధలై పోయేలా
పూలజడలో తోకచుక్క గుట్టుగా ఊయల ఊగీ
రాసలీల రక్తధార బాధలై పోయేలా
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది మెరిసింది మెరుపేదో మెరిసింది
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది మెరిసింది మెరుపేదో మెరిసింది
ఇందుకేనా ప్రియా! ఇందుకేనా!
||అవుననా||

ఏ శకునీ ఆడని జూదం

ఏ శకునీ ఆడని జూదం
బతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణ కాష్టం
చితిలోనే శీమంతం
ఇది మంచికి వంచన శిల్పం
ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మా 'తరం'!
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
||ఏ శకునీ||

మిగిలినా దిక్కుగా
నిలిచినా నాతల్లికై
పొగిలినా నింగిలో
నిలవనీ ధృవతారకై
రాజ్యాలేలే ఈ డబ్బు హోదా కాలే జ్వాలను నేనై
జీవన యజ్ఞం సాగించగా
వచ్చే ఆపద
విచ్చే పూపొర నడిపిస్తాం కదా!
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది

ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది
ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది

ప్రేమనే మాటే అంటున్నా ఎవ్వరేమనుకున్నా
నీ జతే కావాలంటున్నా నిజమైనా
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్నా
నిడలా నిన్నలా నాలోన కలుపుకోనా
నిదురలో నువ్వేనా నిజములో నువ్వేనా
ఈ వింతలన్నీ ప్రేమేనా

I Love You I Love You I Love You
I Love You I Love You I Love You

ప్రేమనే మాటే అంటున్నా ఎవ్వరేమనుకున్నా
నీ జతే కావాలంటున్నా నిజమైనా
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్నా
నిడలా నిన్నలా నాలోన కలుపుకోనా

నిన్నుకొలువుంచేస్తున్నా కంటి పాపల్లోన
కనులకే జోకొట్టేలా కలల మాటునా
జన్మలే కరింగించేలా జంటనే కలిపేనా
వెన్నెలే కురిపించే ఆ ప్రేమ దీవెన

Baby you are my sweet heart
Baby you are my sweet sweet heart

ప్రేమనే మాటే అంటున్నా ఎవ్వరేమనుకున్నా
నీ జతే కావాలంటున్నా నిజమైనా
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్నా
నిడలా నిన్నలా నాలోన కలుపుకోనా

Girl I want you by my side
Oh I wanna hold you tight
Girl I wanna kiss your lips
I can feel your love

ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది ప్రేమ ప్రేమ ఇది

నిన్ను నా జతలో నిలిపే దేవుడే ఎదురైతే
వాడికే ఓ వరమిచ్చి సాగనంపనా
జంటగా నాతో నడిచే దేవతే నువ్వంటూ
లోకమే వినిపించేలా చాటి చెప్పనా
నిదురలో నువ్వేనా నిజములో నువ్వేనా
ఈ వింతలన్నీ ప్రేమేనా

I Love You I Love You I Love You
I Love You I Love You I Love You

ప్రేమనే మాటే అంటున్నా ఎవ్వరేమనుకున్నా
నీ జతే కావాలంటున్నా నిజమైనా
ఓ క్షణం నీతో లేకున్నా ఒంటరైపోతున్నా
నిడలా నిన్నలా నాలోన కలుపుకోనా

నిన్ను నన్ను చేరో జగాలలో

నిన్ను నన్ను చేరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా

నిన్ను నన్ను చేరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా

ప్రపంచమే వెలేసినా వెలేయని జ్ఞాపకమా
కనే కలే కన్నీరయ్యే నిజాలుగా మారకుమా
గతించిన క్షణాలని ముడేసిన ఆ వరమా
విధే ఇలా వలేసినా జయించును నా ప్రేమ

నిన్ను నన్ను చేరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా

నా మనసే విరిసే స్వరాలుగా
గతానికే నివాళీగా పదాలు పాడనీ
ఇవాళ నా ఉషొదయం జగాలు చూడనీ
ప్రతీ కల ఒకానిలా సుమాలు పూయనీ