28 October 2007

లలిత ప్రియ కమలం విరిసినది

లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది
కన్నుల కొలనిది
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
అమ్రుత కలశముగా ప్రతినిమిషం
అమ్రుత కలశముగా ప్రతినిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది

లలిత

రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నెల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హ్రుదయం
కలల విరుల వనం మన హ్రుదయం
వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల
పాడుతున్నది ఎదమురళి రాగ చరితర గలమ్రుదురవళి
తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను

లలిత

కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం
తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమం
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన బిలిబిలి గమకము
కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం
స్వాగచించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి
ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ

లలిత

No comments: