20 October 2007

మంచిని మరచి వంచన నేర్చి

మంచిని మరచి వంచన నేర్చి
మంచిని మరచి వంచన నేర్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు …. వానరుడైనాడు
మంచిని మరచి వంచన నేర్చి
మంచిని మరచి వంచన నేర్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు …. వానరుడైనాడు
చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు
చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు
నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాళానికి జారాడు
మెదడే పెరిగి హృదయం తరిగి
నరుడే ఈనాడు వానరుడైనాడు ….. వానరుడైనాడు
అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు
అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు
పంపకమంటూ వచ్చేసరికి అంతా తనదే అన్నాడు
ధనమే హెచ్చి గుణమే చచ్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు …. వానరుడైనాడు

1 comment:

Nrahamthulla said...

దేవుడు ఉన్నాడో లేడో మానవుడున్నాడురా
వాడే దేవుడు కలడో లేడని తికమకపడుతున్నాడురా
మానవుడున్నంతవరకు దేవుడు ఉంటాడురా
వాడినితలచేందుకు మానవుడుండాలిరా [దేవుడు ]

తనలో మంచిని పెంచుకునేటందుకు
తానే దేవుడు అయ్యేటందుకు
మనిషొకరూపం కల్పించాడు
అది మనిషి మనిషికొక రూపమయి
పలుమతాలుగా మారాయిరా [దేవుడు ]

భయంనుంచి దేవుడు పుట్టాడు
భక్తి నుంచి దైవత్వం పుట్టింది
భయం భక్తులను మించిన స్థితినే
ముక్తి అంటారురా [దేవుడు ]

మనిషికోసం బ్రతికే మనిషే దేవుడు
దేవుడి కోసం మనిషిని మరిచే వాడే మూఢుడు
ప్రేమ త్యాగం తెలిసిన వాడే మానవుడూ
దేవుడి పేరిట మూఢుడైతే వాడే దానవుడు [దేవుడు ]

గాయకుడు-జేసుదాసు