13 February 2010

లాలిలో లాలిలో మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే

లాలిలో లాలిలో మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే
నా కన్నతల్లి నీవే లాలి లాలిజో
మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే
నా కన్నతల్లి నీవే లాలి లాలిజో
ఈ జన్మలో మీ అమ్మనై నీ ఆటలో నే బొమ్మనై పాడేను ప్రేమజోల
మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే
నా కన్నతల్లి నీవే లాలి లాలిజో

ఆశలన్ని ధారపోసి పెంచుకున్న ప్రేమలో పంచుకున్న పాశమే తెంచుకున్న బంధమై
కన్నపేగు ముళ్ళు వేసి కానరాని గాధలో నోచుకున్న నోముకే నీకు నేను తల్లినై
కలలెన్నో కన్నా నీకోసం కంట చూసుకున్నా నీరూపం
వర్ధిల్లాలి చల్లగా మా జాబిల్లిగా
వయ్యరాల వల్లిగా నవ్వే మల్లిగా
నీ సంతొషం,సౌభాగ్యం నీ తల్లిదే

మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే

తీరమెంత దూరమైనా తీరిపోని రాగమే గొంతు దాటలేనిదై మూగరాసి గీతమై
రక్తపాశమన్నదే రంగుమార్చలేనిదై కల్లలోని కుంకుమై వెల్లువైన వర్ణమై
గాలిగోపురాన జేగంట విన్న దేవతైనా రాదంట
పొంగే ఎండమావులా సాగే నావనై
కృంగే గుండె లోయలో రాలే తారనై
నిను దీవిస్తూ జీవిస్తా నీ నీడనై

మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే
నా కన్నతల్లి నీవే లాలి లాలిజో
ఈ జన్మలో మీ అమ్మనై నీ ఆటలో నే బొమ్మనై పాడేను ప్రేమజోల
మా కంటి పాప నీవే మా కాంతిరేఖ నీవే
నా కన్నతల్లి నీవే లాలి లాలిజో లాలి లాలిజో లాలి లాలిజో

No comments: