29 April 2011

తిరు తిరు గణనాధ ది ది ది తై

తిరు తిరు గణనాధ ది ది ది తై
తిరు తిరు గణనాధ ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాధ ది ది ది తై
నీ వెలుగు పంచు ఆ ప్రెమిదిలోన కొలువై
తిరు తిరు గణనాథ ది ది ది తై
తిరు తిరు గణనాథ ది ది ది తై

ససనిసగస సగమ
మమగమపమ మపని
పపమపనిస స ని అహ్హ అహ్హ అహ్హ అహ్హ అహ్హ అహ్హ

చెవులారా వింటూనే ఎంత పాటమైన
easy గా తలకెక్కే itune ఇవ్వు
కనులార చదివింది ఒకసారే అయినా
కల్లోని మరచిపోని memory ఇవ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవానిదేదైనా choice లో పోనివ్వు
ఒకొక్క దండానికి ఒక్కో mark పడనివ్వు
ఏ tension దరికిరాని ఏకాగ్రత నాకివ్వు
answer sheet పైన ఆగిపోని pen ఇవ్వు

తిరు తిరు గణనాధ ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాధ ది ది ది తై
తిరు తిరు గణనాధ ది ది ది తై
తలస్నానం చేయకుండా పూజించానంటూ నా వైపు కోపంగా చూస్తే ఒట్టు
షాంపూ తో పాటే చదివింది తుర్రుమంటు washai అయిపోతుందని నా sentimentu
తలనే మార్చే తండ్రిగారి కొడుకు మీరు
మీరు తలచుకుంటే మా తలరాతలు తారుమారు
భారతం రాసిన చేత్తో బతుకుని దిద్దేయ్ బంగారు
పేపర్ లో ఫోటోలు, రాంక్లెవ్వరు అడిగారు
పాస్ మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు

తిరు తిరు గణనాధ ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాధ ది ది ది తై
తిరు తిరు గణనాధ ది ది ది తై

రావు గారి అబ్బాయీ ఆక్టరవ్వాలన్నాడు

thats the way…
okay..

రావు గారి అబ్బాయీ
ఆక్టరవ్వాలన్నాడు
కాని వాల్ల బాబేమో డాక్టర్ నే చేసాడు
పైసలెన్నొ వస్తున్నా
పేషెంట్ లా ఉంటాడు
సూపర్ స్టార్ అవ్వాల్సినోడు సూది మందు గుచ్చుతున్నాడూ

నీకు నచ్చింది చేయకుంటే
లైఫ్ లో ఏముంది కిక్కూ
నిన్నె నువ్వు నమ్మకుంటే
నీకింక ఎవడు దిక్కు

we wants you wanna be
you wants you wanna to
say whats you wanna say
లేదంటే లైఫ్ అంత నరకం హె

నిజమెరా…
ఏదో నిన్ను ఫాలో అవ్వడం వల్ల ఇల ఉన్నాను కాని
లేకపోతే, ఆ లక్ష్మీ గారి అమ్మయిలా
లైఫ్ లొ లైఫె లేకుండ పోయేదిరా బాబూ బాబూ

హ అ లక్ష్మి గారి అమ్మాయీ [బగుంటదా?]
ముందు మాటర్ ఇన్ర సన్నాసీ..
హ అ లక్ష్మి గారి అమ్మాయీ
డాన్సర్ అవ్వాలనుకుంది [ఓహో]
కాని వాల్ల అమ్మేమో…
పెల్లి చేసి పంపేసిందీ..

హాయ్, వంద కోట్ల ఆస్తున్నా
వంటింట్లోనే ఉంటాదీ
గజ్జ కట్టాలనుకున్నాదీ
గరిట పట్టుకున్నాదీ

ఎవడో చెప్పింది చేస్తుంటే
లైఫ్ లొ ఏముంది కిక్కూ
ఎపుడూ నువ్వే సద్దుకుపోతే
నికింక ఎవడు దిక్కూ….

we wants you wanna be
you wants you wanna to
say whats you wanna say
లేదంటే లైఫ్ అంత నరకం హె

every body listen up
you gotta move your body in the club
life is such about a sweet moment
come on till you shake it go enough

leave your troubles back at home
you gotta lose it up and get alone
leave in this moment and spice it up
oh baby join me will you dance it out

మన జనరేషనే కాదు రా..
మన ముందు జనరేషన్ కూడా ఇదే టార్చరూ…
అంతందెకూ..
సీను గాడి బాబాయ్

హ సీను గాడి బాబాయీ
లీడరవ్వలన్నాడూ
కాని వీడి తాతేమో
ప్లీడర్ ని చేసాడూ

కేసు వాడి వైపున్న
ఫేసు మారినట్టుంటాడూ
జిందాబాద్ ఇనాల్సినోడు
జడ్జి ముందు తల వంచాడూ [అయ్యో పాపం]

నువ్వనుకున్నది చెప్పకుంటే
లైఫ్ లో యాడుంది కిక్కూ..
నీలో నువ్వే గిన్జుకుంటే
నికింక ఎవడు దిక్కు.

we wants you wanna be
you wants you wanna to
say whats you wanna say
లేదంటే లైఫ్ అంత నరకం హె

హహ
రేయ్, పెద్దవాల్లు చెబుతారూ
పక్కనోల్లూ చెబుతారూ
తప్పు లేదు బాసు వాల్లకు తోచిందే చెబుతారూ..

హ, నువ్వు కోరుకుందేంటో
నీకు ఏది సూటౌతుందో..
అర్తమయ్యేలా చెప్పకుంటె వాల్లు మాత్రం ఏన్చేస్తారో

హె, మనమే క్లియర్ గ లేకపోతే
అక్కడే వస్తుంది చిక్కూ
లేని పోని భయాలు పెట్టుకుంటే
తర్వాత మీకు దిక్కూ..

we wants you wanna be
you wants you wanna to
say whats you wanna say
లేదంటే లైఫ్ అంత నరకం హె

చలి చలిగా అల్లింది

చలి చలిగా అల్లింది
గిలి గిలిగా గిల్లింది
నీ వైపే మళ్ళింది మనసు

చిట పట చిందేస్తుంది
అటు ఇటు దూకేస్తుంది
సతమతమై పోతుంది వయసు

చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయి
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే

నువ్వు నాతోనే ఉన్నట్టు
నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు
నా లోపలున్నట్టు
ఏవో చెబుతున్నట్టు
ఏవో కలలు ||చలి చలిగా ||

చరణం 1 :
======

గొడవలతో మొదలై
తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే నీది నాది
తలపులు వేరైనా కలవని తీరినా
బలపడిపోతుందే ఉండేకొద్దీ
లోయలోకి పడిపోతున్నట్టు
ఆకాశం పైకి వెళుతున్నట్టు
తారలన్ని తారసపడినట్టు
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు

నువ్వు నాతోనే ఉన్నట్టు
నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు
నా లోపలున్నట్టు
ఏవో చెబుతున్నట్టు
ఏవో కలలు

చరణం 2 :
నీ పై కోపాన్ని ఎందరి ముందైనా
బెదురే లేకుండా తెలిపే నేను
నీపై ఇష్టాన్ని నేనొక నీకైనా
తెలపాలనుకుంటే తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్ని గుర్తోస్తుందే
నన్ను నేనే చేరాలనుకున్న
నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటె


నువ్వు నాతోనే ఉన్నట్టు
నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు

నువ్వు నా ఊపిరైనట్టు
నా లోపలున్నట్టు
ఏవో చెబుతున్నట్టు
ఏవో కలలు

అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను

అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను...
నన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోనూ...
ఎందులోను నీకు నేను తీసిపోనూ...
సంగతేంటో తెలుసుకోవా పోనుపోనూ...
పల్లె రాణి పిల్ల నేను...
పచ్చి పైరగాలి పీల్చి పెరిగినానూ...
ఏరికోరి గిల్లికజ్జా పెట్టుకోనూ...
నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేనూ..
. హే... సూటు బూటు స్టైలు సుందరా...
లేనిపోని డాబు మానరా...
ఈ ఊరిలో పైచేయి నాదిరా...
నా గొప్పలన్ని ఒప్పుకో తప్పులేదురా...
రేవులోని తాడి చెట్టులా నీ యెక్కువేవిటో???
ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో...

హే... నింగి జారిపడ్డ చందమామ ముక్కా

హే... నింగి జారిపడ్డ చందమామ ముక్కా
లేనిపోని టెక్కు నీకు జన్మ హక్కా
చాల్లే చిందులాట కోతి పిల్లలా...
హే... అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లలా
హే... చిన్న పల్లెటూరి బావిలోన కప్పా
నీలోన ఏమిటంట అంతలేసి గొప్పా
నీకు నువ్వు సూపరంటూ చెప్పకే అలా
హే... నేలమీద నిలవనంటూ రెచ్చిపోకలా...
మీసమున్న కుర్రవాణ్ణిలే...
మీదికొస్తే ఊరుకోనులే... కొండతోటి పందెమేయకే..
నొప్పులు గొప్పులు తప్పవే మరీ...
హే... పంతం మానుకోవే పాలకోవా...
పచ్చిమిర్చితోటి పందెమేస్తే ఓడిపోవా...

