09 September 2008

లేత పచ్చ ఆకులు రేయి నల్ల వక్కలు

లేత పచ్చ ఆకులు
రేయి నల్ల వక్కలు
వెన్నెలంటి సున్నము
ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే
తాంబూలం అరుణమందారం అదే కళ్యాణం

లేత పచ్చ ఆకులు
రేయి నల్ల వక్కలు
వెన్నెలంటి సున్నము
ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే
తాంబూలం అరుణమందారం అదే కళ్యాణం

నీటిలోని కలువకి నింగిలోని జాబిలికి ఏనాడో జరిగింది కవితా కళ్యాణం
కడలిలోని ఉప్పుకి అడవిలోని ఉసిరికి ఏనాడో జరిగింది రసనా కళ్యాణం
రవికులజుడు రాముడికి భూమిపుత్రి సీతకి జరిగింది కళ్యాణం
లోక కళ్యాణం అదే దాంపత్యం ఇదీ తాంబూలం

లేత పచ్చ ఆకులు
రేయి నల్ల వక్కలు
వెన్నెలంటి సున్నము
ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే
తాంబూలం అరుణమందారం అదే కళ్యాణం

పలుకుతల్లి చిలకకి పడుచు గోరింకకి జరుగుతోంది అనాదిగా మాట వరస కళ్యాణం
రేయి పగలు రెంటినీ ఆలుమగలుగా చేసి జరుగుతోంది ప్రతిరోజు సంధ్యా కళ్యాణం
పసుపులాంటి పార్వతికి సున్నమంటి శివుడికి జరిగింది పారాణి కళ్యాణం
జరిగింది ఆ ఊ మా సంగమం
ఆ ఊ మా సంగమం
ఓం ఓం ఓం

08 September 2008

లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా

లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులు దోచుకోలేవులే
మన వలపువాకిలిని అవి తాకగలేవులే

లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా

అందాల నా కురులతో వింజామరలు వీచనా (2)
రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా
నీ కురులవీవదలకు నా హ్రుదయమర్పించనా
రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా
కనుల భాష్పాలు కలల భాష్యాలు
వలపుగా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా

లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులు దోచుకోలేవులే

అధరాల కావ్యాలకు ఆవేశమందించనా(2)
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై కలనై విరినై ఝురినై నిన్నే కోరనా
హృదయనాదాల మధురరాగాల
చిగురు సరసాల నవవసంతాల విరిలెన్నో అందించగా

లేత చలిగాలులు దోచుకోలేవులే
మన వలపువాకిలిని అవి తాకగలేవులే

ఆహ హాహాహా హోయ్ హుహు హుహుహు

18 August 2008

లేడి కన్నులు రమ్మంటే

లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మంటే (2)
ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓలమ్మీ సై సై సై ఓలమ్మీ సై
కన్నె మనసే నీదైతే కలికి వెన్నెల తోడైతే(2)
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓరబ్బీ సై సై సై ఓరబ్బీ సై

వాగుల గలగల ఉరుకి తీగలా మెలికెలు తిరిగి (2)
గుండెలో అల్లుకుపోతే గువ్వలా గుసగుసపెడితే (2)
ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓలమ్మీ సై సై సై ఓలమ్మీ సై

కన్నె మనసే నీదైతే కలికి వెన్నెల తోడైతే
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓరబ్బీ సై సై సై ఓరబ్బీ సై

వాలుగా చూపులు చూసి పూలపై బాసలు చేసి (2)
ముద్దుగా వుందామంటె ఇద్దరం ఒకటేనంటే (2)
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓరబ్బీ సై సై సై ఓరబ్బీ సై

లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మంటే (2)
ఓలమ్మీ సై ఓలమ్మీ సై
ఓరబ్బీ సై ఓరబ్బీ సై
ఓలమ్మీ సై సై సై

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
ఇలా ఉరకలు వేస్తావు నీలో ఉన్నది దాస్తావు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు నాలో ఉన్నది దోస్తావు

కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
నల్లని జడలో కరినాగుంది నడకలలో అది కనబడుతుంది

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు

కళ్ళు మూసి నిదురపోతే కలలు రాని వేళే లేదు
కలలో కొచ్చి కబురులు చెప్పే జతగాడైనా లేడు
జతగాడైనా లేడు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు

దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
మొగిలి రేకుల సొగసూ ఉంది మొన కన్నులలో పదునూ ఉంది

లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు

వెన్నెలొచ్చినా మంచు కురిసినా వేడి తగ్గటం లేనే లేదు
అద్దములోన అందం చూస్తే నిద్దర రానే రాదు నిద్దర రానే రాదు

ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
లేని దానిని చేస్తావు నాలో ఉన్నది దోస్తావు

లేదోయి లేదోయి వేరే హాయి

లేదోయి లేదోయి వేరే హాయి మరి రాదోయి రాదోయి తీయని రేయి(2)
కోరికల తేదుపైన స్వారీ చేద్దమా చెలీ స్వారీ చేద్దమా
చేయి చేయి కలుపుకొని తేలిపోదమా తేలిపోదమా
దూర దూర తీరాలకు సాగిపోదమా ఓ ఓ ఓ ఓ
దూర దూర తీరాలకు సాగిపోదమా
ముచ్చటగా అచ్చటనే ఆగిపోదమా (2)
ఆగిపోదమా
లేదోయి లేదోయి వేరే హాయి మరి రాదోయి రాదోయి తీయని రేయి

నీమనసు నా మనసు ఏకమైనవి చెలి ఏకమైనవి
ఆనందం అనురాగం సొంతమైనవి సొంతమైనవి
అంతులేని ఆశలివే చేరువైనవి
కామికమే జీవితమై కావ్యమైనది (2)
కావ్యమైనది

లేదోయి లేదోయి వేరే హాయి మరి రాదోయి రాదోయి తీయని రేయి

లటుకు చిటుకు లంకతోటలో

లటుకు చిటుకు లంకతోటలో అటుకు ఇటుకు కాని చోటులో (2)
నవనవలాడే నిను చూస్తుంటే నవనాడులకే ఉడుకు పుట్టదా
లటుకు చిటుకు లంకతోటలో అటుకు ఇటుకు కాని చోటులో (2)
గువ్వున రవ్వుతూ నువ్వొస్తుంటే గుండెల చప్పుడు పెరుగుతుందిరా

నా ఎద వయసు పదహారేళ్ళు నువు ఎదురయితే పందెపు కోళ్ళు (2)
దూకాయమ్మో దూకుడు చేసాయమ్మో
అరెరరె దూకాయెమ్మో దూకుడు చేసాయమ్మో
దూకుడుకే దురాశ పుడితే దురుసంతా బిరుసవుతుంటే (2)
బయమవుతది గుండె దడ పుడతది (2)

లటుకు చిటుకు లంకతోటలో అటుకు ఇటుకు కాని చోటులో
నవనవలాడే నిను చూస్తుంటే గుండెల చప్పుడు పెరుగుతుందిరా

