13 February 2010

గాలికదుపు లేదు.. కడలికంతులేదు

ఆఆ అ .. ఆఆ అ.. ఆఆఆ అ.. ఆ ఆ ఆ ఆ.. అ అ అ.. అ అ అ
అ అ అ.. అ అ అ

గాలికదుపు లేదు.. కడలికంతులేదు
గంగ వెల్లువ కమండలంలో ఇమిడేదేనా..
ఉరికే మనసుకు గిరిగీస్తే ఆగేదేనా

గాలికదుపు||

సనిస స.. సరి సరి సరి రిస సని.. సనిస స.. సరి సరి సరి రిస సని (౨)

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నేమలినై ఆడనా ఆటలు ఎన్నో..
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేడి కేది కట్టుబాటు
మళ్ళి మళ్ళి వసంతంమొస్తే మల్లె కేల ఆకుచాటు

గాలికదుపు||

ఓ తెమ్మెరా.. ఊపవే ఊహల ఊయల నన్ను..
ఓ మల్లికా.. ఇవ్వవే నవ్వుల మాలిక నాకు..
తల్లి మళ్ళి తరుణయ్యింది.. పువ్వు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది

గాలికదుపు||

అ అ ఆ ఆ అ అ
అ అ ఆ ఆ అ అ

No comments: