27 April 2009

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు

సిరులొలికించే చిన్నినవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు
జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ మంచి జాబిల్లీ జాబిల్లీ జాబిల్లీ

నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
లోలో ఆశలన్ని నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చలేని చందమామ నువ్వనీ
ఊరువాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలము కనుపాపల్లే కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ

వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్న ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైన

బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది

బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా
హిస్టొరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్టురా

బోటనీ క్లాసంటే బోరు బోరు హిస్టరీ రొష్టు కన్న రెస్టు మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు బ్రేకులూ డిస్కోలూ చూపుతారు
జగడ జగడ జగడ జగడజాం

దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వడీ వింత గరీబు
జోరుగా వచ్చాడే జేంస్ బాండు గీరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే జీడి బ్యాండు ఫోజులే చూస్తుంటే ఒళ్లు మండు
జగడ జగడ జగడ జగడజాం

అయ్యో మార్చినే తల్చుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా
ఎయ్ ఛీ తాళం రాదు మార్చిట మార్చి తాళంలో పాడరా వెధవా
మార్చినే తల్చుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఏంటిరో ఇంత గొడవ
ఎందుకీ హైరానా వెర్రి నాన్న వెళ్లరా సులువైన దారిలోన
ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన వాయిదా పద్ధతుంది దేనికైనా

మాగ్జిమం మార్కులిచ్చు మ్యాథ్సులో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్లు వంచరా ఒరేయ్ తందనా తందననా
క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పైపెట్టు కాస్త ఫస్టు ర్యాంకు పొందవచ్చురోయ్ తందనా తందననా

అరె ఏంటి సార్ లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్లు లక్కుతోని లచ్చలల్ల ముంగిపోతారు
పుస్కాల్తో కుస్తీలు పట్టేటోల్లు సర్కారి క్లర్కులై ముర్గిపోతరూ
జగడ జగడ జగడ జగడజాం

కింగ్ లా కనిపిస్తున్నాడు మరి వంగి వంగి

కింగ్ లా కనిపిస్తున్నాడు
మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు
ఏమా సరదా గమ్మత్తుగా లేదా ఏమా సరదా

రాజైనా రారాజైనా మనీ ఉన్న మన ముందు సలాం కొట్టవలసిందే
ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే
పైసా ఉంటే పరిగెత్తుకు రాడా పరమాత్మయినా
కో అంటే కోటి దొర్లుకుంటు వస్తుంది కొండ మీది కోతి
తందత్తరదా తందత్తరదా తందత్తరదా తందత్తరదా తందత్తరదా

ఓయబ్బో మయసభలా యమాగా ఉంది ఏమి మాయలోకమిది
అచ్చ తెలుగులో ఐదు తారల పూటకూళ్ల ఇల్లు
మేకప్పేసి మరో భాషలో ఫైవ్ స్టార్ హోటల్ అంటారు

Yes, Do you have any reservation

అయ్యయ్యో లేదే

Welcome Sir! Welcome lady
We are glad to have you here
To serve you is our pleasure

రెపరెపలాడే రంగు కాగితం ఏమిటది
దేవుళ్లైనా దేవుల్లాడే అంత మహత్యం ఏముంది

శ్రీ లక్ష్మీ దేవి స్వహస్తంతో సంతకం చేసిన పత్రం
ఎవరక్కడ అంటే చిత్తం అంటుంది లోకం మొత్తం
చెక్కంటారు దీన్ని

వావ్ అయ్యయ్యో I can’t believe it
అయ్ బాబోయ్ గదా ఇది స్వర్గమేమో కదా ఇది

పైసాలో పవర్ ఇది పన్నీటి షవర్ ఇది
కాసు ముందు గాలైనా కండిషన్లో ఉంటుంది
పైకంతో ప్రపంచమంతా పడగ్గదికి వస్తుంది
మబ్బులతో పరుపులు కుట్టి పాలనురుగు దుప్పటి చుట్టి
పరిచి ఉంచిన పానుపు చూస్తే మేలుకోవా కలలన్నీ

తందత్తరదా తందత్తరదాదా తందత్తరదా
తందత్తరదాదా తందత్తరదా తందత్తరదాదా తందత్తరదా

24 April 2009

అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు

అబ్బో నేరేడు పళ్ళు
అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు
పులుపెక్కే ఓ పళ్ళు
కైపెక్కే ఆ కళ్ళు
లేలేత కొబ్బరి నీళ్ళు
అబ్బో నేరేడు పళ్ళు
అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు
అమ్మో గులాబి ముళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబి ముళ్ళు
ఎరుపెక్కే చెక్కిళ్ళు యెదలోన ఎక్కిళ్ళు
కోనేటి కొబ్బరి నీళ్ళు
అమ్మో గులాబి ముళ్ళు అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబి ముళ్ళు