నా మనసంతా మల్లెల మంచం నావయసంత వన్నెల గంధం (2)
చేసానురా నీకై దాచానురా హోయ్ హోయ్ హోయ్
చేసానురా నీకై దాచానురా
చిగురాకు పెదవుల మీద చిరునామా ముద్దర కోసం (2)
వేచానులే నిద్దర కాచానులే (2)

లటుకు చిటుకు లంకతోటలో అటుకు ఇటుకు కాని చోటులో (2)
గువ్వున రవ్వుతూ నువ్వోస్తుంటే నవనాడులకే ఉడుకు పుట్టదా

15 August 2008

లప్పంటప్పం చిన్నది పిప్పరమెంట్ పిల్లది

లప్పంటప్పం చిన్నది పిప్పరమెంట్ పిల్లది
లప్పంటప్పం చిన్నది పిప్పరమెంట్ పిల్లది
ఆవులేసి బొట్టుపడ్డ బొబ్బట్టల్లే వున్నది
ఓ దిబ్బట్టల్లే వున్నది
అల్లటప్ప పిల్లడు ఐతే గీతే అల్లుడు
అల్లటప్ప పిల్లడు ఐతే గీతే అల్లుడు
ఆడపిల్ల చెయ్యేస్తేనే బొబ్బలు పెట్టే అబ్బడు
మనదెబ్బకి తానై చెల్లడు
లప్పంటప్పం చిన్నది అల్లటప్ప పిల్లడు

ఆరుగురు ఆతకులు మురిపాల ముసురేసే
ఆ ముసురే తొలిసారి పలికింప చుగురేసే
ఆనాడే గుండెల్లో కముటేసుకున్నాది
ముంగింట్లో ముద్దుల్తో ముగ్గేసుకున్నాది
ఓలమ్మో సయ్యటాడే జలపాతాలా బుల్లోడే
పిడుగంటీ చినగాడే సందేల కలిసాడే
కౌగింతగా కధ చెప్పక నువ్వంతగా కను గీటకా

లప్పంటప్పం చిన్నది పిప్పరమెంట్ పిల్లది
అల్లటప్ప పిల్లడు ఐతే గీతే అల్లుడు
ఆవులేసి బొట్టుపడ్డ బొబ్బట్టల్లే వున్నది
ఓ దిబ్బట్టల్లే వున్నది
అల్లటప్ప పిల్లడు లప్పంటప్పం చిన్నది

ఆ పొగరు ఆ వగరు చూస్తేనే గుబులాయే
ఆగుబులే తడిలేని అరకాల కబురాయే
పుట్టిందే నాకోసం అన్నట్టు వుంటాడే
నునిపైన కురమీసం మెలిపెట్టుకుంటాడే
ఓలమ్మే మోమాటాల మోజే మొగ్గలేస్తుంటే
చిలకమ్మా అలిగింది పులకింతే అడిగిందీ
జాగేలలో ఒడి చేరగా జాబిల్లిలో గుడిసేయగా
ఓయ్ అల్లటప్ప పిల్లడు ఐతే గీతే అల్లుడు
అల్లటప్ప పిల్లడు ఐతే గీతే అల్లుడు
ఆడపిల్ల చెయ్యేస్తేనే బొబ్బలు పెట్టే అబ్బడు
మనదెబ్బకి తానై చెల్లడు
లప్పంటప్పం చిన్నది పిప్పరమెంట్ పిల్లది
లప్పంటప్పం చిన్నది పిప్పరమెంట్ పిల్లది
ఆవులేసి బొట్టుపడ్డ బొబ్బట్టల్లే వున్నది
బలె దిబ్బట్టల్లే వున్నది

లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను

లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను (2)
మధుర భారతి పదసన్నిధిలో (2)
ఒదిగే తొలి పువ్వును నేను
లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను

కృతిని అమ్మని పోతన్నకు (2)
మెతుకే కరువై పోలెదా
బ్రతికి వుండగా త్యాగయ్యకు
బ్రతుకే బరువై పోలెదా
విరిసిన కుసుమం వాడిపోతే కరుణ చూపేదెవరు (2)
పాడేకోకిల మూగపోతే పలకరించేదెవరు (2)
కడుపునింపని కళలెందుకు (2)
తనకు మాలిన ధర్మమెందుకు
లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను
మధుర భారతి పదసన్నిధిలో (2)
ఒదిగే తొలి పువ్వును నేను (2)
లలితకళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను

లక్ష్మీనాథా శ్రీజగన్నాథా నీదయ ఈమెకు కావాలి

లక్ష్మీనాథా హే జగన్నాథా నీదయ ఈమెకు కావాలి
వెలవెలపోయిన పడతికీ యవ్వన ప్రాయం మరలా రావాలి
లక్ష్మీనాథా శ్రీజగన్నాథా నీదయ ఈమెకు కావాలి
వెలవెలపోయిన పడతికీ యవ్వన ప్రాయం మరలా రావాలి
దయ కావాలి వరమివ్వాలి తనకివ్వాలి నా సౌందర్యం

పాంచాలి కాసి నాడు ఆదుకున్నా క్రిష్ణా(2)
ఈ వృద్ద రూపమునే పొందాలి దేవా (2)
అఖిల జగాన్ని నీ అడుగులతో కొలిచిన దేవుడివి
నిన్నే పిలిచిన ఆ జగన్నాధుని బ్రోచిన ఏలికవి
పాడే పూలతకు వానై రావాలి
వేడే మగువకునీ ప్రేమే కావాలి
లక్ష్మీనాథా శ్రీజగన్నాథా నీదయ ఈమెకు కావాలి
వెలవెలపోయిన పడతికీ యవ్వన ప్రాయం మరలా రావాలి

నీకాలి ధూళిశోకి ఆనాడు రాయి మగువాయి కాదా దేవా నీకేది సాటి
రాతిని పడతిగ మార్చిన మహికర మూర్తివి నీవేలే
తన మాంగళ్యాన్ని పొందేలాగ చేయుడు శ్రీనాధా
జనకుని ఆనతిని తలదాల్చిన వాడా
ఈ నా మొరలన్నీ పాలించగలేవా

దీనులను కాచి మహా క్రూరులని కూల్చి (2)
నరసింహమూర్తి అను అవతారం దాల్చి (2)
లీలగా భూమిని కొమ్ములనెత్తిన వరాహమూర్తి
ఈలేత సుమాన్ని వనితామహిని నువ్వే కాచాలి
చల్లని ఓ దేవా శోకం తీర్చాలి
న్యాయం కావాలి శాపం తీర్చాలి
లక్ష్మీనాథా శ్రీజగన్నాథా నీదయ ఈమెకు కావాలి
వెలవెలపోయిన పడతికీ యవ్వన ప్రాయం మరలా రావాలి

లాలి తనయా లాలి.. లాలి తానయా మా కన్నయ్య..

లాలి తనయా లాలి
లాలి తానయా మా కన్నయ్య
బొజ్జనిండా పాలారగించితివి (2)
బజ్జోవయ్యా బుజ్జి నాయనా
లాలి తనయా లాలీ
లాలి తనయా మా కన్నయ్య

పున్నమే నినుకని మురిసేనయ్యా
జాబిలికన్నా చక్కని తండ్రి
జగమే నినుకని మురిసేనయ్యా
భువిలో ఎవరూ చేయని పుణ్యము
నోచినానురా నోముల పంటా
లాలి తనయా లాలీ
లాలి తానయా మా కన్నయ్య

పాలూ వెన్న కావలెనంటే పరులపంచకు పోనేల(2)
ఇరుగు పొరుగు ఏమనుకొందురు
ఆకతాయివై అల్లరి చేయకు(2)
లాలి తనయా లాలీ
లాలి తానయా మా కన్నయ్య

ఆటలనాడి అలసితివేమో (2)
హాయిగా నీవు నిదిరించుమురా
దొంగ నిదురలో దూబూచులేల
బంగరుకొండ పవ్వలించరా(2)
లాలి తనయా లాలీ
లాలి తానయా మా కన్నయ్య
జోజోజోజో

లాలి నా పాలవెల్లి నీకేలే నీవేలే

లాలి నా పాలవెల్లి నీకేలే నీవేలే (2)
పాట ఈ పాట నీవే నా జాబిలి లాలి జోజో
కదిలే బృందావని లాలి జోజో
లాలి నా పాలవెల్లి నీకేలే నీవేలే
పాట ఈ పాట

సందెవేల వెన్నెల మధుర స్వరం చిందెనా
సందె పసిడి వేలలా నీ నవ్వులే తేలనా
చిందే నీలో నాలో ఎన్నో కథలు అల్లనీ
పాడే వెలితి మనసుల్లోన బంగారాలే పూయనీ
రాజా నీకై సాగేనులే ఎదలో పాట

లాలి నా పాలవెల్లి నీకేలే నీవేలే

మనసులోని ఆశలే పగిలి పాట పాడనే (2)
మనిషి తూవు లారిపోతే మమత వీడి పోవునా
ఐన వారు దూరమైతే బంధం విడిచిపోవునా
రాజా నీకై సాగేనులే మురుసే పాట

లాలి నా పాలవెల్లి నీకేలే నీవేలే
పాట ఈ పాట నీవే నా జాబిలి లాలి జోజో
కదిలే బృందావని లాలి జోజో
లాలి నా పాలవెల్లి నీకేలే నీవేలే
పాట ఈ పాట

14 August 2008

లాలిజో లాలిజో లాలీ లాలీ

లాలిజో లాలిజో లాలీ లాలీ(2)
నీకెందుకు నీకెందుకు మురిపాలు కురిపించు చిరునవ్వులు
చిరునవ్వులు సిరిమల్లెలు వెతలందు విలపించు మనకెందుకు
కనరాని నీ తండ్రి కనిపించునా (2)
ఎపుడైనా నా సామి నను చేరునా
నను చేరునా

లాలిజో లాలిజో లాలి లాలి (2)

నాకళ్ళలో ఏమున్నదో మమకారమొలికించు మధువున్నదో
ఏమున్నదో ఏమున్నదో ఇకమీద మనకేది రానున్నదో
పరమాత్మ నడగాలి శరణాగతి (2)
ఈడినా నేడైనా అతడేగతి

లాలిజో లాలిజో లాలి లాలి (2)

13 August 2008

లాలీజో లాలీజో లాలీజో కళ్ళె తెరవరా సామీ

లాలీజో లాలీజో లాలీజో
కళ్ళె తెరవరా సామీ నన్నె పిలవరా సామీ (2)
నే తాలలేలను సామీ వచ్చాను నిన్నే నమ్మీ
కళ్ళే తెరవరా సామీ నన్నె పిలవరా సామీ (2)

భామనీ ఏలరా రాధనై ఏలరా భానునీ వానగా మనసునే ఏలరా (2)
ఆడది కోరింది అందమే పిలిచింది అంధుకో వంటునాడు రావయ్యో
అలజడి పడలేదె కష్టాలిడలేదే
మోజుతీర్చే దొరవా రావయ్యా
పీడించకే నన్ను పాపుం పొందేవు నా ఘోర సాపం (2)
ఇక చెల్లదే నీ ఆట ఇక నేల నీకీ పాట
పీడించకే నన్ను పాపుం పొందేవు నా ఘోర సాపం

వెచ్చని ముచ్చట్లు పుచ్చుకో అందిస్తా మొజులే పలికిస్తా వూయలే వూగొస్తా (2)
మనకు మనకు పొత్తే కుదరదు నాతోను మాటంటే మాటే
మనసిక మారదురా హే హే బ్రతుకిక లేదోరా
మారిపో నువ్వు నాతో ఏమన్నా
కళ్ళు తెరవరా సామీ నన్నె పిలవరా సామీ
పీడించకే నన్ను పాపుం పొందేవు నా ఘోర సాపం
హే నే తాలలేలను సామీ వచ్చాను నిన్నే నమ్మీ
కళ్ళే తెరవరా సామీ నన్నె పిలవరా సామీ (2)

12 August 2008

లాహిరి మోహనా లలనా శృంగార పారీణా

లాహిరి మోహనా లలనా శృంగార పారీణా (2)
త్రిభువనా భరణ రసగుణా రమణ సమస్త కుసుమ నవ పారిజాత రహిత
లాహిరి మోహనా లలనా శృంగార పారీణా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మెరిసే అందాల రంగుల విల్లు గగనములో నీవు సారించగా(2)
భూసతి నువ్వు కుల కల నవ్వు (2)
విల్లై సిరులై వెలిగే నీ రజసం
లాహిరి మోహనా లలనా శృంగార పారీణా

వయసు ఏనాడు వాలని రాజా వలపులమేమేల చూపాలిరా (2)
మన్మధబాణం మధువల గానం (2)
మరలా మనసూ మురుసే నీకొసమే
లాహిరి మోహనా లలనా శృంగార పారీణా
త్రిభువనా భరణ రసగుణా రమణ సమస్త కుసుమ నవ పారిజాత రహిత
లాహిరి మోహనా లలనా శృంగార పారీణా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

లల్లిలలా లల్లిలలా ఆ ఆ

లల్లిలలా లల్లిలలా ఆ ఆ
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల(2)
అల్లిబిల్లి ఆటలే లల్లిలలా పాటలే(2)
ఎవరెవరే కోయిలలు కుహూ కుహూ కుహూ కుహూ
ఎవరెవరె నెమలి ఆ ఆ కికి కికి కికి కికి
ఎవరెవరె ఎవరెవరె మల్లి లేడి పిల్లలు (2)

లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల(2)

కు కు కు

అల్లీబిల్లీ అమ్మాయికి చల చల్లని జోస్యం చెపుతాము తన చక్కని జోస్యం చెపుతాము (2)

యవ్వన శోభల పర్వమే ఇది బావన తలచుకు గర్వమే (2)
ఆ బావే తనకిక సర్వమే
అల్లీబిల్లీ అమ్మాయికి చల చల్లని జోస్యం చెపుతాము తన చక్కని జోస్యం చెపుతాము

వున్నమాటకి వులికెందుకు మరి వున్నదె చెపుతాము (2)
వలదన్నా చెపుతాము
నూతన విద్యల ప్రవీణుడే బలె ప్రతిభావంతుడె మీ బావ (2)
అతి చతుర వీరుడే మీ బావ
అల్లీబిల్లీ అమ్మాయికి చల చల్లని జోస్యం చెపుతాము తన చక్కని జోస్యం చెపుతాము

మల్లీ జాజి మలతి సంపెంగ పూల బానములు వేసెను (2)
బాలామనితో మురిసేను మన బాలామనితో మురిసేను
తన పెళ్ళికి బావను పిలిచేను
అల్లీబిల్లీ అమ్మాయికి చల చల్లని జోస్యం చెపుతాము తన చక్కని జోస్యం చెపుతాము

11 August 2008

లాలూ దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ

లాలూ దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజ
ఇటలీ ఇంగ్లాండ్ ఐనా మన హిందు దేశమైనా ఈప్రేమ జాడలొకటే వూరు వాడ లేవైనా
గోవిందా గోవిందా ఏమైనా బాగుందా ప్రేమిస్తే పెద్దోల్లంతా తప్పులెంచుతారా
గోపాలా గోపాలా ఏందయ్యో ఈ గోలా ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా
ఐతే ఇప్పుడు ఎంటి అంటార్రా
Love makes life beautiful
Love makes life beautiful

లాలూ దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజ

అన్ననాడు అడిగామా పెంచడానికడిగామా
గోరుముద్దలు పాల బువ్వలు అడిగి పెట్టినామా
మేము కాదు అన్నామా వేలు ఎత్తి చూపుతామా
కమ్మనైనని కన్న ప్రేమలో వంకలెదుకుతామా
అంత గౌరవం మాపై వుంటే ఎందుకింత డ్రామా
ప్రేమ మత్తులో కన్న బిడ్డకే మేము గుర్తురామా
పాతికేళ్ళిలా పెంచారంటూ తాళి కట్టి పోమా
వందయేళ్ళ మా జీవితాలకే శిక్ష వేసుకోమా

అందుకే Love makes life beautiful
Love makes life beautiful
హేయ్ లాలూ దర్వాజ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజ

వూం ఆ ఆ ఆ
వేణుగానలోలా వేగమున రారా
నిలిచెను ఈ రాధ నీకొసమే
వెన్న దొంగ రారా ఆలసించవేరా
పలికెను నోరారా నీ నమమే
పొన్న చెట్టు నీదలోన కన్నె రాధ వేచి వుంది
కన్నె రాధ గుండె లోన చిన్న ఆశదాగి వుంది
చిన్న ఆశదాగి వుంది

అరె అరె ప్రేమ ప్రేమ అంటారు ప్రేమ కోటి రాస్తారు
ఈడు వేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు
లొల్లి లొల్లి చేస్తారు లౌడ్ స్పీకరేస్తారు
ప్రేమ జంటని పెద్ద మనసుతో మీరు మెచ్చుకోరు
ఎంత చెప్పినా మొండి వైకరి అసలు మార్చుకోరు
ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తేల్చుకోండి మీరు
కన్న ప్రేమని కన్నె ప్రేమని పోల్చి చూడలేము
రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తేల్చి చెప్పలేము

Love makes life beautiful
Love makes life beautiful

10 August 2008

లేదుసుమా లేదుసుమా అపజయమన్నది లేదుసుమా

లేదుసుమా లేదుసుమా
అపజయమన్నది లేదుసుమా
లేదుసుమా లేదుసుమా
అపజయమనేది లేదుసుమా

తోడు నీడ లేదని నీవు మానవ యత్నం మానకుమా
అపజయమన్నది లేదుసుమా
లేదుసుమా లేదుసుమా

పాటే ఎక్కువ మానధనులకు (2)
పాటు పడినచో లోటే రాదు (2)
రెక్కలపైనే బ్రతికే వారు
ఎక్కడనున్నా ఒకటె సుమా(2)
అపజయమన్నది లేదుసుమా
లేదుసుమా లేదుసుమా
అపజయమనేది లేదుసుమా

నేడు నాటిన చిన్న మొలకలే
నీడనొసంగును ఒక నాడు
నేడు నాటిన చిన్న మొలకలే
నీడనొసంగును ఒక నాడు
నవ్విన వూర్లే పట్నాలవురా(2)
సస్యే ఫలే అని మరచిపోకురా
సస్యే ఫలే మరచిపోకురా
లేదుసుమా లేదుసుమా
అపజయమన్నది లేదుసుమా

తోడు నీడ లేదని నీవు మానవ యత్నం మానకుమా
అపజయమన్నది లేదుసుమా(2)

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్నిప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా మరీ వేణు గానం
కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా
పగటి బాధలన్ని మరిచి పోవుటకు ఉంది కదా ఈ ఏకాంత వేళ

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్నిప్రాణం

సమగప పమపమా దనిదారిసని సమగప పమపమా సమగప పమపమా దనిదారిసని సమగప సగమా


ఎటో పోయేటి నీలి మేఘం
వర్షం చిలికి వెళ్ళదా
సరిగమమ మపగగ
యేదో అంటుంది కోయెల పాట
రాగం ఆలకించగా
సరిగమమ మపగగ
అన్ని వైపులా మధువనం
పూలు పూయదా అనుక్షణం
అణువణువునా జీవితం
అంద జేయదా అమృతం

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్న పోదా మరీ చిన్నిప్రాణం
కాసే వేన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా మరీ వేణు గానం

09 August 2008

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

ఆపదేం రాదే నీదాకా నేనున్నాగా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపలా నిదరో చాలింకా వేకువ దాకా
దీపమై చూస్తూ ఉంటాగా

కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

ఊరికే ఉసూరుమంటావే ఊహకే ఉలిక్కిపడతావే
చక్కగా సలహాలిస్తావే తిక్కగా తికమక పెడతావే

రెప్పలు మూసుంటే తప్పక చూపిస్తా
రేయంతా వెలిగించీ రంగుల లోకాన్ని

కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

ఎదురుగా పులి కనబడుతుంటే కుదురుగా నిలబడమంటావే
బెదురుగా బరువెక్కిందంటే మది ఇలా భ్రమపడుతుందంటే

గుప్పెడు గుండెల్లో నేనే నిండుంటే
కాలైనా పెట్టవుగా సందేహాలేవీ

ఆపదేం రాదే నీదాకా నేనున్నాగా
కాపలా కాస్తూ ఉంటాగా
పాపలా నిదరో చాలింకా వేకువ దాకా
దీపమై చూస్తూ ఉంటాగా

కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ
వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా
జోలలో జారిపో మేలుకో లేనంతగా

28 May 2008

తుషార శీతల సరోవరాన
అనంత నీరవ నిశీధి లోన
ఈ కలువ నిరీక్షణ
నీ కొరకే రాజా!వెన్నెల రాజా!

కలనైన నీ వలపే!
కలవరమందైన నీ తలపే!

కలువ మిటారపు కమ్మని కలలు
కళలు కాంతులు నీ కొరకేలే
చెలి ఆరాధన శోధన నీవే
జిలిబిలి రాజా జాలి తలచరా!..

కనుల మనోహర మాధురి గాంచి
కానుక చేసే వేళకు సాచి
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి నిలచెద....
ఏమని పాడేదనో ఈ వేళ
మానసవీణ మౌనముగా
నిదురించిన వేళ ..