22 April 2011

ఎప్పటికి తన గుప్పిట విప్పదు

ఎప్పటికి తన గుప్పిట విప్పదు
ఎవ్వరికి తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా

తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
చెప్పుకునేందుకు కారణముండదు
చిక్కుల్లొ పడడం తనకే సరదా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా
నిన్న మొన్న నీ లోపల
కలిగిందా ఎనాడయినా కల్లోలం ఇలా
ఈ రోజు ఏమయిందని.. ఏదయినా అయిందని
నీకైనా కాస్తైనా అనిపించిందా

ఎప్పటికి తన గుప్పిట విప్పదు
ఎవ్వరికి తన గుట్టును చెప్పదు
ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా

తప్పుకునేందుకు దారిని ఇవ్వదు
చెప్పుకునేందుకు కారణముండదు
చిక్కుల్లొ పడడం తనకే సరదా

ఏదోలా చూస్తారే నిన్నో వింతలా
నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంతగా
మునపటిలా లేవంటూ..కొందరు నిందుస్తూ ఉంటే
నిజమో కాదొ స్పష్టంగా తేలేదెలా
సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే
నవ్వాలో నిట్టుర్చాలో తెలిసేదెలా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా

నీ తీరే మారింది నిన్నకి నేటికి
నీ దారే మళ్ళుతుందా కొత్త తీరానికి
మార్పేదైనా వస్తుంటే నువ్వు అది గుర్తించకముందే
ఎవరెవరొ చెబుతుంటే నమ్మేదెలా?
వెళ్ళే మర్గం ముళ్ళుంటే..ఆ సంగతి గమనించందే
తొందరపడి ముందడుగేసే వీల్లేదలా?

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా
అలలు ఆగని సంద్రములా మది మారితే ఎలా

ఆలే బాలే ఆలే బాలే తీన్‌మారేలే

పల్లవి :
ఆలే బాలే ఆలే బాలే తీన్‌మారేలే
ఆలే బాలే ఆలే బాలే ధూమ్‌ధామేలే
అర్థంలేని పరదాలు పీకి పారేద్దాం
పీకల్లోతు ఫ్రీడమ్‌లో మునిగి తేలేద్దాం
గుండెలోపలి భారం ఇవ్వాళ దించుకుందాం
కళ్లగంతలు తీసి కొత్తలోకం చూద్దాం
ఎందుకీ మొహమాటం చాలు చాలు అందం
హాయి దారుల్లో సాగిపోదాం
మనలా మనమున్న చోట సంతోషమంతా
శివతాండవాఁడుతుందే
Just Move Along My Crazy Boy
Just Move Along Oo.. Oo.. Baby
Just Move Along You Are So Fun
Just Move Along Shika Dhum
Just Move Along Shika Dhum My Girl
Just Move Along Oo.. Oo.. Baby
Just Move Along Pretty Dolly Girl
Just Move Along Shika Dhum

చరణం : 1
ఆలే బాలే ఆలే బాలే దుమ్ము రేపాలే
ఆలే బాలే ఆలే బాలే కెవ్వు కేకేలే
ఇగోలన్నీ స్విచ్ఛాఫ్ చేసి పెట్టేద్దాం
సంతోషాలే గుప్పిట్లో పట్టి దాచేద్దాం
గూగుల్ అంతా వెతికి సరదాల జాడ పడదాం
అల్లరల్లరి చేసి యూట్యూబ్‌లోన పెడదాం
రెండు మనసుల ఫీలింగ్సు
ప్రింటు తీసుకుందాం
దాచుకోకుండా ఓపెనైపోదాం
మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుగోడల్ని
పగలకొడదాం ॥Just॥

చరణం : 2
ఆలే బాలే ఆలే బాలే పిచ్చ హ్యాపీలే
ఆలే బాలే ఆలే బాలే రచ్చరచ్చేలే
చూసేవాళ్లు ఈ జాతరేంటనడగాలే
నవ్వేవాళ్లు మరి నవ్వుకున్న ఫరవాలేఁ
నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం
వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం
స్పీడు మీద ఉన్నా ఎవడాపుతాడో చూద్దాం
దారికడ్డొస్తే లాగి తన్నేద్దాం
మనలా ఎవరుండలేరు అని వల్లకాదు అని
బల్లగుద్ది చెబుదాం
॥Just॥

దూరం దూరం దూరం

దూరం దూరం దూరం.. ఓఓ.ఓ.. తీరం లేని దూరం..
ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే!
ఒకే పడవలో కలిసినా.. ఒకే ప్రయాణం చేసినా.. చెరో ప్రపంచం చేరినారే!
ఒకే గతాన్ని..ఓఓ.. ఒకే నిజాన్ని.. ఉరేసినారే! ఓఓఓ..
చెరో సగాన్ని.. ఓఓ.. మరో జగాన్ని.. వరించినారే! ఓఓఓ..

ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే!
దూరం దూరం దూరం.. ఓఓ.ఓ.. తీరం లేని దూరం..

ఓ ఇంత దగ్గరా అంతులేని దూరం.. ఎంత కాలమో దారిలేని దూరం..
జంట మధ్య దూరి వేరు చేసే.. దారే నాదే అన్నాదే..
ఓ స్నేహమంటు లేక ఒంటరైన దూరం.. చుట్టమంటు లేని మంటతోనే దూరం..
బంధనాలు తెంచుతూ.. ఇలా..భలేగ మురిసే..
ఎడబాటులోని చేదు తింటు దూరం.. ఎదుగుతున్నదే..
విరహాన చిమ్మ చీకటింట దూరం.. వెలుగుతున్నదే.. ఓఓఓ

ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే!
దూరం దూరం దూరం.. ఓఓ.ఓ.. తీరం లేని దూరం..

ఒక్క అడుగూ వెయ్యలేని దూరం.. ఒక్క అంగుళం వెళ్ళలేని దూరం..
ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే..
మైలు రాయికొక్క మాట మార్చు దూరం.. మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం..
మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగ మార్చే..
తుది లేని ఙ్ఞాపకాన్ని తుడిచి వేసే.. దూరమన్నదీ..
మొదలైన చోటు మరిచిపోతె కాదే.. పయనమన్నదీ.. ఓఓఓఓ

ఒకే పరీక్షే రాసినా.. ఒకే జవాబై సాగినా.. చెరో ప్రశ్నల్లే మిగిలినారే!
దూరం దూరం దూరం.. ఓఓ.ఓ.. తీరం లేని దూరం..

09 April 2011

ఇది సరిగమ ఎరుగని రాగం

ఇది సరిగమ ఎరుగని రాగం
ఇది భాషే లేని భావము
ప్రేమ గానము
ఇది యిదియని తెలియని భావం
ఇది పలికే భాషే మౌనము
ప్రేమ గానము

మణిలాగ రమణిలాగ
సుధచిందే వసుధనందే
అరవిరిసే ఆశల ఆమని
అనురాగం తనువు వూగ
లతలోని కలతదీర
జతజేర రారా లాహిరి
కలహంసలా విరిధనువులా రావే వధువులా

గిలిగింత రగిలినంత
రసగీతి సరసరీతి
రవళించగ రారా మురళిలా
వనరాణి కవనవాణి
కలవాణి కలలకేళి
చెలి వెన్నెల విరిసే వేళలో
నిను చేరగా తగు సమయమే రానీ శుభమని

చందమామ కన్నుకొట్టె సందెవేళ

చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రావే పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ
అందమంత ఆరబెట్టి పైటజారె
కోడెగాలి కొట్టగానె కోకజారె
పడలేనీ ఆరాటం
చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రారా పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ

జాజి మల్లి మంచు నీకు జల్లుకుంటా
కొత్త నాగమల్లితీగలాగ అల్లుకుంటా
వాలింది పొద్దు
వడ్డించు ముద్దు
తప్పులెన్ని చేసుకున్నా వొప్పుకుంటా
నువ్వు తప్పుకుంటే తిప్పలెట్టి తిప్పుకుంటా
కౌగిళ్లు పట్టు
కవ్వింత కొట్టు
నిషా కళ్ల నీడలో హుషారైన వో కల
రసాలమ్మ కోనలో పసందైన ఆకలా
చలి తీరాలీ సాయంత్రం
చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రావే పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకోరా పొంగులన్నీ పాలవేళ

మొక్కజొన్నతోటకాడ మొక్కుకుంటా
పాలబుగ్గలోని మొగ్గలన్ని యిచ్చుకుంటా
జాబిల్లి జంట
జాగారమంట
చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా
నీకు బిఱ్ఱుపట్టు రైకలెట్టి చూసుకుంటా
శ్రీకంచిపట్టు
స్త్రీ కన్నుకొట్టు
గులాబీల తోటలో కులాసాలు పండనీ
పెదాలమ్మ పేటలో పదాలెన్నో పాడనీ
చిలకమ్మా నీ కోసం
చందమామ కన్నుకొట్టె సందెవేళ
సిగ్గు మల్లెపూలుపెట్టె చీకటేళ
మంచెకాడుంది రారా పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ
అందమంత ఆరబెట్టి పైటజారె
కోడెగాలి కొట్టగానె కోకజారె
పడలేనీ ఆరాటం

ఒలెంపిక్ క్రీడల్లో పేకాటకే పెద్దపీట వేస్తే

ఒలెంపిక్ క్రీడల్లో పేకాటకే పెద్దపీట వేస్తే
ఒసామా బిన్ లాడెన్ అన్నమయ్య వీసీడీ చూస్తుంటే
మడోన్నా మావూళ్ళమ్మ జాతరకొచ్చి ఫోకుసాంగు కొడితే
సహారా ఎయిర్లైన్సుకే సత్తెనపల్లి సంతలోన ఆఫీసే తెరిచేస్తే విడ్డూరం

గులాబీ రేకుల్తో గుండెజబ్బుకే మందే కనిపెడితే
జిలేబీ పానకంతో నడిచే కారులు ఇండియాకి వస్తే
మసాలాదోశలమీద పచ్చడిమీద పీహెచ్ డీ చేస్తే
పొలంలో దుక్కిని దున్నే రైతుకు సైతం లక్షల్లోనే సెల్లుబిల్లు వస్తే విడ్డూరం

సినీతారలు వానపాటలో నాభి చూపకుంటే బొడ్డూరం
సిటీరోడ్లపై యమాస్పీడులో పడవలు వెళుతుంటే తెడ్డూరం
బందరులోని మిఠాయికొట్లో స్వీటే లేకుంటే లడ్డూరం
బాఁడీలోని రక్తం రంగు బ్లేఁకే ఐపోతే రెడ్డూరం
తెలుగుఫిల్ములో తెలుగుపాటలు తెలుగుతెలిసిన తెలుగువాళ్ళతో యీరోజుల్లో పాడించారంటే విడ్డూరం

కరెంటు బల్బులపై మిణుగురు పురుగులు యుద్ధం ప్రకటిస్తే
సిమెంటు రేకులతోటి కాకులు చిలకలు గూళ్ళు కట్టుకుంటే
కొమ్మపై కోకిల గొంతుకి జలుబేచేసి విక్సు వాడుతుంటే
నాన్ వెజ్ తినడం నేను మానేశానని పులి కుందేలుకి ఫోనుచేసి చెబితే విడ్డూరం

పుంజూ పెట్టా సరసమాడగా ఆమ్లెట్ పుడుతుంటే గుడ్డూరం
తెలుగుభాషలో అక్షరాలుగా ఎక్స్,వై లే వుంటే జెడ్డూరం
ఉగాదిపచ్చడి చిల్లీచికెను కలిపే వడ్డిస్తే ఫుడ్డూరం
డన్లప్ కంపెని తాటాకులతో చాపలు చేస్తుంటే బెడ్డూరం
సోమవారము మొదలుపెట్టిన చిత్రహింసల టీవీ సీరియల్ మంగళవారమె ముగింపుకొచ్చేస్తే విడ్డూరం

అభిమతము అభినయము ఈ ప్రేమ చతురాతి చతురం

అభిమతము అభినయము ఈ ప్రేమ చతురాతి చతురం
చలిలో రేగును సెగలే
ఎదలో మోగును లయలే
ఇది పెళ్లికి పిచ్చికి నడుమ విచిత్రం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం
మనసే మమతకు జోడై
మమతే మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం

కోటినవ్వుల గూటిగువ్వవు
గోట మీటగానే మోగు వీణవు
కోమలి కో అంటే ఆరును యెదమంట
భామిని నో అంటే బాధలు మొదలంట
సరి అనవా వరమిడవా సరసన నవరసమధురసమీవా

మండుటెండలో మంచుకొండవై
స్నేహసుధలలోనా భాగమందుకో
ఒంటరిమనుగడలో వూరట కలిమేలే
బాధలసుడివడిలో బాసట బలిమేలే
వేడుకలో వేదనలో తోడుగనిలిచెడి స్నేహమే సంపద

జారిపోయెనా నీ చేయి జారెనా

జారిపోయెనా నీ చేయి జారెనా
తెలుగురాని కొత్తతరంలా
నీరు లేని తెలుగుజనంలా
యువతిలేని యువకునిలాగా
దయమరచిన దైవంలాగా

శౌర్యంలేని ఖడ్గంలాగా
నీరుడిగిన నేలతల్లిలా
తూర్పెరగని సూర్యుడిలాగా
హద్దుచెరిగి దేశంలాగా

తెల్లని ఇసకను మథనం చేస్తే మనసే పుడుతుందా
పై పై వేషం లోపల పాశం కథ నడిపిస్తుందా
నిను పోగొట్టుకుని నిన్నే వెతికేవా
మదిలో ఆశలతో పెదవికి తాళాలా
అరే యెంత పిచ్చిదానివే

చిట్టి చిట్టి కవితన్నేనే

చిట్టి చిట్టి కవితన్నేనే
సీతాకోకచిలకన్నేనే
చుక్క రెక్కల పువ్వును నేనే
సైగలు చేసే వాగును నేనే
జడివానకు గొడుగై
సెలయేటికి అలనై
తొలిపాటకు పదమై
దేవుడికొక వరమై

ఆహా చల్లగాలీ యిలా వీస్తే నీ తోటి సైయాటలే ఆడనా
అరరె యీ భూమి నా తల్లీ జగమంతా జోలాలి సంకీర్తనా
కన్నుకొట్టి ఆశపుడితే యెండకన్ను నేను కొట్టనా
వానవిల్లు చీరకట్టనా అమ్మమ్మమ్మమ్మమ్మో
మేఘాలన్నీ నాకే సొంతం
మల్లెపూల చందమామ చెల్లెలంటు పాలబుగ్గే గిల్లి ఆనందంలో

మీసం నాకు లేదు లేకపోతే యేం దోషం నేనాడ గురజాడనే
ఆసలే ఆశలేదు అయితేయేం యేనాడో సేవే కదా నా మతం
చిట్టిపూల చెట్లనవ్వులే రంగురంగు పుస్తకాలులే
నేలమీద స్వర్గముందిలే అమ్మమ్మమ్మమ్మమ్మో
ఝల్లని పొంగే జావళి జతిలో
గజ్జెకట్టి కృష్ణవేణి ఘల్లుమంటు ఆట ఆడే పాడే ఆనందంలో

ఒట్టేసిచెబుతున్నా వింటున్నావా ఓ మైనా

ఒట్టేసిచెబుతున్నా వింటున్నావా ఓ మైనా నువ్వంటే నేనేనని
అడుగేసి వస్తున్నా యెందాకైనా యేవైఁనా నీ వెంటే వుండాలని
తీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారం
నీవల్లే మారిందే నా జాతకం
అందిందమ్మో అనుబంధం యేవో జన్మల ఋణబంధం
నీ వొళ్ళో వాలిందే నా జీవితం

వెళ్ళేటిదారుల్లోన నీడుంటే చాలనుకుంటే బంగరుమేడై కలిసొచ్చావే
వేచేటి కన్నుల్లోన కలలుంటే చాలనుకుంటే కమ్మని నిజమై కనిపించావే
దీవెన చాలని అనుకుంటే దైవం అందెనే
పూజకు రమ్మని పిలుపిస్తే ప్రాణం పంచెనే
నా రాతే మార్చేసే నా గీతే దిద్దేసే భామిని వుండగ బ్రహ్మెందుకో

నీ లేతపాదాలంటే ధూళైతే చాలనుకుంటే పాపిటతిలకమే చేశావమ్మా
నీ పెరటితోటల్లోన గాలైతే చాలనుకుంటే వూపిరిలో నను నిలిపావమ్మా
నాలో నేడే వెలిగిందే ఆశాదీపము
ప్రేమే మనకు అందించే ఆశీర్వాదము
నీ మెళ్ళో ముళ్ళేసి పల్లెల్లో యిల్లేసి జతపడి బ్రతకని జన్మెందుకో

07 April 2011

వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ

వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ
వివాహం నాటకమన్నా కాపురం బూటకమన్నా
సమస్తం నాశనమన్న పెళ్ళి రోజుతో
ఇల్లేమో ఇరకటమంట పెళ్ళామేమో మరకటమంట
బ్రతుకంత చింత చిల్లు ముంత
ఒక్క మూడు ముళ్ళతో
వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ

కైక మాట విని కాకరేగి పరలోకమేగె ఒకడు
అంబ దెబ్బ తిని పంబ రేగి ఉదకంబు తాగెనొకడు
ఇంద్రదేవుడికి ఇంటివల్ల ఒల్లంతా చెడినదపుడు
తార వల్ల మన పూర్ణ చంద్రునికి తాట లేచెనపుడు
చిత్రాంగి బలిపెట్టే తారంగుని
అప్సరస చెరిపింది రాజర్షి ని
కావ్యాలు గ్రంధాలు తిరిగేసినా
ఇతిహాస డ్రామాలు వడబోసినా
గయ్యాలి పెళ్ళాలు ఒల్లోని దెయ్యాలు
మగవాళ్ళ ప్రాణాలు తీసేటి భూతాలు
అమ్మమ్మో ఆడోళ్ళు రాంటోల్లు ఆ నోళ్ళు కలిసిన సుఖమిక సున్నా
భరతము నను పడకున్నా చిన్నా కన్నా వద్దురా
వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ

ఆడదానిపై ప్రేమ అన్నది మాయరోగ మనుకో
పాముకన్నా అణుబాంబు కన్నా అది పెద్ద danger అనుకో
కొట్టులాటలు కౌగిలింతలు ఒట్టి భ్రాంతి brotheru
ముద్దు గుమ్మ తన ప్రేమ నటనతో పిప్పిచేయు నదరు
వంటింటి తాబేళ్ళూ అవ్వద్దురా
కన్నీళ్ళ కల్లాపి చల్లద్దురా
సన్యాసమే best ఏనాటికి
స్త్రీ సౌక్యమే రొస్టు మరణానికి
జై వీర హనుమాను అనుకోండి రారండి
సత్ బ్రహ్మచారులుగా చరితార్దులవ్వండి
పెళ్ళిళ్ళు మానండి పెళ్ళాళ్ళు వద్దండి
అతివను వలచుటకన్నా మతి చెడి తిరుగుట మిన్న
అయ్యా బాబు వద్దురో
వివాహం నాటకమన్నా కాపురం బూటకమన్నో
సమస్తం నాశనమన్న పెళ్ళి రోజుతో
ఇల్లేమో ఇరకటమంట పెళ్ళామేమో మరకటమంట
బ్రతుకంత చింత చిల్లు ముంత
ఒక్క మూడు ముళ్ళతో
వివాహాలే నశించాలీ విరాగాలే ఫలించాలీ
ఆ వివాహాలే ఒరబ్బాహో విరాగాలే తానా నాన నా నా న నా న న

06 April 2011

మతిలేక పిచిగా నిను ప్రేమించారా బుజ్జిగా

మతిలేక పిచ్చిగా నిను ప్రేమించారా బుజ్జిగా
ఎదలోన గుచ్చగా యమ కిరి కిరి చేస్తా రచ్చగ
అరేయ్ పోరా పోరగా దోరికానా తేరగా
తిరిగానే గాలిగా వెనకాలే వీరగా
యమహోరే వెనకెనక యమహోరే నా రసిక సఖ
మన హరే మధు మధురమిక జయ హరే జగ జగదామిక
మతిలేక పిచ్చిగా నిను ప్రేమించరా బుజ్జిగ
ఎదలోన గుచగా యమ కిరి కిరి చేస్తా రచ్చగ

బుజ్జి పాప బంగారు యంగ్ చేప నే మెరు పాప ను పారు పాపా నీ పని సపా ప
అవతార అడిగింది చేసి పోరా ఇది తప్పు రా మహా గొప్ప రా అదే ఒప్పు రా రా
సున్నా నడుమున్న దానా వెన్న సొగసున్న దాన ఎన్నో వన్నెలున్న కన్నవైన ఏంటో దింత తిల్లాన
యమహోరే వెనకెనక యమహోరే నా రసిక సఖ
మన హరే మధు మధురమిక జయ హరే జగ జగడమిక
మతిలేక పిచ్చిగా నిను ప్రేమించారా బుజ్జిగ
ఎదలోన గుచగా యమ కిరి కిరి చేస్తా రచ్చగ

పిల్లగాడ రాకూడదు ఇంకా తేడ కసి కాగడ కాసు మీగడ ఎద దడ దడదః డా
యమగాడా కొట్టావ నువ్ గిచ్చుత నే మెచ్చుట ఒక ముచ్చట
‘నందమూరి‘ వాడే చిన్న పోరాగాడేయ్ దండ విందు చేసి చిందులేసి బాలుడెయ్ వీడే
యమహోరే వెనకెనక యమహోరే నా రసిక సఖ
మన హోరే మధు మధురమిక జయ హోరే జగ జగడమిక

05 April 2011

యమాగా ఉందే నీ అందం eighth wonderలా

యమాగా ఉందే నీ అందం eighth wonderలా
ఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా
అమాంతం వచ్చి దూకావే young tigerలా
ఎడా పెడా నా వయసంతా కొల్లగొట్టేలా
నా బంగారూఊ ఊఊ ఊఉ
నిను చూస్తూనే పెరిగిందే temparaturu
దరికొచ్చావా మొదలేగా చిలిపి dangeru
నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో poweru నువ్వేనా a1 star
యమాగా ఉందే నీ అందం eighth wonderలా
ఘుమ ఘుమ కవ్విస్తోందే కాలు దువ్వేలా
అమాంతం వచ్చి దూకావే young tigerలా
ఎడా పెడా నా వయసంతా కొల్లగొట్టేలా

చిట్టి చిన్ని బుజ్జి బుల్లి అన్నీ నువ్వేలే నిన్ను దువ్వాలే
ఒక చిన్న మాటతోనే పడగొట్టేసావు నన్నే
ఆట పాట వాటా వేట అన్నీ నీతోనే నంజుకుంటానే
పైసారైనా దాచుకొనే ముడుపైచేసాను నన్నే
నిన్నటిదాకా మొగ్గనుకున్నా పువ్వా నిన్నే
మచ్చిక చూసి విచ్చుకుపోయా కావాలనే
నా బంగారు ఊఉ ఊఊ ఊఉ
బలే పెంచావే నాకోసం పిచ్చ glamouru
చనువిచ్చాగా నేర్పించు పచ్చి grameru
నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో poweru నువ్వేనా a1 star

పిల్లా నన్నే పొందాలంటే రాసి ఉండాలే range ఉండాలే
నీ కన్ను పడ్డానాడే నా scene తారుమారే
తలుకు బెలుకు వయ్యారాలా తూగుతుయ్యాలే వాలిపొవాలే
హయ్ బాబోయ్ గోల గోలే అదిరింది రాసలీలే
ఇమ్మనకున్నా కమ్మనివన్నీ ఇచ్చావులే
రమ్మనకున్నా రయ్యా రై రై వచ్చావులే
నా బంగారు ఊఉ ఊఊ ఊఉ
నీ నడువొంపే rainbow కు small sisteru
జరా touch చేసి స్విచ్చేసి చూడు misteru
నచ్చావే మాయాబజారు కాస్కో నా డుమ్ము డుమారు
మెచ్చాలే నీలో poweru నువ్వేనా a1 star

ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు

ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
ఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించడం
ఎలా ఎలా గతాలనే ఇవ్వాళగా మార్చడం
ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను వువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని

చివరిదాకా చెలిమి పంచే చిలిపితనమే నీవని
మనసు దాకా చేరగలిగే మొదటి పిలుపే నీదని
తెలియకుండా ఇంత కాలం ఏమి చేశానో
తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా

ఎవరు చేరి తీర్చగలరు మనసులోని లోటుని
ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని
ఎదురు చూస్తూ ఉండిపోనా నేను ఇక పైన
జ్ఞాపకాన్నై మిగిలిపోనా ఎన్నినాళ్ళైనా ఇలా

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే
సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికే
మందుంది మనసు బాధకి వదిలేద్దాం కథని కంచికే
అసలీ ప్రేమ దోమ ఎందుకు తెల్ల్ మె వ్హ్య్
ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలేయ్
ఏయ్ ప్రేమ దోమ ఎందుకు తెల్ల్ మె వ్హ్య్
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే

మ్ ప్రేమించినా మ్ పెళ్ళాడకు
wife ఒక్కటే తోడెందుకు
మ్ మగ వాళ్ళని మ్ టైం పాసని
అనుకుంటూ వెంట తిరగనీ
మన ఖర్చే వాళ్ళు పెట్టనీ
ఆ పైన వాళ్ళ ఖర్మ పోనీ
మరి పెళ్ళి గిల్లి ఎందుకు తెల్ల్ మె వ్హ్య్
అది బుర్రే లేని వాళ్ళకి వదిలేసేయ్
మరి పెళ్ళి గిల్లి ఎందుకు తెల్ల్ మె వ్హ్య్

ఆ నువ్వొక్కడే మ్ పుట్టావురా
నువ్వొక్కడే పోతావురా
మ్ ఆ మధ్యలో మ్ బతకాలిగా
ఆరడుగుల పెళ్ళి గొయ్యికి ఏడడుగుల తొందరెందుకు
సూసైడు నేడు ముద్దు మనకి
మరి లైఫూ గీఫూ ఎందుకు తెల్ల్ మె వ్హ్య్
నువ్ మళ్ళీ మళ్ళీ మొదలెట్టకు వదిలేయ్
ఏయ్ ప్రేమ దోమ ఎందుకు తెల్ల్ మె వ్హ్య్

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే అల
కవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముళ్ళై తాకగా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునా
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల

ఆహా ఏం కన్నులు ఓహో ఏం చూపులు
అవి కావా మా ఆస్తులు
మ్మ్ ప్రేమించక ముందరే ఈ తియ్యని కవితలు
తర్వాత అవి కసురులు
అన్నీ వింటూ ఆనందిస్తూ ఆపైన I'm sorry అంటారు
చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ సింపుల్‌గా No అందురు

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల

కన్నీటి బాణమే వేసేటి విద్యలో
ముందుంది మీరే కదా
హే మౌనాన్నే కంచెగా మలిచేటి కోర్సులో
distinction మీదే కదా
కన్నీరైనా మౌనం అయినా చెప్పేది నిజమేలే ప్రతిరోజు
అంతే కాని అరచేతుల్లో ఆకాశం చూపించకు

అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
కవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముళ్ళై తాకగా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునా నానన్నా ననా

02 April 2011

మేఘమా నీలి మేఘమా మేఘమా నీలి మేఘమా

మేఘమా నీలి మేఘమా మేఘమా నీలి మేఘమా
ఉరమకే నిరవకే నీలి నీలి మేఘమా మేఘమా నీలి మేఘమా
ఉన్నరూపం మార్చుకొని నిన్ను నువ్వే కాల్చుకొని
వానవై కురవకే త్యాగమై తరగకే
మేఘమా నీలి మేఘమా

ప్రతి ప్రసవం గండమని
పతి నిమిషం మరణమని
తెలిసి కూడ కన్న తల్లులూ
ప్రతి ప్రసవం గండమని
పతి నిమిషం మరణమని
తెలిసి కూడ కన్న తల్లులూ
మరల మరల కంటారు
పగటికలలు కంటారు
బిడ్డ దైవ మంటారు
దైవమే రాయి అని
ఉలుకు పలుకు లేనిదని
తెలుసుకోరు పిచ్చి తల్లులు
మేఘమా నీలి మేఘమా
ఉరమకే నిరవకే నీలి నీలి మేఘమా
మేఘమా నీలి మేఘమా

సాగరమే సంసారమని
ఈదటమే కష్టమని
మరచిపోయి కన్న తండ్రులు
సాగరాన ప్రయణిస్తారు
మునిగితేలుతుంటారు
మునకే మిగిలునని
కన్నందుకు ఫలితమని
తెలుసుకోరు పిచ్చి తండ్రులు
మేఘమా నీలి మేఘమా
ఉరమకే నిరవకే మేఘమా నీలి మేఘమా
మేఘమా నీలి మేఘమా
ఉన్నరూపం మార్చుకుని నిన్ను నువ్వే కాల్చుకుని
వానవై కురవకే త్యాగమై తరగకే
మేఘమా నీలి మేఘమా