కలగా కమ్మని కలగా మన జీవితాలు మనవలెగా
కలగా కమ్మని కలగా
అనురాగమె జీవనతీరముగా ఆనందమె మనకందముగా
కలగా కమ్మని కలగా
రాగవశమున మేఘమాలిక మలయపవనుని కలిసి చేరగా
రాగవశమున మేఘమాలిక మలయపవనుని కలిసి చేరగా
ఆ……. కొండను తగిలి గుండియ కరిగి నీరై ఏరై పారునుగా
కలగా కమ్మని కలగా మన జీవితాలు ఒక కలగా
కలగా కమ్మని కలగా
వెలుగు చీకటుల కలబోసిన ఈ కాలము చేతులో కీలుబొమ్మలం
భావన లోనే జీవనమున్నది మమతే జగతిని నడుపునది
మమతే జగతిని నడుపునది
కలగా కమ్మని కలగా
తేటి కోసమై తేనియ దాచే విరికన్నియగా సంబరమేమో
వేరొక విరిని చేరిన ప్రియుని కాంచినప్పుడా కలత ఏమిటో
ప్రేమకు శోకమె ఫలమేమో రాగము త్యాగము జత ఏమో
కలగా కమ్మని కలగా.
No comments:
Post a Comment