వనసీమలలోహాయిగా ఆడే
రాచిలుక నిను రాణిని చేసే
పసిడి తీగెల పంజరమిదుగో
పలుకవేమని పిలిచేవేళ

జగమే మరచి హృదయ విపంచి
గారడిగా వినువీధి చరించి
కలతనిదురలో కాంచిన కలలే
గాలిమేడలై కూలినవేళ..

24 May 2008

మౌనమే నీ భాష ఒ మూగ మనసా

మౌనమే నీ భాష ఒ మూగ మనసా !
తలపులు ఎన్నెన్నోకలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నేరౌతావు
౧.చీకటి గుహ నీవు
చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో
ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో
ఏమై మిగిలేవో ...
౨.కోర్కెల సెల నీవు
కూరిమి వల నీవు
ఉహాల ఉయ్యాలవే మనసా
మాయల దయ్యనివే
లేనిది కోరేవు
ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు వగచేవు....

22 May 2008

గాలికి కులమేది?
నేలకు కులమేది?
నింగికి మరుగేది?ఏది?
కాంతికి నేలవేది?
౧ పాలకు ఒకటే..తెలివర్ణం
ఏది..ప్రతిభకు కలదా కలబెధం
వీరులకేందుకు కులబేదం.
అది మనసుల చీల్చెడు మతబెధం...
౨జగమున యసమే మిగులునులే
అది యుగములకైన చెదరదులే
దైవం నీలో నిలుచునులే
దర్మం నీతో నడచునులే ..

17 May 2008

మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం

మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం

చరణాలు ఎన్నివున్నా పల్లవొకటే కదా
కిరణాలు ఎన్ని వున్నా వెలుగొక్కటేకదా
శతకోటి భావాలన్ని పలుకు ఎద మారునా
సరిగమలు మారుతున్న మధురిమలు మారునా

మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం

వేవేల తారలున్నా నింగి ఒకటే కదా
ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా
ఎన్నెని రాగలకు నాదమొకటే కదా
అనుభూతులెన్ని వున్నా హృదయమొకటే కదా

మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం
మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం
మదిలో మొహన గీతం మెదిలే తొలి సంగీతం

14 May 2008

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

నవ్వులా అవి కావు
నవ్వులా అవి కావు నవ పారిజాతాలు
నవ్వులా అవి కావు నవ పారిజాతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
అపరంజి కలలన్ని చిగురించునా

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
పాటలాధర రాగ భావనలు కన్నాను
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
పాటలాధర రాగ భావనలు కన్నాను
ఎల నాగ నయనాల కమలాలలో దాగి
ఎల నాగ నయనాల కమలాలలో దాగి
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
ఆ పాట నాలో తీయగ మ్రోగనీ
ఆ పాట నాలో తీయగ మ్రోగనీ
అనురాగ మధుధారయై సాగనీ
ఉహు ఉహు ఉహు ఉహు ఉహు

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు

ఔనే చెలియ సరి సరి

ఔనే చెలియ సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా సొగసరి
ఔనే చెలియ సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా సొగసరి
ఔనే చెలియ సరి సరి

ఆమ్మచెల్ల తెలిసేది ఎన్నెలాడి వగలు
ఎన్నదిలో దాచాలని కమ్మని కోరికలు
వాలుకన్ను రెప్పలలో వాలాడే తొందరలో
వాలుకన్ను రెప్పలలో వాలాడే తొందరలో
దోరపెదవి అంచుల చిరునవ్వుల దోబూచులు
ఔనే చెలియ సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా సొగసరి
ఔనే చెలియ సరి సరి

పవళింపుల గదిలో ప్రణయరాజ్యమేలాలని
పవళింపుల గదిలో ప్రణయరాజ్యమేలాలని
నవమల్లెల పానుపుపై నవమదనుడు త్వరపడునే
నవమల్లెల పానుపుపై నవమదనుడు త్వరపడునే
చెరిపడనీవే సుంత ఉహు చీరచెరకు గుసగుసలు
ఓ చెరిపడనీవే సుంత చీరచెరకు గుసగుసలు
రవళ అందె మువలూదే రాగరహస్యాలు

ఔనే చెలియ సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా సొగసరి
ఔనే చెలియ సరి సరి

ఏ చోట దాచేవే ఈవరకి సిగ్గులు
ఈ చెక్కిటిపై ఈ గులాబి నిగ్గులు
ఏ చోట దాచేవే ఈవరకి సిగ్గులు
ఈ చెక్కిటిపై ఈ గులాబి నిగ్గులు
మాపటి బిడియాలన్ని రేపటికి వుండవులే
మాపటి బిడియాలన్ని రేపటికి వుండవులే
నేటి సోయగాలు మరునాటికి ఒడిలేనులే

ఔనే చెలియ సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా సొగసరి
ఔనే చెలియ సరి సరి

ఎంత దూరమో అది ఎంత దూరమో

ఎంత దూరమో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో
పరిమలించు పానుపులకు నిరీక్షిణ్చు చూపులకు
వేసిన తలుపులకు వేచిన తలపులకు
ఎంత చేరువో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో

ఉదయనించే కిరణాలకు ఉప్పొంగే కెరటాలకు
కలలుగనే చెలునికి కలతపడే చెలియకు
ఎంత చేరువో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో

మనసు పడని సంపంగికి మరులు విడని భ్రమరానికి
మనసు పడని సంపంగికి మరులు విడని భ్రమరానికి
ఉన్నదానికి అనుకున్నదానికి
ఎంత చేరువో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో

అల్లనాటి ఆశలకు అణగారిన బాసలకు
అల్లనాటి ఆశలకు అణగారిన బాసలకు
మరువరాని అందానికి చెరిగిపోని బంధానికి
ఎంత చేరువో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో

ఒక దీపం వెలిగింది ఒక రూపం వెలసింది

ఒక దీపం వెలిగింది ఒక రూపం వెలసింది
ఒక దీపం అలిగింది ఒక రూపం తొలగింది
ఒక దీపం అలిగింది ఒక రూపం తొలగింది
వేకువ ఇక లేదని తెలిసి చీకటితో చేతులు కలిపి
వేకువ ఇక లేదని తెలిసి చీకటితో చేతులు కలిపి
ఒక దీపం అలిగింది ఒక రూపం తొలగింది

మంచు తెరలే కరిగిపోగా మనసు పొరలే విరిసిరాగా
మంచు తెరలే కరిగిపోగా మనసు పొరలే విరిసిరాగా
చెలిమి పిలుపే చేరుకోగ చెలియ వలపే నాదికాగా
అనురాగపు మాలికలల్లి అణువణువున మధువులు చల్లి
అనురాగపు మాలికలల్లి అణువణువున మధువులు చల్లి
ఒక ఉదయం పిలిచింది ఒక హృదయం ఎగిసింది

నింగి అంచులు అందలేక నేలపైన నిలువరాక
నింగి అంచులు అందలేక నేలపైన నిలువరాక
కన్నె కలలే వెతలుకాగా ఉన్న రెక్కలు చితికిపోగా
కనిపించని కన్నీట తడిసి బడబానల మెడలో ముడిచి
కనిపించని కన్నీట తడిసి బడబానల మెడలో ముడిచి
ఒక ఉదయం ఆగింది ఒక హృదయం ఆరింది
ఒక ఉదయం ఆగింది ఒక హృదయం ఆరింది
ఒక దీపం వెలిగింది

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాట లాగ సాగాలి
ప్రతి నిముషం ప్రియా ప్రియా పాట లాగ సాగాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి

నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
మనకోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి

ఒరిగింది చంద్రవంక వయ్యారి తార వంక
ఒరిగింది చంద్రవంక వయ్యారి తార వంక
విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత
విరజాజి తీగ సుంత జరిగింది మావి చెంత
నను జూచి నిను జూచి వనమంతా వలచింది
నను జూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాట లాగ సాగాలి, పాట లాగ సాగాలి

ఈనాటి ఈ బంధమేనాటిదో

ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో ఓ
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో ఓ
ఈనాటి ఈ బంధమేనాటిదో

మబ్బులు కమ్మిన ఆకాశం మనువులు కలసిన మనకోసం
మబ్బులు కమ్మిన ఆకాశం మనువులు కలసిన మనకోసం
కలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది
కలువల పందిరి వేసింది తొలి వలపుల చినుకులు చిలికింది

ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో ఓ
ఈనాటి ఈ బంధమేనాటిదో

నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం
నీ జతలో చల్లదనం నీ ఒడిలో వెచ్చదనం
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
నీ చేతలలో చిలిపితనం చిత్తంలో వలపుధనం
అనుభవించి దినం దినం పరవశించనా
పరవశించి క్షణంక్షణం కలవరించనా

ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో ఓ
ఈనాటి ఈ బంధమేనాటిదో

ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో
ఎవరు పిలిచారనో ఏమి చూడాలనో
ఉప్పొంగి ఉరికింది గోదావరీ గోదావరి
చెలికాని సరసలో సరికొత్త వధువులో
చెలికాని సరసలో సరికొత్త వధువులో
తొలినాటి భావాలు తెలుసుకోవాలని ఉప్పొంగి ఉరికింది గోదావరీ

ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడి వేసెనో ఓ
ఈనాటి ఈ బంధమేనాటిదో

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

హెయ్ గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

సెప్పాలంటే సిగ్గు కదయ్యా
ఆనవాళ్ళు నే సెబుతానయ్య
సెప్పు సెప్పు
సిగలో నెలవంక మెడలో నాగరాజు
సిగలో నెలవంక మెడలో నాగరాజు
ఆ రేడు నావాడు సరిరారు వేరెవరు

మావయ్యా నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా
మావయ్యా నా మొగుడెవరయ్యా

ఇల్లు వాకిలి లేనీవాడులే నీ వాడు లేనీవాడు
బిచ్చమెత్తుకొని తిరిగేవాడు మాతా కాళం
ఇల్లు వాకిలి లేనీవాడులే నీ వాడు లేనీవాడు
ఎగుడు దిగుడు కన్నులవాడు జంగందేవర నీ వాడా

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

ఆకశమే ఇల్లు లోకమే వాకిలి అవును
బిచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి
బిచ్చమడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తి
బేసికన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు

మావయ్యో నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా
మావయ్యా నా మొగుడెవరయ్యా

మొగుడు మొగుడని మురిసావే కులికావే పొగిడావే
మొగుడు మొగుడని మురిసావే కులికావే పొగిడావే
పిల్లోయ్ నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానినే కొలుసునట
అదియే ఆతని ఆలియట కోతలు ఎందుకు కోస్తావే
కోతలు ఎందుకు కోస్తావే

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
ఎవరమ్మా వాడెవరమ్మా
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా

ఎవరో పిలిస్తె వచ్చింది ఎవరికోసమో పొతొంది
మయాన మజిలీ ఏసింది మయాన మజిలీ ఏసింది
సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే
సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే
పళ్ళు పదారు రాలునులే
పళ్ళు పదారు రాలునులే

మావయ్యో నా మొగుడెవరయ్యా
ఎవరయ్యా వేరెవరయ్యా
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా
మావయ్యా గౌరమ్మా
మావయ్యా గౌరమ్మా

నా పాట నీ నోట పలకాల సిలక

నా పాట నీ నోట పలకాల సిలక
నా పాట నీ నోట పలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక
నా పాట నీ నోట పలకాల చిలక
పలకాల సిలక
పలకాల చిలక
యహ చి కాదు
సి సి సిలక
పలకాల సిలక

నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక
నీ బుగ్గలూ సిగ్గులొలకాల సిలక

పాట నువ్వు పాడాల పడవ నే నడపాల
పాట నువ్వు పాడాల పడవ నే నడపాల
నీటిలో నేను నీ నీడనే సూడాల
నీటిలో నేను నీ నీడనే సూడాల
నా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాల
నా నీడ సూసి నువ్వు కిల కిలా నవ్వాల
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల
పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల

నా పాట నీ నోట పలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక

కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల
కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల
ఎన్నెలకే మనమంటె కన్నుకుట్టాల
ఎన్నెలకే మనమంటె కన్నుకుట్టాల
నీ పైట నా పడవ తెరసాప కావాల ఆ ఆ ఆ ఆ అ ఓ ఓ ఓ
నీ పైట నా పడవ తెరసాప కావాల
నీ సూపే సుక్కానిగ దారి సూపాల
నీ సూపే సుక్కానిగ దారి సూపాల

నా పాట నీ నోట పలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక

మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు
మనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళు
మనసున్న మనుసులే మనకు దేవుళ్ళు
మనసు కలిసిననాడె మనకు తిరణాళ్ళు
సూరెచంద్రుల తోటి సుక్కల్ల తోటి
సూరెచంద్రుల తోటి సుక్కల్ల తోటి
ఆటాడుకుందాము ఆడనే ఉందాము
ఆటాడుకుందాము ఆడనే ఉందాము

నా పాట నీ నోట పలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలక

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే

పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా
నవ్వినా ఎడ్చినా
నవ్వినా ఎడ్చిన కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఎముందో తెలుసునా

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే

మనసు మూగదే కాని బాసుండది దానికి
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది
మనసు మూగదే కాని బాసుండది దానికి
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది
ఎద మీద ఎదబెట్టి సొదలన్నీ ఇనుకో
ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే

ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు ఆ ఆ ఆ అ
ముక్కోటి దేవుళ్ళు మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
మూగమనసు బాసలు ఈ మూగమనసు బాసలు
మీకిద్దరికి సేసలు

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే
ముద్దబంతి పువ్వులో ఓ ఓ ఓ

గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది

ఓహూ ఓ ఓ హోయ్
ఓహొహూ ఓ ఓ ఓ

గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్
గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది ,పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్

వగరు వగరుగ పొగరుంది, పొగరుకు తగ్గ బిగువుంది
వగరు వగరుగ పొగరుంది,పొగరుకు తగ్గ బిగువుంది
తీయ తీయగ సొగసుంది,సొగసుని మించె మంచుంది
తీయ తీయగ సొగసుంది,సొగసుని మించె మంచుంది ఈ ఈ
గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్

ఎన్నెల వుంది, ఎండ వుంది,పూవు వుంది, ముల్లుంది
ఎన్నెల వుంది, ఎండ వుంది,పూవు వుంది, ముల్లుంది
ఏది ఎవ్వరికి ఇవ్వాలో ,ఇడమరిసే ఆ ఇది వుంది
గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్

పిట్ట మనసు పిసరంతైనా,పెపంచమంతా దాగుంది
పిట్ట మనసు పిసరంతైనా,పెపంచమంతా దాగుంది
అంతు దొరకని నిండు గుండెలో ,ఎంత తోడితే అంతుంది
అంతు దొరకని నిండు గుండెలో ,ఎంత తోడితే అంతుంది ఈ ఈ ఈ

గోదారి గట్టుంది ,గట్టుమీన సెట్టుంది
సెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్

ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం

ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం ఉహు ఉహు ఉహు
ఆ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

అడపదడప ఇద్దరు అలిగితనే అందం
అడపదడప ఇద్దరు అలిగితనే అందం
అలక తీరి కలిసేదే అందమైన బంధం
అలక తీరి కలిసేదే అందమైన బంధం
ఆ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

చిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం
చిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం
బుగ్గమీద సిటికేటి దగ్గరొస్తే బంధం
ఆ బుగ్గమీద సిటికేటి దగ్గరొస్తే బంధం
హొయ్ ఆ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళే బంధం
ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళే బంధం
ఉహు ఉహు ఉహు
ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

తల్లి గోదారికి ఎల్లువొస్తే అందం
తల్లి గోదారికి ఎల్లువొస్తే అందం
ఎల్లువంటి బుల్లోడికి పిల్లగౌరి బంధం
ఎల్లువంటి బుల్లోడికి పిల్లగౌరి బంధం
డుర్ర్ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం
హొయ్ ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం

12 May 2008

జయకృష్ణా ముకుందామురారి జయగోవింద బృందా విహరీ

హే.....కృష్ణా.... ముకుందా....మురారీ....
జయకృష్ణా ముకుందామురారి
జయగోవింద బృందా విహరీ

జయ..

దేవకిపంట వసుదేవునిఇంటా
యముననునడిరేయి దాటితివంటా
వెలసితివంటా నందుని ఇంటా
వ్రేపల్లె ఇల్లాయేనంటా...ఆ..

జయ..

నీ పలుగాకి పనులకు గోపెమ్మ
కోపించి నినురోటబంధించెనంటా
ఊపునబోయీ మ్రాకులకూలిచి
శాపాలు బాపితివంటా....ఆ..

జయ..

అమ్మా తమ్ముడు మన్నుతినేనూ
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నాయనిచెవినులిమి యశోద
యేదన్నా నీ నోరుచూపమనగా...ఆ...
చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గు భువనభాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు
తాపము నశియించి జన్మ ధన్యత గాంచేన్

జయ..

కాళీయ ఫణిపణ జాలాన ఝణఝణ
కేళీగటించిన గోపకిషోరా
కంసాదిదానన గర్వాపహరా
హింసావిదూరా పాపవిహారా

జయ..


కస్తూరి తిలకం లలాట పలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరేకంకణం
సర్వాంగే హరిచందనంచ కలయన్
కంఠేచ ముక్తావళిం గోపశ్రీ పరివేష్టితో
విజయతే గోపాల చూడామణి
లలిత లలిత మురళీ స్వరాళీ
పిలకిత వనపాళి గోపాళీ
మురళికృత నవరానకేళి
వనమాలీ శిఖిపించ మౌళీ
కృష్ణా ముకుందా మురారీ

అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా

అమ్మా నాన్నా
అమ్మా
అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరురోజు ఈ జన్మకు లేదా
అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరురోజు ఈ జన్మకు లేదా
పదినెనలు నను మోసి పాలిచ్చి పెంచి
మదిరోయక నాకెన్నో వూడిగాలు చేసినా
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చెసితీ
కలతకమ్మ తనయునీ తప్పులు క్షమియించవమ్మ

అమ్మా అమ్మా

దేహము విజ్ఞానము బ్రహ్మొపదేశమిచ్చి
ఇహపరాలు సాధించే హితమిచ్చె తండ్రివి..
తనుగానని కామమున నినువెడల నడిచితీ.
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా

నాన్నా నాన్నా

పారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా
నీ మాట దాటనమ్మ
ఒకమారు కనరమ్మా
మాతా పితా పాదసేవే మధవ సేవని మరువనమ్మ
మాతా పితా పాదసేవే మధవ సేవయని మరువనమ్మ
నన్ను మన్నిచగ రారమ్మా అమ్మా అమ్మా

అమ్మా

అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరురోజు ఈ జన్మకు లేదా

అమ్మా

అమ్మా అని అరిచినా ఆలకించవేమమ్మా
అమ్మా ఆలకించవేమమ్మా..
అమ్మా

11 May 2008

తరం తరం నిరంతరం ఈ అందం

అహ్హహా అహ్హహా ఒహ్హొహొ హొ ఓ హొ హొ
తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం
తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం
ఆనందలీలే గోవింద రూపం ఈ మాట అంటే పెద్దలకు కోపం

తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం


మోజులే రేపు చిరునవ్వు చిందులు
జాజిచెక్కిళ్ళ సోయగాల విందులు

ఓ ఓ ఓ మోజులే రేపు చిరునవ్వు చిందులు
జాజిచెక్కిళ్ళ సోయగాల విందులు

వరద పొంగేనులే వయసు సింగారము
అనుభవించీ సుఖించీ తరించరా

హేయ్ తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం

మోహమూరించు పరువాల గోలకు
ముతక తెరచాటు అలవాటు లేలనే

మోహమూరించు పరువాల గోలకు
ముతక తెరచాటు అలవాటు లేలనే

నేడు వెనకాడినా రేపు ఒనగోడునా
అనుభవించీ సుఖించీ తరించరా

ఓయ్ తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం
ఆనందలీలే గోవింద రూపం ఈ మాట అంటే పెద్దలకు కోపం

తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం
అహ్హహా అహ్హహా ఒహ్హొహొ హొ ఓ హొ హొ

తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ అ
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి
యువకుల శాసించుటకే ఏ ఏ ఏ
యువకుల శాసించుటకే యువతులవతరించిరని
తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

సాధింపులు బెదరింపులు ముదితలకిక కూడవనీ ఆ ఆ ఆ
సాధింపులు బెదరింపులు ముదితలకిక కూడవనీ
హృదయమిచ్చి పుచ్చుకొనే
హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని

తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ ఆ ఆ ఆ
మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ
మగువలెపుడు మగవారిని
మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని

తెలుసుకొనవె యువతి అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం
సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

పైన పటారం లోన లొటారం
ఈ జగమంత డంబాచారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

నీతులు పలుకుతూ ధర్మవిచారం
గోతులు తీసే గూడాచారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

చందాలంటు భలే ప్రచారం
వందలు వేలు తమ పలహారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

గుళ్ళో హాజరు ప్రతి శనివారం
గూడుపుఠాణి ప్రతాదివారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

డాబులు కొడుతు లోక విహారం
జేబులు కొట్టే ఘన వ్యాపారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

టాకు టీకుల టక్కు టమారం
కలికాలం మన గ్రహచారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం
సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం
సీతారాం జయ సీతారాం రం సీతారాం జయ సీతారాం

రాగ సుధారసా పానము చేసి రాజిల్లవే ఓ మనసా

ఆ ఆ ఆ

రాగ సుధారసా పానము చేసి రాజిల్లవే ఓ మనసా
రాగ సుధారస
రాగ సుధారసా పానము చేసి రాజిల్లవే ఓ మనసా
రాగ సుధారస

యాగ యోగ త్యాగా భోగ ఫల మోసంగే
యాగ యోగ త్యాగా భోగ ఫల మోసంగే

రాగ సుధారసా పానము చేసి రాజిల్లవే ఓ మనసా
రాగ సుధారస

సదాశివ మయమగు నాదోంకర స్వర
సదాశివ మయమగు నాదోంకర స్వర
విధులు జీవన్మూక్తు లని త్యాగరాజు తెలియు
విధులు జీవన్మూక్తు లని త్యాగరాజు తెలియు

రాగ సుధారసా పానము చేసి రాజిల్లవే ఓ మనసా
రాగ సుధారస

శ్రీ జానకి దేవి శ్రీమంతామనరే

శ్రీ జానకి దేవి శ్రీమంతామనరే
మహలక్ష్మి సుందర వదనాము గనరే
శ్రీ జానకి దేవి శ్రీమంతామనరే

పన్నీరు గంధాలు సఖిపైన చిలికించి
కానుకలు కట్నాలు చదివించరమ్మ
పన్నీరు గంధాలు సఖిపైన చిలికించి
కానుకలు కట్నాలు చదివించరమ్మ
మల్లె మొల్లల తరులు సఖి జడలో సవరించి
ఎల్లా వేడుకలిపుడు చేయించరమ్మ

శ్రీ జానకి దేవి శ్రీమంతామనరే
మహలక్ష్మి సుందర వదనాము గనరే
శ్రీ జానకి దేవి శ్రీమంతామనరే

కులుకుచూ కూర్చున్న కలికిని తిలకించి
అలుక చందగనీక అలరించరమ్మ
కులుకుచూ కూర్చున్న కలికిని తిలకించి
అలుక చందగనీక అలరించరమ్మ
కులమెల్ల దీవించు కొమరుని గనుమంచు
ఎల్ల ముత్తైదువులు దీవించరమ్మ

శ్రీ జానకి దేవి శ్రీమంతామనరే
మహలక్ష్మి సుందార వదనాము గనరే
శ్రీ జానకి దేవి శ్రీమంతామనరే

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ

వినుటయె కాని వెన్నెల మహిమలు
వినుటయె కాని వెన్నెల మహిమలు
అనుభవించినే నెరుగనయా
అనుభవించినే నెరుగనయా
నీలో వెలసిన కళలు కాంతులు
నీలో వెలసిన కళలు కాంతులు
లీలగ ఇపుడె కనిపించెనయా

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ

కనుల కలికమిది నీ కిరణములే
కనుల కలికమిది నీ కిరణములే
మనసును వెన్నెగ చేసెనయా
మనసును వెన్నెగ చేసెనయా
చెలిమి కోరుతు ఏవో పిలుపులు
చెలిమి కోరుతు ఏవో పిలుపులు
నాలో నాకే వినిపించెనయా

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి
మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని
మగవారికి దూరముగ మగువలెపుడు మెలగాలని
తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ

మనకు మనమె వారికడకు పని ఉన్న పోరాదని ఆ ఆ ఆ
మనకు మనమె వారికడకు పని ఉన్న పోరాదని
అలుసు చేసి నలుగురిలో చులకనగ చూసెదరని
అలుసు చేసి నలుగురిలో చులకనగ చూసెదరని

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి

పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని ఆ ఆ ఆ
పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
లేని పోని అర్ధాలను మన వెనుకనె చాటెదరని
లేని పోని అర్ధాలను మన వెనుకనె చాటెదరని

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి

కరుణించు మేరిమాత శరణింక మేరిమాత

కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత
కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత

పరిశుద్దాత్మ మహిమ వర పుత్రుగంటివమ్మ ఆ ఆ
పరిశుద్దాత్మ మహిమ వర పుత్రుగంటివమ్మ
ప్రభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష ఆ ఆ

కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత

తుది లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకు
తుది లేని దారిచేరి పరిహాసమాయే బ్రతుకు
క్షణమైన శాంతిలేదే దినదినము శోధానాయే

కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత

ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో

ఆ ఆ ఆ
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో ఓ ఓ
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే

ఆ ఆ ఆ ఆ
తలుకు తలుకుమని తారలు మెరిసే
నీలాకశము నాదేలే
ఎల్లరి వనముల కలవర పరిచే
జిలిబిలి జాబిలి నాదేలే

కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే

ఆ ఆ ఆ ఆ
ప్రశాంత జగమును హుషారు చేసే
వసంత ఋతువు నాదేలే ఏ ఏ ఏ
పూవుల ఘుమ ఘుమ చల్లగ విసిరే ఏ
మలయమారుతము నాదేలే ఏ ఏ

కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే

10 May 2008

పెళ్ళి చూసుకొని ఇల్లుచూసుకొని

ఓ భావి భారత భాగ్యవిధాతలారా..
యువతీ యువకులారా..
స్వానుభవమున చాటు నా సందేసమిదే..
వారేవా
తద్దినా తకద్దిన్న తాంగిడకిత తడికిడతకతోం..

పెళ్ళి చూసుకొని ఇల్లుచూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ వుండాలోయ్

కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు సాస్తి కాగా
పట్నాల పల్లెల దేశ దేశాల
మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా

తద్దినా తకద్దిన్న తాంగిడకిత తడికిడతకతోం..

ఇంటా బయట జంట కవులవలె అంటుకు తిరగాలొయ్
టరాం పం
ఇంటా బయట జంట కవులవలె అంటుకు తిరగాలొయ్
కంటిపాపలై దంపతులెపుడు చంటిపాపలను సాకలొయ్
కంటిపాపలై దంపతులెపుడు చంటిపాపలను సాకలొయ్

పెళ్ళి చూసుకొని
పెళ్ళి చూసుకొని ఇల్లుచూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ వుండాలోయ్

నవభావముల నవరాగముల నవజీవనమే నడపాలోయ్..
నవభావముల నవరాగముల నవజీవనమే నడపాలోయ్..
భావకవులవలె ఎవరికి తెలియని ఎవో పాటలు పాడాలోయ్..
భావకవులవలె ఎవరికి తెలియని ఎవో పాటలు పాడాలోయ్..

పెళ్ళి చూసుకొని
పెళ్ళి చూసుకొని ఇల్లుచూసుకొని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ వుండాలోయ్

హాయిగా వుండాలోయ్