19 October 2007

ఎవరికి తెలుసు చితికిన మనసు

ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని
ఎవరికి తెలుసు ..
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని
ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసు ..
మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ..
మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ
చీకటి మూగిన వాకిట తోడుగ నీడైనా దరి నిలవదని
జగతికి హృదయం లేదని ..ఈ జగతికి హృదయం లేదని
నా జన్మకు ఉదయం లేనే లేదని
ఆ… ఆ…. ఆ…. ఆ….. ఎవరికి తెలుసు ..
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని
ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసు
గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం
గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం
నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూర్పులే సంగీతం
నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూర్పులే సంగీతం
ప్రేమకు మరణం లేదని .. నా ప్రేమకు మరణం లేదని
నా తోటకు మల్లిక లేనే లేదని
ఆ… ఆ…. ఆ…. ఆ….. ఎవరికి తెలుసు ..
ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని
ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసు …..

No comments: