13 February 2010

లే లే బాబా నిదురలేవయ్యా

లే లే బాబా నిదురలేవయ్యా
ఏలే స్వామీ మేలుకోవయ్య
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా
లే లే లే లే లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా

వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టి ఆ ఆ ఆ ఆ
వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టి
పాద సేవ చేసుకునే వేల దాటిపోయెనని
ప్రశ్నవేయకుంటే మంచిదే ఇద్దరికీ
పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తంద్రికి
అందుకనె గుండె నీ గురు పీఠమయినది
ఆరాధ్య దైవమని కొని యాడుతున్నది
అంతకుమించిన భాగ్యమేదిరా బబ
లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా

నీలకంఠ స్వామిలొ నిండుకున్న జ్యోతివై
సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై
లోకములు కాచే తండ్రివి నీవేనని
రూపముల నేకములయిన శ్రీ సాయి ని
నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై
కుమ్మరించు వరములే సుఖ సాంతి నెలవులయి
వెన్నంటి నువ్వుంటే లోటె లేదురా బబా
లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా
రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ
చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా
లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా

No comments: