సరిగమలు గలగలలు సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము ప్రియురాలే నాట్యము
చెలికాలి మువ్వల గల గలలూ చెలి కాలి మువ్వల గల గలలూ
చెలికాని మురళిలో
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
కదలీ కదలక కదిలించు కదలికలు
కదలీ కదలక కదిలించు కదలికలు
గంగా తరంగాల శృంగార డోలికలు
హృదయాలు కలవాలి ఒక శృతిలో
బ్రతుకులు నడవాలి ఒక లయలో
శృతిలయలొకటైన అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు
నయనాలు కలిశాయి ఒక చూపులో
నాట్యాలు చేశాయి నీ రూపులో
నయనాలు కలిశాయి ఒక చూపులో
నాట్యాలు చేశాయి నీ రూపులో
రాధనై పలకనీ నీ మురళి రవళిలో
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో
No comments:
Post a Comment