ఆ గిరజాల సరదాలు చూస్తుంటే
అబ్బా విరజాజి విరబూసి పోతుంటే
ఆ గిరజాల సరదాలు చూస్తుంటే
అబ్బా విరజాజి విరబూసి పోతుంటే
నూనూగు మీసాలు చేస్తున్నా మోసాలు
నే తాళలేనమ్మా ఈ రోజు
నే కొల్చలేనమ్మా ఆ మోజు
పగటి చుక్క అమ్మాయి వగల మారి సన్నాయి
మోహాలు దాహాలు నాలో చెలరేగుతున్నాయి

ఆ జెడ పొడుగు మెడ నునుపు చూస్తుంటే
అడుగడుగు నీవెనకే పడుతుంటే
ఆ జెడ పొడుగు మెడ నునుపు చూస్తుంటే
అడుగడుగు నీవెనకే పడుతుంటే
నీలోని అందాలు వేస్తున్న బంధాలు
నే నోపలేనమ్మా ఈ రోజు
నేనాపలేనమ్మా ఆ మోజు
పదురుచూపు అబ్బాయి పగలు చుక్క రాదోయి
మూడు ముళ్ళు పడేదాక కాస్త నువ్వు ఆగవోయి

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా

ఎదలోని సొదలా ఎల తేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
ఎదలోని సొదలా ఎల తేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లెస
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వసి
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వసి
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగె ఆవేశం
కైలాశమే వంగె నీకోసం

మెరుపుంది నాలో అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

19 April 2009

గాల్లో తేలినట్లుందే గుండె పేలినట్లుందే

గాల్లో తేలినట్లుందే గుండె పేలినట్లుందే
తేనెపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్లుందే
ఒళ్ళు ఊగినట్లుందే దమ్ము లాగినట్లుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్లుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు ప్రీయసివో
నువ్వు నా కళ్ళకిఊపిరివో నువ్వు ఊహలవో
నువ్వుఊయలవో నువ్వు నా మనసుకి


హె నిదురదాటి కలలే పొంగే
పెదవి దాటి పిలుపే పొంగే
అదుపుదాటి మనసే పొంగే నాలో
గడపదాటి వలపే పొంగె
చెంపదాటి ఎరుపే పొంగె
నన్ను దాటి నేనే పొంగె నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడుకి


తలపుదాటి తనువే పొంగే
సిగ్గు దాటి చనువే పొంగే
గట్టు దాటి వయసే పొంగె నాలో
కనులుదాటి చూపే పొంగే
అడుగుదాటి పరుగే పొంగే
హద్దుదాటి హాయే పొంగె
నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు
సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో
నువ్వుతారకవో నువ్వు నా రాత్రికి

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపు తోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం

అడుగునౌతాను నీ వెంటే నేను తోడుగా నడవగా చివరిదాకా
గొడుగునౌతాను ఇకపైన నేను వానలో నిన్నిలా తడవనీకా
నిన్నొదిలి క్షణమైనా అసలుండలేను చిరునవ్వునౌతాను పెదవంచునా
నీ లేత చెక్కిళ్ళ వాకిల్లలోనతొలి సిగ్గు నేనవ్వనా

వెన్నెలౌతాను ప్రతిరేయి నేను చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరౌతాను నీలోన నేను ఎన్నడూ నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా
చిరు చెమట పడుతుంటే నీ నుదుటిపైనా వస్తాను చిరుగాలిలా

18 April 2009

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా
మొన్న కన్న కలా నిన్న విన్న కథ రేపు రాదు కదా జతా
ఇలా ఇలా నిరాశగా
నది దాటుతున్నా ఊరు మారుతున్నా ఊరుకోదు ఎదా ఆ

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా

స్నేహం నాదే, ప్రేమా నాదే, ఆ పైన ద్రోహం నాదే
కనులు నావె, వేలు నాదే, కన్నీరు నాదే లే
తప్పంత నాదే, శిక్షంత నాకే, తప్పించుకోలేనే
ఎడారి లొ తుఫాను లొ
తడి ఆరుతున్న తడి చూడకున్నా ఎదురేది అన్నా

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా

ఆట నాదే, గెలుపు నాదే, అనుకోని ఊటమి నాదే ఈ
మాట నాదే, బదులు నాదే, ప్రశ్నల్లే మిగిలానే
నా జాతకాన్నె, నా చేతి తోనే, నే మార్చి రాశానే
గతానిపై సమాధినై, బ్రతిమాలుతున్నా,
స్థితి మారుతున్నా, బ్రతికేస్తు ఉన్నా ఆ

ప్రాణం లో ప్రాణంగా మాటల్లో మౌనం గా చెపుతున్నా
బాధైనా ఏదైనా భారం గా దూరం గా వెళుతున్నా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా ఆ ఆ

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో బ్రహ్మ
స్వచ్చమైన వరిచేల సంపదలు
అచ్చతెనుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావె ముద్దుగుమ్మా
పాలకడలి కెరటాలవంటి నీ లేత అడుగు
తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా ఆ ఆ ఆ
ఆగని సంబరమా ఆ ఆ ఆ

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

వరములన్ని నిను వెంటబెట్టుకుని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మా
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగారకీర్తనం వర్ణనలకు ఆకారమైన
బంగారు చిలకవమ్మా
ఆ ఆ ఆ ఆ కముని సుమ శరమా ఆ ఆ

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా