30 October 2010

జింగిలాలో ఏం గింగిరాలో

||ప|| |అతడు|
జింగిలాలో ఏం గింగిరాలో
|ఆమె|
బొంగరాలో ఈ భాంగ్రాలో
|అతడు|
లెఫ్టు రైటు లేదులో పడుచు బాటలో
ఎర్ర లైటు వద్దురో కుర్ర జోరులో
|గ్రూప్|
చిన్నారి ఈ చకోరి చూపింది చిలిపి దారి
ఓరోరి బ్రహ్మచారి.. వదిలేస్తే వెరీ సారీ
|ఆమె|
పారాహుషారు పాటలందుకో
ఈ పరుగులో బ్రేకులెందుకో
|| జింగిలాలో ||
.
||చ|| |అతడు|
పాసుపోర్టు లేదు వీసాల గొడవ లేదు
వయసు దూసుకెళితే దేశాల హద్దులేదు
|గ్రూప్|
చాల్లేరా నెల్లూరే వెళ్లాలన్నా బస్ చార్జీ నిల్లేరా
ఇల్లాగే ఫారిన్ టూరు వెళ్లేది ఎలారా
|అతడు|
యు.ఎస్ ని ప్యారిస్ ని ఊహల్లో చూడరా
టెక్నికలర్ కలలు కనే టెక్నిక్ మనకుందిరా
|ఆమె|
ఆ నింగికి సైతం నిచ్చెన వేద్దాం మన ఆశకున్న హార్సు పవర్ చూపిద్దాం
ఏ ఎల్లలైన చెల్లవంటు చాటిద్దాం
|అతడు|
శాటిలైటు లాటిదిరా సాటిలేని యవ్వనం
పూట పూట వినోదాలు చూపించే సాధనం
|ఆమె|
జింగిలాలో ఏం గింగిరాలో
|అతడు|
బొంగరాలో ఈ భాంగ్రాలో
.
||చ|| |అతడు|
ఫిల్మ్ స్టారులంతా మనకేసి చూస్తున్నారు
మనం చూడకుంటే మరి ఎలా బతుకుతారు
|గ్రూప్|
చల్ చల్ రే… పాకెట్లో పైసాలతో పిక్చర్కే పోయొద్దాం
పోస్టర్లో పాపకి ఓ డ్రస్సు కొనిద్దాం
|అతడు|
తాపీగా కూర్చుంటే తోచదురా సోదరా
హ్యాపీగా ఎగరడమే మనమెరిగిన విద్యరా
|ఆమె|
ఆ గువ్వలమవుదాం.. రివ్వున పోదాం
మేఘాల మీద సంతకాలు చేసేద్దాం
ఓ వానవిల్లు కట్టి తిరిగి దిగి వద్దాం
|అతడు|
తుళ్లిపడే అల్లరితో గొల్లుమనే సంబరం
ఆకలనీ దాహమని ఆగదురా ఏ క్షణం
|| జింగిలాలో ||

No comments: