13 February 2010

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ

చిటాపటా చినుకులతో కురిసింది వాన మెరిసింది జాణ (చిటా..)

తళాతళా మెరుపులతో మెరిసింది పైన ఉరిమింది లోన (తళా..)



వచ్చే వచ్చే వానఞల్లు ఞల్లు కాదది

పొంగివచ్చు పడుచుదనం వరదలే అది

వరద కాదది ఆగలేని చిలిపితనం వాగులే అది నీ వేగమే అది (చిటా..)



నల్లమబ్బు తెల్లమబ్బు ముద్దులాడుకున్నవి

చుక్కలన్ని చీకట్లో ముసుగు కప్పుకున్నవి

ఉల్లిపొర చీర తడిసి ఒంటికంటుకున్నది

మెరిసి మెరిసి రెండు కళ్లు వాకిళ్లు కావవి

వలపు తేనెలూరే రసగుళ్లులే అవి సెలయేళ్లులే అవి (తళా..)

No comments: