24 November 2007

ఎపుడు నీకు నే తెలుపనిది

ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హ్రుదయం బాధగా చూసింది
నిజమేనీడగా మారింది...ఒ..ఒ..ఒ..ఒ.

జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతిచోటా
జీవితం నీవని గురుతు చేసావు ప్రతిపూటా
మొండిగా బతక లేనంటూ వెంట తరిమావు ఇన్నాళ్ళు
మెలకువే రాని కలగంటూ గడప మన్నావు నూరేళ్ళు
ప్రియతమా నీ పరిమళం ఒక ఊహే గాని ఉపిరిగా సొంతం కాదా

హే ఉదయించిన సూర్యుడినడిగ కనిపించని దేవుడినడిగ

హే ఉదయించిన సూర్యుడినడిగ కనిపించని దేవుడినడిగ
నా గుండెలొ నీ గుడి నడిగ నువ్వెక్కడా అని
చలి పెంచిన చీకటి నడిగ చిగురించిన చంద్రుడినడిగ
విరబూసిన వెన్నెల నడిగ నువ్వెక్కడ అని
చిక్కవే ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలి
ఇక్కడె ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే
వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసే నీ చెక్కిలి
ఇప్పుడూ యెప్పుడు నే మరువ లేని తీపి గురుతులే

మనసు అంత నీ రూపం నా ప్రాణమంత నీకోసం
నువ్వెక్కడ ఎక్కడ అని వెతికి వయసు అలసిపోయె పాపం
నీ జాడ తెలిసేనన్ను నిమిషం అహ అంతులేని సంతోషం
ఈ లోకమంత నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం
అడుగు అడుగున నువ్వే నువ్వే నన్ను తాకేనే నీ చిరునవ్వే
కళలా నుండి ఓ నిజమై రావె నన్ను చేరావె
హోయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వె గుండె చప్పుడికి తళం నువ్వే
యెదను మీటు సుస్వరమై రావె నన్ను చేరవె

నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటొంది
నువ్వు లేక వెన్నెల కూడ యెండల్లె మండుతొంది
కాస్త దూరమే కాద మన మధ్యనొచ్చి వాలింది
దూరాన్ని తరిమి వేసే గడియ మన దరికి చేరుకొంది
యేమి మయవొ ఎమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని
నువ్వు ఉన్న నా మనసంటుంది నిన్ను రమ్మని
హోయ్ నువు ఎక్కడునావో గాని నన్ను కాస్త నీ చెంతకు రాని
నువ్వు లేకనే లేనేలేనని కాస్త తెలుపని

హేయ్ తకదిమి తోం తకదిమి తోం

హేయ్ తకదిమి తోం తకదిమి తోం తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకి తకదిమి తోం
తకదిమి తోం తకదిమి తోం సరిగమ పదమని తకదిమి తోం
ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం
కష్టం నష్టం యెదురైన నచ్చినదె చేసేద్దాం
అలవాటైనా చేదైనా తకదిమి తోం
తప్పో వొప్పో చేసేద్దాం తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా తకదిమి తోం
క్రుషి వుంటే నీ వెంటేరా ఈ లోకం
గాయేంగె జోష్ కరియె జీయేంగె ప్యార్ కరియె

చిరునవ్వుతో అటు చీకటిని ఇటు ఓటమిని తరిమెయ్యరా
ఆ ఓర్పుకి తకదిమి తోం
ఉల్లాసమె ఓ వెల్లువల ఓ ఉప్పెనలా ఉరకాలిర
ఆ జోరుకి తకదిమి తోం
పరిగెడదాం పరిగెడదాం గెలిచే వరకు పరిగెడదాం
గురి చూసాక మనకింక తిరుగేది
గాయేంగె జోష్ కరియె

నీ మాటతొ అటు నిస్స్యబ్దం ఇటు ఓ యుద్ధం ఆగాలిరా
ఆ నేర్పుకి తకదిమి తోం
నా ప్రేమతొ ఆ శత్రువునె ఓ మిత్రునిగా మార్చాలిరా
ఆ గెలుపుకి తకదిమి తోం
ఒకటౌదాం ఒకటౌదాం ప్రేమను పంచగ ఒకటౌదాం
ప్రేమించే మనసుంటే మహరాజే
జీయేంగె ప్యార్ కరియె

తెలుసునా తెలుసునా మనసుకె తొలి కదలికా

తెలుసునా తెలుసునా మనసుకె తొలి కదలికా
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడొ నమ్మడొ అని తేల్చుకోలేక
నవ్వుతాడొ యేమిటో అని బయటపడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది

అతడు ఎదురైతే యేదో జరిగిపూతోంది
పెదవి చివరే పలకరింపు నిలిచిపోతోంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారేందుకూ
ఇంతవరకు లేదుగా ఇప్పుడు యెమైందో
కని విని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక

గుండెలోతుల్లో యెదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతని తలపే నిండిపొయుంది
అలగవే హౄదయమా అనుమతైనా అడగలేదని

కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొతగా

తల తలమణి కులుకుల వని కనపడుతుంటె మతి పోద కుమారీ

తల తలమణి కులుకుల వని కనపడుతుంటె మతి పోద కుమారీ
పద పదమని తరిమిన మది కనిపెడుతుందె యెటువున్న నీ దారీ
నిన్ను చూసి పారిపోయిందె నిదురించే రాతిరి
చిటికేసి చేరుకోమంది ఉదయించే లాహిరి

లోకం కనరాని మైకం జతలోని వేగం చెలరేగని
పైకెం వినలేని రాగం మనలోని మౌనం కరిగించనీ
ఇంత కాలం బరువైన ప్రాయం అడిగె సహయం ఒడిచేరనీ
పాపం ప్రియురాలి తాపం అనిగె ప్రతాపం చూపించని
కమ్మని తిమ్మిరి కమ్మిన ఈడుని ఎన్ కావాలని అడగాలి
ఉక్కిరి బిక్కిరి లాలన ఇవ్వలీ
జంటకు చేరిన ఒంటరి ఒంపుల తుంటరి ఆశలు తీరలి
నమ్మకు వచ్చిన అమ్మడు మెచ్చిన ఉమ్మది ముచ్చటలో

లోలో రుస రుసలు రేపే తహ తహలు ఆపే సమయం ఇది
నాలో గుస గుసలు నీతో పదనిసలు పాడె వరసే ఇది
అందుకోని తెరచాటు దాటె జవరాలు చాటె వివరాలన్నీ
కాని నిలువెల్ల నాటె కొన గోరు మీటె కొంటె ఆటనీ
ముద్దు పెట్టక నిద్దర పట్టక బిత్తర పోయిన కొమ్మలికి
కోరిన కౌగిలి ఊయల వెయ్యాలి
ఇప్పటికిప్పుడు చెప్పక తప్పిన తప్పని తప్పులు చెయ్యాలి
హద్దులు పద్దులు ఇద్దరి మధ్యన సర్దుకుపోవలి

ప్రియ ప్రియ అంటూ నా మది

ప్రియ ప్రియ అంటూ నా మది
సద నిన్నె పిలుస్తున్నది
దహించు యేకాంతమే సహించలేనన్నది
యుగాల ఈ దూరమే భరించలేనన్నది
విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది

కన్నెళ్ళలొ యెల యీదను
నువ్వె చెప్పు యెదురవని నా తీరమ
నిట్టూర్పుతో ఎల వేగను
నిజం కాని నా స్వప్నమా హా
యెలా దాటాలి ఈ యెడారిని
యెలా చేరాలి నా ఉగాదిని
క్షణం క్షణం నిరీక్షణం
తప్పించవ స్నేహమ
ప్రియ ప్రియ అంటూ నా మది
సద నిన్నె పిలుస్తున్నది

నువ్వు నువ్వు నువ్వే నువ్వు

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నాలోనే నువ్వు
నాతోనే నువ్వు
నా చుట్టు నువ్వు
నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు
నా మెడ వొంపున నువ్వు
నా గుండె మీద నువ్వు
వొళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వు మొగ్గల్లే నువ్వు
ముద్దేసే నువ్వూ
నిద్దరలో నువ్వు పొద్దుల్లో నువ్వు
ప్రతి నిముషం నువ్వూ

నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు
నా సైన్యం నువ్వు
నా పృఇయ శతౄవు నువ్వు నువ్వు
మెత్తని ముల్లె గిల్లె తొలి చినుకె నువ్వు
నచ్చే కష్టం నువ్వు నువ్వు

నా సిగ్గుని దచుకొనె కౌగిలివె నువ్వు
నా వన్ని దోచుకునే కొరికవె నువ్వు
మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్థానివి నువ్వు
తీరని దహం నువ్వు నా మొహం నువ్వు
తప్పని స్నెహం నువ్వు నువ్వు
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వు నువ్వు

మైమరిపిస్తూ నువ్వు
మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరో జన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వు
నా పంతం నువ్వు
నా సొంతం నువ్వు
నా అంతం నువ్వు

చినుకు రవ్వలొ చినుకు రవ్వలొ చినదాని సంబరాన

చినుకు రవ్వలొ చినుకు రవ్వలొ చినదాని సంబరాన
చిలిపి నవ్వులొ చిలిపి నవ్వులొ
పంచ వన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న వన గువ్వలొ
చినుకు రవ్వలొ చినుకు రవ్వలొ చినదాని సంబరాన

ఇన్నాళ్ళకు గుర్తొచాన వాన
ఎన్నాళ్ళని దాకుంటావె పైన
చుట్టంల వస్తావె చూసెళ్ళి పోతావే
అచ్చంగ నాతోనె నిత్యం ఉంటానంటే చెయ్యార చీరదేసుకోన
నువ్వొస్తానంటే నేనొద్దంటాన
నువ్వొస్తానంటే నేనొద్దంటాన

ముద్దులొలికే ముక్కు పుడకై ఉండిపోవె ముత్యపు చినుక
చెవులకు సన్న జూకాల్లాగ చేరుకోవె జిలుగుల చుక్క
చేతికి రంగుల గాజుల్లాగ
కాలికి మువ్వల పట్టిలాగ
మెడలో పచ్చల పతకంలాగ
వదలకు నిగ నిగ నిగలను తొడిగేల

చిన్న నాటి తాలియంల నిన్ను నాలో దాచుకోన
కన్నీటి సోయగంల నన్ను నీలా పొల్చుకోన
పెదవులు పాడె కిల కిల లోన
పదములు ఆడె కదకలి లొన
కనులను తడిపే కలతల లొన
నాలు అణువుల నువు కనిపించేల

నువ్వే కావాలి నీ నవ్వే కావాలి

నువ్వే కావాలి నీ నవ్వే కావాలి
నువ్వే నేను నేనే నువ్వై ఉండాలి
నువ్వే కావాలి నీ ప్రేమే కావాలి
తోడు నీడ నువ్వై ఉండాలి
నీ కోసమే వెతికా
నీ ఊహతో బ్రతికా
నీ రాక నిజమేనా

ఆశ నువ్వే నా స్వాస నువ్వే
నా ఊహ నువ్వే జీవం నువ్వే ప్రేమ నువ్వే
ప్రాయం నువ్వే నా ప్రాణం నువ్వే
నా గమ్యం నువ్వే దైవం నువ్వే అన్ని నువ్వే
అందమైన బంధమై అల్లుకుంటాలే
హత్తుకోవే ముద్దుగా ప్రేమ వీణా
తొలి కౌగిలే సాక్షిగా

ప్రేమే దైవం ప్రేమేగా లోకం ప్రేమేగా ప్రాణం
ప్రేమే సర్వం యేనాటికి
నువ్వే దైవం నువ్వే నా లోకం నువ్వే నా ప్రాణం
నువ్వే సర్వం నా ప్రేమకి
గుండెల్లోనే నిన్ను నే దాచుకొన్నాలే
కంటిలోన పాపల్లే చూసుకోనా
మన ఊపిరే ప్రేమ గా

నేను నేనుగ లేనే నిన్న మొన్న లా

నేను నేనుగ లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

పూల చెట్టు ఊగినట్టూ పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు ఓ చిరు నవ్వు
తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో యెవరేనువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన
మీకేవరికి కనిపించదు ఏమైనా...ఓ

చుట్టుపక్కలెందరున్న గుర్తు పట్టలేక వున్న
అంత మంది ఒక్కలాగే కనబడతుంటే
తప్పు నాది కాదన్న ఒప్పుకోరు ఒక్కరైన
చెప్పలేది నిజం ఏదో నాకు వింతే
కళ్ళ నొదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే..ఓ

నా మనసునె నీదటే నేస్తమా

నా మనసునె నీదటే నేస్తమా
నా దారిలో చేరకే చైత్రమా
సరదాల చిలిపితనమా చిరునవ్వులోని స్వరమా
నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమ

నాకెందుకిలా ఔతోంది చెప్పవా ఒక్కసారి
నీ వెంటపడె ఆశలకి చూపవ పూల దారి
చినుకల్లె చేరి వరదల్లె మారి ముంచేస్తె తేలేదెలాగ
తడి జాడలేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగ
లేనిపోని సయ్యాటతో వెంటాడకె ప్రేమ
నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవిచే తెలుపనీ మధురిమ

నీ వూహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను
నీ వూపిరితో అల్లుకుని పులకరిస్తోంది నిన్ను
అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా
కిరణాలు పడని తెర చాటులోని ఏకాంతమే వదులుకోవా
నువ్వు నేను మరిచేంతలా మురిపించకే ప్రేమా
నీ కనులలో వెలగని ప్రియతమా నీ పెదవిచే తెలుపనీ మధురిమ

మెల్లగ కరగని రెండు మనసుల దూరం

మెల్లగ కరగని రెండు మనసుల దూరం
చల్లగ తెరవని కొంటె తలపుల ధ్వారం
వలపు వాన గారాలే పంపుతున్నది ఆకసం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం
తడిపె తడికి తనతో నడిపి హరివిల్లుని వంతెన వేసిన శుభవేలా
ఈ వర్షం సాక్షిగ తెలపని నువు నాకె సొంతం
ఈ వర్షం సాక్షిగ కలపని బంధం

నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్న
ఈ తొలకరిలో తల తల నాట్యం నీదేన
ఆ ఉరుములు లోన నీ పిలుపులు వింటున్న
ఈ చిట పటలో చిటికెల తాళం నీదేన
మతి చెడే దాహమై అనుసరించి వస్తున్న
జత పడే స్నేహమై అనునయించన
చలి పిడుగుల సడి విని జడిసిన బిడియం తడబడి నిన్ను విడదా

ఈ పెనుమరుగైన ఈ చొరవను ఆపేన
నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్న
యే చిరు చినుకైన నీ సిరులను చూపేన
ఆ వరుణికె రునపడిపోన ఈ పైన
త్వరపడె వయసునే నిలుపలేను ఇకపైన
విడుదలే వద్దని ముద్దులెయ్యనా
మన కలయిక చెదరని చెలిమి రుజువని చెరితలు చదివేలా

కోపమ నాపైన ఆపవ ఇకనైన

కోపమ నాపైన ఆపవ ఇకనైన
అంతగ బుస కొడుతుంటె నేను తాళగలన
చాలులె నీ నటన సాగవే ఇటు పైన
ఎంతగ నస పెడుతునా లొంగి పోనె లలనా
దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైన
మన దారులు ఎప్పటికైన కలిసేనా

ఓ కస్సుమని ఖారం గ కసిరినది చాలింక
ఉరుము వెనక చినుకు తడిగా కరగవ కనికారంగ
కుదుర్గ కడ దాక కలిసి అడుగెయ్యవు గా
కన్నుల వెనకె కరిగిపోయె కలవి గనుకా
నను గొడుగై కాసె నువ్వు పిడుగులు కురిపిస్తావు
నువు గొడుగున ఎగరేస్తావె జడివాన హో

తిరిగి నిను నాదకా చేర్చినది చెలిమే గా
మనసులోని చెలియ బొమ్మ చెరిపిన చెరగదు గనుక
సులువు గ నీలగ మర్చిపోలేదింక మనసు విలువ
నాకు బాగ తెలుసు గనక
యెగసె అల యేనాడైన తన కదలిని విడిచేనా
వొదిలేస్తె తిరిగొచ్చేన క్షణమైనా హో

గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది

గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఎమౌనో నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హౄదయం నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే
కలవరమో తుదివరమో తీయని కరుణం ఇది
గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది
పెదవుల్లో ఎమౌనో నీ పేరే పిలుస్తొంది
మనస మనస మనస మనస మనస మనస
ఓ మనస ఓ మనస

పూవులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడౌను విని
నిన్నిలా చూసి పయనించి వెన్నెలె చిన్నబోతోంది
కన్నులే తాకి కలలన్ని నిదురగా వచ్చి నట్టుంది
ఏమో ఇదంతా నిజంగ నిజంగా కలలాగె ఉంది

ఎందుకో తెలియనీ కంగారు పడుతున్నదీ
యెక్కడ జరగనీ ఇంకేమికాదే ఇది
పరిమళం వెంట పయనించి పరుగు తడబాటు పదుతోంది
పరిణయం దాక నడిపించి పరిచయం తోడు కోరింది
దూరం తలోంచె ముహూర్తం ఇంకెపుడొస్తుంది

గోవింద గోవింద నుదుటి రాతను మర్చేవాడా

గోవింద గోవింద గోవింద గోవింద


నుదుటి రాతను మర్చేవాడా
ఉచిత సేవలు చేసే వాదా
లంచమడ్గని ఊ మంచి వాడా
లోకమంతా యేలే వాడా
స్వర్ధమంటూ లేని వాడా
బాధలన్ని తీర్చే వాడా
కొర్కెలే నెరవేర్చే వాడా
నాకు నువ్వే తోడు నీడా

గోవింద గోవింద బాగు చెయి నను గోవింద
jubliee hills లొ banglow ఇవ్వు లేనిచో hi-tech city ఇవ్వు
hijack అవ్వని flight ఒకటివ్వు వెంట తిరిగే సతెల్లితె ఇవ్వు
పనికి రాని చవటలకిచ్చి పరమ బేవార్సగాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయరా మెచ్చి

గోవింద గోవింద బాగు చెయి నను గోవింద
గోవింద గోవింద పైకితే నను గోవింద

petrol అడగని car ఇవ్వు bill ఇవ్వని bar ఇవ్వు
కోరినంత food పెట్టి డబ్బులడగని hotel ఇవ్వు
assembly లొ speaker postoo రాజ్య సభలో MP seato
పట్టుబడని match fixing scamలొ సంపాదనివ్వు
ఓటమెరుగని raceలివ్వు loss రాని shareలివ్వు
single number lotteryలివ్వు taxలడగని ఆస్తులివ్వు
పనికి రాని చవటలకిచ్చి పరమ బేవార్సగాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయరా మెచ్చి

వంద noteల total ఇవ్వు gold నిధుల కోటలివ్వు
లేకపోతే వేయి టన్నుల కొహినూర్ diamonds ఇవ్వు
mass hero చంచెలివ్వు hit cinema storyలివ్వు
slimm ఉన్న సొమ్ములున్న heroine wife గ ఇవ్వు
hollywood లొ studioనివ్వు swiss bank లొ billionలివ్వు
కోట్లు తెచ్చే కొడుకులనివ్వు hero అయ్యే మనవళ్ళనివ్వు
నన్ను కూడా CM చెయ్యి లేకపోతే PM చెయ్యి
తెలుగు తెరపై తిరుగు లేని తరిగిపోని lifeనియ్యి

గోవింద గోవింద బాగు చెయి నను గోవింద
గోవింద గోవింద పైకితే నను గోవింద

luck మార్చి నను కరుణిస్తే తిరపతొస్తా త్వరగా చూస్తే
యేడు కొండలు AC చేస్తా eigth wonder నీ గుడి చేస్తా

ఒరేయ్ వద్దురా సోదరా..అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా

ఆ శభాష్
సగమపా నీ ప మప గా రీ స నీ ప మ ప నీ సా
ఒరేయ్ వద్దురా సోదరా..అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్
వద్దురా వద్దు వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా
చెడిపోవద్దు బ్రహ్మచారి..పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనె భద్రకాళి
కల్యాణమే ఖైదురా..జన్మంత విడుదల లేదురా
నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలే నీ తొందరా
Don't marry be happy don't marry be happy

శివ అని నా close friend love లొ పడి పెళ్ళి చేసుకున్నాడు
collegeలొ వాడు గ్రీక్ వీరుడు marriage కాక ముందు రాకుమారుడు
అంతా జరిగి just one month కాలేదు ఎంత మారిపోయాడు గుర్తు పట్టలేనట్టు
బక్క చిక్కి పోయి, మంచి లూక్ పోయి face పాలి పోయి జుట్టు రాలి పోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటె తను దేవి దాసు కావడం వల్ల అంటు
గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందు కొట్టి flash back చెప్పాడు
పొద్దున్న లేస్తూనె తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే తనకి i love you చెప్పాలి
యేం కోరిన తక్షనం తీర్చాలిరా ఆ వరం
ప్రతి సామయిందిరా కాపురం పెళ్ళి క్షేమించలేని నేరం

అంతెందుకు మా మల్లి గాడు మా వూళ్ళో వాడంతటోడు లేడు
మాములుగానే వాడు దేశ ముదురు
పెళ్ళితోటె పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటిపోరు చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్క పూట కూడ ఉండదనుకుంట
కస్సుమనకుండ బుర్ర తినకుండ
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండ వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట
కోడె నాగు లాంటి వాడ్ని వాన పాము జేసింది
ఆలి కాదు రా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తి యోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం
సంసారమే వస్తె అని ఇక సన్యాసమే best అని
కాషాయమే కట్టాడురా కట్టి కాశి కి పోయాడురా

చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం

చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం
చూపులతోనే తీయొద్దే నా ప్రాణం
బవ బవ బంగారం అతిగ నాంచకు యెవ్వారం
ఈ పూటైన తీర్చేయ్వా నా భారం
ఓ చెలి అరె అల ఉడికించకె కధె ఇలా
చాటు గ అది ఇది మరియాద
రా ప్రియ అదేంతల అరితాకుల మరి అలా గాలి వాటుకె
ఇల భయమేల

సోకులను ఆరేసి నా మధికి వల వేసి లాగకిక వన్నెల వయ్యరి
కోరికలు రాజేసి అబ్బ నన్ను ఒదిలేసి నాకు ఇక తప్పదు గోదారి
ముగ్గుల్లో దించొద్దు మున్నీట ముంచొద్దు అమ్మమ్మ నిన్నింక నమ్మేదెలా
ముద్దుల్లో ముంచెత్తు నా మొక్కు చెల్లించు ముద్దయి ల నువ్వు కూచోకల
వగలె వస్తావు వాటెసుకొంటవు చిపాడు సిగ్గంటో లేదే ఎలా
దూరంగ ఉంటూనె నన్నల్లు కొంటావు ఈ మాయ చెప్పేదెలా

మాటలతో మురిపించి మల్లెలతో చలి పెంచి పెట్టకిక నాతో ఈ పేచి
కాముడికి కసి రెచ్చి కౌగిలి కి సేగలిచ్చి ఆడెనట మనతో దోబూచి
అబబ్బ అబ్బై జుబ్బల బుజాయి ఎన్నెన్ని పాఠాలు నెర్పాలిల
అందాల అమ్మై మోగిస్త సన్నై అందాక హద్దుల్లో ఉండాలిలా
కల్లోకి వస్తావు కంగారు పెడతావు నాకర్ధమే కాదు నీ వలకం
ఒళ్ళోనె ఉంటెను ఊరంత చూస్తవు అయగ నీలొ సగం

అందమైన భామలు లేత మెరుపు తీగలు

o baby just give me love
o baby i want it now
అందమైన భామలు లేత మెరుపు తీగలు
ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు
are silk చుడిదారులు కాజీవరం చీరలు
రెచ్చగొట్టి రేపుతున్నయ్ వెచ్చని మోహాలు
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే
అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే

o baby just give me love
o baby just take it now
అరె నువ్వేనా నా కల్లోకొచ్చింది
నా మనసంతా తెగ అల్లరి చేసింది
ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్యనా
నా కమ్మని కౌగిట్లో నిను బంధించేసెయ్యెనా
అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసెయ్యెనా
హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా

o baby just give me love
o baby just take it now
o baby i want it now
o baby take it right now
కల్యాణి నచ్చిందే నీ బోణి నీ తోడె కోరిందే జవాని
బుగ్గలకి వేసెయనా గాలాన్ని నీ ఒంపుల సొంపులకి ఒక మన్మధ బాణాన్ని
అరె ఎన్నొ ఎన్నొ అందాలున్న ఈ లోకంలో చూడాలి
అన్నిట్లోకి నువ్వే మిన్న కదె సుకుమారి

అందాల చుక్కల లేడి నా తీపి చెక్కరకేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా

హే! అందాల చుక్కల లేడి నా తీపి చెక్కరకేళి ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా
జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లుచ్క్య్గా రైల్లో కలిసిందా
శని దోషం పొగట్టే తన సుందర దరహాసం
కురిపిస్తే చెయిస్తా గుళ్ళో అభిషేకం
తన మౌనం అయిపొతే త్వరలో అంగీకారం
తిరుపతి లొ పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
I LOVE U ఓ శ్రావణి నా కొసం నువ్వు పుట్టావని
I LOVE U ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని

హె! ముత్యం లాంటి ని నవ్వు మొత్తం అంత నాకివ్వు
బంగారం తో చెయిస్తా జడ పువ్వూ
నిగ నిగ మెరిసే ని తనువు సొగసరి కానుక నాకివ్వూ
పువ్వులతోనే పూజిస్తా అణువణువు
అరే! శీతాకాలం మంచులొనే వళ్ళంటుందే జివ్వు
ఎనడాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దువ్వు
అరే! వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లొవె
అరే కాలలాన్ని కరిగేలా ని కౌగిలి వరమివ్వు
I LOVE U ఓ శ్రావణి నా కొసం నువ్వు పుట్టావని
I LOVE U ఓ శ్రావణి నా తోనే నువ్వు ఉంటావని

స్వర్గంలోనే పెళ్ళిళ్ళూ అవుతాయంటూ పెద్దొళ్ళూ
చెప్పినా మాటే వినివుంటే ని చెవ్వూ
ముగ్గులు పెట్టే వాకిళ్ళూ ముంగిట వేసి పందిళ్ళూ
అందరికింక శుభలేఖలనే పంచివ్వూ
రేపంటు మరి మాపంటు ఇక పెట్టోద్దే గడువూ
నూరేళ్ళూ నిను పరిపాలించే పదవే రాసివ్వూ
మొత్తం నీపై పెట్టేసానే నా ఆశల బరువూ
గట్టే నన్ను ఎక్కిస్తానని హామి నాకిఉవూ

ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె

ఆకాశం తన రెక్కలతొ నన్ను కప్పుతు ఉంటె
భూలోకం నన్ను నిద్దురపుచ్చలి
జాబిల్లి తన ఈ వెన్నెలతో నను నిద్దుర లేపి
రేయంత తెగ అల్లరి చెయ్యాలి
యేవేవొ కొన్ని కలలు ఉన్నయి అవి రేపో మాపో నిజమవ్వాలి
గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకం లోన చీకటినంత తరిమెయ్యాలి

అరారొ అని ఈ గాలి నాకే జోలలు పాడాలి
యెలేలొ అని గోదారి నాతొ ఊసులు ఆడలి
ఇంధ్ర ధనసుని ఊయల గ నేను మలచాలి
తారలన్ని నాకు హారము కావలి
మబ్బు నుండి జరు జల్లులలో నేను తడవాలి
చందమామ నాకు చందనమవ్వాలి
రంగులతో కల్లాపె చల్లాలి ఆ రంగుల నుండి లాలించె
ఒక రాగం పుట్టాలి

నా వాడు ఎక్కడున్న సరె రారాజల్లె నను చేరుకోవాలి
నా తోడంటు యెన్నడైన సరె పసి పాప్పల్లె నను చూసుకోవాలి
అమ్మలోన ఉన కమ్మదనం వెన్నలోన కలిపి
నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి
ప్రేమ లోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి
చిన తప్పు చేస్తె నన్ను తీయగ తిట్టాలి
యేనాడు నా నీడై ఉండాలి
ఆ నీడను చూసి ఊటములన్ని పారిపోవాలి

అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం

అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం

అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం
ఉ అంటె ఉంగపురం
ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గలం ఏస్తే వాలుతారు కుర్ర కులం
పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో
యానాము చెరినా ఈనాము మారున friendship పిడేలు ఆగునా హై
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు

హేయ్ గాజువాక చేరినక మోజు పడ్డ కుర్ర మూక
నన్ను అడ్డకాగి చంపినారురో
కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపి లోకి దింపకుంటరా ఆ
రాజనిమ్మా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో

హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ సొంత మేనమామా వాటం అందుకో
రేనిగుంట రాణి మంట
బిట్రగుట్ట దేవి మంట
నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలు నాపుకో
ఒంటి లోన సెట్టు పుట్టెరో చిన్నడో
ఒంటి పూస తేలు కుట్టెరో
నేనాడధన్ని రో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో

తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్రబోట్టు

తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్రబోట్టు
తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్రబోట్టు
పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా
ఏదో కబురు పట్టుకోచ్చింది క్రిష్ణమ్మా
ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా
ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా
మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు
మల్లె పూలు పట్టు చీర ఎర్రగాజులు
పట్టుకోని వచ్చాడు కిష్టప్పా
మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా
ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య
ఆ గుబులేమిటయ్య ఈ ఉరుకేమిటయ్య

జాంపండు చూస్తే కోరకబుద్ది
లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి
జాంపండు చూస్తే కోరకబుద్ది
లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి
జాబిల్లిని చూస్తుంటే చూడబుద్ది
ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ది
ఎందుకీ పాడబుద్ది అందుకే తన్నబుద్ది
బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది
వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది
బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది
వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది

మల్లె

ఆకాశం చూస్తే మబ్బులెయ్య
పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య హోయ్..హోయ్
ఆకాశం చూస్తే మబ్బులెయ్య
హోయ్ పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య హోయ్..హోయ్
నీ మాటలన్ని వింటుంటే సిగ్గులెయ్య
సిగ్గులన్ని కైపెక్కి మొగ్గలెయ్య
ఎందుకీ గోడవలయ్యా పిచ్చి మనసు రామయ్య
మనసు పిచ్చిదేపిల్ల ప్రేమ గుడ్డిది
ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది
మనసు పిచ్చిదేపిల్ల ప్రేమ గుడ్డిది
ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది

తెల్ల

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా

తెల్లరబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళర చూదామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడ నా సందమావ రాడే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె

కొండల్లొ కోనల్లో కోయన్న వాకాయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న వో తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లార దిక్కులు దాటి వాడెన్నళ్ళకొస్తాడో

సిరిమల్లె

పుట్టింటోళ్ళు తరిమేసారు చు చు చు చు

పుట్టింటోళ్ళు తరిమేసారు చు చు చు చు
కట్టుకున్నోడు వదిలేసాడు చు చు చు చు
అయ్యో పుట్టింటోళ్ళు తరిమేసారు కట్టుకున్నోడు వదిలేసాడు
పట్టుమని పదారేళ్ళురా నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళురా
అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ
అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ
పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టు కధలు చెప్పమాకులే
పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టు కధలు చెప్పమాకులే
పుట్టింటోళ్ళు తరిమేసారు అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు టింగురంగా బంగారమ్మ

హా గడపదాటిననాడె కడప చేరాను
తలకపోసిన్నాడే తలుపు తీసాను
వలపులన్ని కలిపి వంట చేసుంచాను
ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను వడ్డించుకుంటాను
అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను
ఓయబ్బో అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను ముద్దుకైనా ముట్టుకోను
పుట్టింటోళ్ళు తరిమేసారు అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు టింగురంగా బంగారమ్మ

గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను
రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను
తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను
నీ మీద ఒట్టు నువ్వే అ..నువ్వే మొగుడనుకుంటాను
నువ్వే మొగుడనుకుంటాను
అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం
అహహ అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం
అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ

పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ

పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా లేత పచ్చ కోనసీమ ఎండల్లా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
పంట చేలో పాలకంకి నవ్విందీ పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ

శివ గంగ తిరణాళ్ళలో నెలవంక సానాలు చెయ్యాలా
చిలకమ్మ పిడికల్లతో గొరవంక గుడి గంట కొట్టాలా
నువ్వు కంటి సైగ చెయ్యాలా ...నే కొండ పిండికొట్టాలా
మల్లి నవ్వే మల్లేపువ్వు కావాలా మల్లి నవ్వే మల్లేపువ్వు కావాలా
ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా

గోదారి పరవళ్ళలో మా పైరు బంగారు పండాలా
ఈ కుప్ప నూర్పిళ్ళకూ మా ఇళ్ళు వాకిళ్ళు నిండాలా
నీ మాట బాట కావాల నా పాట ఊరు దాటాల
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాల
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాల
ఆ పొద్దులో మా పల్లే నిద్దుర లేవాలా

పందొమ్మిది వందల యెనభై వరకు

పందొమ్మిది వందల యెనభై వరకు
ఇట్టాంటి ఒక పిల్ల నా కంట పడలేదు
పడినా నే వెంటపడలేదు ఓ బంగారక్కా చూపే శ్రుంగారక్కా
ఓ బంగారక్కా చూపే శ్రుంగారక్కా
పందొమ్మిది వందల యెనభై వరకు
ఇట్టాంటి కుర్రోడు నా కంట పడలేదు
పడినా నే వెంటపడలేదు ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా
ఓ అందాలయ్యా చూపే దండాలయ్యా

ఆరేళ్ళ ముందు చూస్తే చిన్న పిల్ల పదహారేళ్ళ వయసునాడు కుర్ర పిల్ల
ఆరేళ్ళ ముందు చూస్తే చిన్న పిల్ల పదహారేళ్ళ వయసునాడు కుర్ర పిల్ల
ఏడు పెరుగుతుంటే ఈడు పెరుగుతుంది ఈడు పెరుగుతుంటే జోడు కుదురుతుంది
ప్రేమకు ఈడెందుకు పెళ్ళికి ప్రేమెందుకు
ప్రేమకు పెళ్ళి తోడు పెళ్ళికి ప్రేమ తోడు
అమ్మ తోడు అయ్యతోడు నీకు నాకు ఈడు జోడు
హోయ్..హోయ్..

మొదటిసారి చూసినపుడు అగ్గి రాముడు మరి మూడేళ్ళ ముందు చూస్తే అడవి రాముడు
మొదటిసారి చూసినపుడు అగ్గి రాముడు మరి మూడేళ్ళ ముందు చూస్తే అడవి రాముడు
జోడు పెరుగుతుంటే వయసు తరుముతుంది వయసు తరుముతుంటే సోకు పెరుగుతుంది
మనసుకు సోకెందుకు వయసుకి మనసెందుకు
మనిషికి మనసు అందం మన్సుకి ప్రేమ బంధం
ఈ అంధం ఆ బంధం ఇద్దరి వివాహ బంధం
హోయ్..

ఒక ఉదయంలో నా హ్రుదయంలో

ఒక ఉదయంలో నా హ్రుదయంలో
ఒక ఉదయంలో నా హ్రుదయంలో
విరిసిన మందారం మెరిసిన సింధూరం
విరిసిన మందారం మెరిసిన సింధూరం
కల్పన అది ఒక కల్పన అది నా కల్పన

ఒక

తార తారకి నడుమ ఆకాషం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశము ఎందుకో
తార తారకి నడుమ ఆకాషం ఎందుకో
పాట పాటకి నడుమ ఆవేశము ఎందుకో
మనిషి మనిషికి మద్య మనసనేది ఎందుకో
మనసే గుడిగా మనిషికి ముడిగా మమత ఎందుకో మమత ఎందుకో
తెలియని ఆవేదనే ఆలాపనా
తెలుసుకున్న వేదనే కల్పనా

ఒక

దివ్వె దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే
దివ్వ దివ్వెలో వెలుగు నీ రూపం పొందితే
పువ్వు పువ్వునా మధువు నీ కోసం పొంగితే
కవి మనస్సులొ ఉషస్సులు కారు చీకటౌతుంటే
మిగిలిన కఢలో పగిలిన ఎదలో
ఈ కవితలెందుకో కవితలెందుకో
తెలియని ఆవేదనే ఆలాపనా
తెలుసుకున్న వేదనే కల్పనా

ఒక

ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా

ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి
పందిరేసి చిందులేసిందా
ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల చిచ్చురేపి
రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా

గాలికురక కన్నెపిల్ల కన్ను చెదిరిందా
మూరతక్కువ చీర నీకు నిలవనంటుందా
పక్కపలక ఉడుకు నీలో అలిసిపోయిందా
ముట్టుకుంటె ముద్దులయ్యె పట్టుకుంటె జారిపోయె
సిగ్గు వలపు మొగ్గలేసిందా

రంగు తేలి గిత్త పొగరు రంకె వేసిందా
గంగడోలు తాకితేనే కాలు చూపిందా
కోడె వయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా
పట్ట పగలే చుక్క పొడిచె పంటచేను
గట్టు మీద బంతిపూల పక్కవేసిందా

పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు
చల్లకొచ్చి ముంత ఎందుకు దచుకుంటావు
వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు
ఆరుబయట అందమంత ఆరబోసి కస్సుమంటు
కన్నెమోజు కట్టు తప్పిందా

జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా

జాబిలితో చెప్పనా
జాబిలితో చెప్పనా
జాము రాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా
జాబిలితో చెప్పనా
జాబిలితో చెప్పనా
జాము రాతిరి కలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా

తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు
తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు
చూపులలో చలి చుర చురలూ ఆ చలి తీరని విర విరలూ
అన్ని ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా ఆ చెప్పనా ఆ చెప్పనా చెప్పనా

గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు
గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు
కౌగిట సాగని పున్నములూ వెన్నెల వీణల సరిగమలూ
పేరంటానికి రమ్మంటే పెళ్ళికి పెద్దవు నీవే లెమ్మని
చెప్పనా చెప్పనా ఆ చెప్పనా చెప్పనా

గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను

గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను
ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు
సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు

కమ్మని పాట చక్కని ఆట కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు
కసి కసిగా హా కొందరు నన్ను పాడమంటారు పచ్చిగ ఆడమంటారు
నచ్చారంటె జై కొడతారు నచ్చకపోతే చీ కొడతారు
పిచ్చి పిచ్చిగా పైపడతారు దుమ్ము కాస్తా దులిపేస్తారు
పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
ఓ యబ్బో పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
చిత్తూరు పుట్టూరు ఎన్నెన్నో చూసాను

బందరులోనా అందరిలోనా రంభవి అన్నాడు ఒకడు రావే అన్నాడు
వైజాకు బాబు చేసాడు డాబు రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు
కాకినాడలో గల్లంతాయె తిరపతి లోనా పరపతి పోయే
అన్రై మెప్పు పొందాలంటె దేవుడైకైన తరం కాదు
ఆ యముడికైనా తరం కాదు
గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
అమ్మమ్మో గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను
ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే
ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తింది
గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే
ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెత్తింది

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే
అహ అహ అహాహ
చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే
అహ అహ అహ అహ
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే
నీ మాట విని మబ్బు మెరిసి అహ జడివానలే కురిసి కురిసి
వళ్ళు తడిసి వెల్లి విరిసి వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ అహ ఆహ

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
అహ అహ అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
అహ అహ అహా అహ
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
అహ నీ పాట విని మెరుపులొచ్చి
అహ నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి చెలిమి పంచి తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ అహ ఆహ

కుశలమా నీకు కుశలమేనా

కుశలమా నీకు కుశలమేనా
మనసు నిలుపుకోలేకా మరి మరి అడిగానుఇ అంతే అంతే అంతే
కుశలమా నీకు కుశలమేనా
ఇన్నినాళ్ళు వదలలేకా ఎదో ఎదో వ్రాసాను అంతే అంతే అంతే

చిన్నతల్లి ఏమందీ
నాన్న ముద్దు కావాలంది
పాలు గారు చెక్కిలిపైన పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవుల పైన దేవిగారికొకటి
ఒకటేనా ఒకటేనా
హహ ఎన్నైనా హాయ్ ఎన్నెన్నో
మనసు నిలుపుకోలేక మరి మరి
అడిగాను అంతే అంతే అంతే

పెరటిలోని పూల పానుపు
త్వర త్వరగా రమ్మంది
పొగడ నీడ పొదరిల్లు
దిగులు దిగులుగా ఉంది
ఎన్ని కబురులొచ్చేనో ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కల పైన నీలి మబ్బు పాయలపైనా
అందేనా ఒకటైనా
అందెనులే తొందర తెలిసెనులే

నిలువవే వాలు కనులదానా - వయ్యారి హంస నడకదానా

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె జాణ
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు

నిలువవే

ఎవరని యెంచుకోనినావో పరుడని భ్రాంతి పడినావో
ఎవరని యెంచుకోనినావో పరుడని భ్రాంతి పడినావో సిగ్గుపడి తోలగేవో
విరహగ్నిలో నన్ను త్రోసి పోయేవో
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు

నిలువవే

ఒకసారి నన్నుచూడరాదా చెంతచేర సమయం ఇదికాద
ఒకసారి నన్నుచూడరాదా సమయం ఇదికాద చాలునీ మరియాద
వగలాడినే నీ వాడనేకాద
నువ్వు కులుకుతు ఘలఘల నడుస్తువుంటే
నిలువదె నా మనసు..ఓ లలనా..అదినీకే తెలుసు

నిలువవే

మగడంటే మోజులేనిదానా మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజులేనిదానా నీకు నేను లేనా కోపమా నా పైనా
నీ నోటిమాటకు నోచుకోలేనా

నిలువవే
ఓ లలన..ఓ చెలియా..ఓ మగువా..అది నీకే తెలుసు

జో లాలి జో లాలి లాలి నా చిట్టి తల్లి లాలి నను గన్న తల్లి

జో లాలి జో లాలి లాలి నా చిట్టి తల్లి లాలి నను గన్న తల్లి
లాలి బంగారు తల్లి లాలి నా కల్పవల్లి

జో లాలి

చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగా చూడలేను
చిరు నవ్వు కిరణాలు చిందించు మోము
కన్నీరు మున్నీరుగా చూడలేను
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని
నిను గన్న నీ తల్లి కనుమూసె గాని
నిను వీడి క్షణమైన నేనుండ గలనా
నిను వీడి క్షణమైన నేనుండ గలనా

జో లాలి

రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను
రతనాల భవనాల నిన్నుంచలేను
ముత్యాల ఉయ్యాలలూగించలేను
కనుపాపల నిన్ను కాపాడు కోనా
కనుపాపల నిన్ను కాపాడు కోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా
నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా

జో లాలి

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు
ఒకటైతే మిగిలేది తెలుపేనండి
నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం
నా కోసం మీ ఇష్టం వదలొద్దండి
మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపొండికా
ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా

నేనంటు ప్రత్యేకం నాదంటు ఓ లోకం
పడలేను ఏ జోక్యం అంతేనండి
బాగుంది మీ Taste నాకెంతో నచ్చేట్టు
మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు
అందుకే నే దిగి వచ్చా
వంచని నా తల వంచా స్నేహ భావమా
కలా నిజం నీ కొసమే అనుక్షణం ఉల్లాసమే

ఏనాటికి మనమొకటే నని - ఏ చీకటి ఇటు రాలేదని

ఏనాటికి మనమొకటే నని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగ అనుకున్నా మని
తెలిసిందిలే కల గన్నా మని
కన్నీరు జోరైయింది
ఆ నీరు యేరైంది
నువు లేక సంతోషమా
వాకిట్లో వాసంతాలు
ఆ నాటి సాయంత్రాలు నువు లేక శూన్యం సుమా
నాతోనే నువు ఉంటానని
ఆ రోజే నువు అన్నవని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా

నీ కోసమే మిగిలున్నానిల
నువు రాక నేనింక ఎనాళ్ళిల
నా గుండెలో నీ ఆలోచన
నా కంటి పాపలో ఆవేదన
ఇది మౌన రాగల సంకీర్తన
ఇలా చూడు ఏ వైపు అడుగేసినా
నీలోనే సగమునానని
నీ కోసం మిగీలునానని
ఏలా నీకు తెలిపేది ఓ నేస్తమా

మరుపన్నది ఇటు రాదే ఎలా
నా మనసుకేమైంది లోలోపల
వలపన్నది చెలరేగే అలా
ఎదలోన దాగుండిపోతే ఎలా
జడివానల వచ్చి తడిపేయవ్వ
ప్రియ అంటూ ప్రేమర పిలిచెయవ్వ
నీ వైపే యెద లాగిందని
నీ చూపె అది కోరిందని
చెలి నీకు తెలిసాక చెలగటమ

వెన్నెల్లొ హాయి హాయి మల్లెల్లొ హాయి హాయి

హాయి హాయి హాయి హాయి
వెన్నెల్లొ హాయి హాయి మల్లెల్లొ హాయి హాయి
వరాల జల్లే కురిసే
తప్పెట్లు హాయి హాయి త్రుంపెత్లు హాయి హాయి
ఇవ్వాళ మనసే మురిసే
may నెల్లో ఎండ హాయి august లో వాన హాయి
january లో మంచు హాయి హాయి రామ హాయి
హాయిగుంటె చాలు నండి వెయ్యి మాటలెందుకండి

కనుల ఎదుట కలల ఫలము నిలిచిన్నది తందానా సుధ చిందేనా
కనులు గనని వనిత ఎవరొ మనకు ఇక తెలిసేనా మది మురిసేనా
తనను ఇక ఎల్లగైన కళ్ళారానే చూడాలి
పగలు మరి కల్లోనైన ఎల్లోరాతొ ఆడాలి
మధుర లలన మదన కొలన కమల వదన అమల సదన
వదలతరమ మదికివశమా చిలిపితనమా
చిత్రమైన బంధమాయె అంతలోన అంతులేని చింతన అంతమంటు వున్నదేనా

గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి
మదిని బరువు పెంచుకుంటు ఎవరికెం చెప్పాలి ఏం చెయ్యాలి
అసలు తను ఎల్లా వుందొ ఎంచేస్తుందో ఏమొలే
special మనిషయినా కూడా మనకేముంది మామూలే
కళలు తెలుసా ప్రేమ బహుశ కవిత మనిషా కలల హంస
మనసు కుంచెం తెలుసుకుంది కలిసిపొయే మనిషి లాగ
మంచి పద్దతంటు వుంది మదిని లాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది

స్వరాల వీణ ఈ వేలలోన నీకేమైయిందే ఆకశమా

స్వరాల వీణ ఈ వేలలోన నీకేమైయిందే ఆకశమా
స్వరాల వీణ ఈ వేలలోన నీకేమైయిందే ఆకశమా
ఎండలో ఇలా పూల వాన లా
మెరుపు కూడ మల్లె తీగలా
నేలపై ఇల నా అడుగు నిలవద
లొకమంత కొత్త చోటు లా
నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు యెవరు నమ్మవ

రేయ్యి చీర కప్పుకున్న చందమామని
నిన్ను చూసి ఒక్కసారి పలకరించి వెళ్ళనీ
తారలన్ని అల్లుకున మెఘమాలని
వాలు కళ్ళ సాగరాన కాటుకల్లె మారని
వాలె పొద్దులా జారె నీ జడ నడుము పై నాట్యమె ఆడితే
విరిసె పువ్వుల కురిసె మంచుల
నువ్వల చల్లగ నవ్వితె
నేను చూడలెను చూసక ఆగలేను
ఎన్నాళ్ళు నిన్ను ఒదిలి ఉండను

మూసి ఉన్న రెప్పలలో కలల వనములా
నిదుర రాని వేలలోన కలవరింతల ఇలా
ఊపిరంత ఊహలతొ నిండిపోయినా
గుండె లోన నిన్ను ఇంక దాచి ఉంచడం ఎలా
నేనె నేనుగ లేనె లేనుగ
నాకే వింతగ ఉందిగ
నీల ఎవరు నన్నె ఎపుడు కమ్ముకోలేదులే ఇంతలా
రెయ్యి నిద్దుర రాదు
పగలంత కునుకు లేదు
ఆసలేమైందో నాకే తెలియదు

రామ రామ రామా నీలి మేఘశ్యామ

రామ రామ రామా నీలి మేఘశ్యామ
రామ రామ రామా నీలి మేఘశ్యామ
రావ రఘుకుల సోమా
బధ్రాచల శ్రీరామ
మా మనసు విరబూసే
ప్రతి సుమగానం నీకేలే
కరుణించి కురిపించే

నీ ప్రతి దీవెన మాకేలే
నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేల
రెప్పలు మూయక కొలిచం కన్నుల యెదుటకు రావేల
రామ రామ
రామ రామ రామా నీలి మేఘశ్యామ
రామ రఘుకుల సోమా బధ్రాచల శ్రీరామ

పొగడమాకు అతిగ చేసెయ్యమాకు పొగడపూల లతగా

పొగడమాకు అతిగ చేసెయ్యమాకు పొగడపూల లతగా
రాసినావు చాలా ఆ రాతలంత నేను ఎదిగిపోల
నువ్వనే వచ్చింది నా నొట చనువుగ
పిలుపులో తడబాటు ఆ మాట పలుకగ
తెలుసుకుంటి పొరపాటు

నువ్వు అంటు పిలుపు నాకెంతొ నువ్వు దగ్గరైన తలపు
పరిచయాల మలుపు దాచేసుకున్న మాటలన్ని తెలుపు
చిగురులే వేసేను ఈ కొమ్మ హొయలుగ
పువ్వులై పూసేను ఈ జాబు చదవగ
ఊహలేవొ ఉదయించే

పిలిచిన పలకదు ప్రేమా - వలచిన దొరకదు ప్రేమా

పిలిచిన పలకదు ప్రేమా
వలచిన దొరకదు ప్రేమా
అందని వరమే ప్రేమా
మనసుకు తొలి కలవరమా
ప్రేమే మధురం ప్రేమే పదిలం
ఎమీ కాదు క్షణికం అన్ని తానే ప్రణయం
I love u love u రా I love u love u రా

వలపును చినుకుగ భావించా అది నా తప్పు కదా
వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదు గా
ఎన్నెళ్ళొ ఎదురీత ఎన్నాళ్ళీ యదకోతా
ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు
లాభం నష్టం చూడకు ప్రేమవదు
తప్పుంటె అది ప్రేమది కాదు
తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

మనసును తరిమిన చీకటులె చెలిమిగ మారేనా
ఇదివరకెరుగని ఈ బాధే కొలిమై పొయేనా
ఆపలి ఏదొలా చెబుతావా ప్రియురాలా
నీడై నీతొ పాటు సాగాలనుకొన్నానే
నేడే తెలిసెను నాకు ఓ చెలియ
నింగీ నేలా కలవవని నీడే మనిషిని తాకదని
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆపిన ఆగదు ప్రేమా దాచిన దాగదు ప్రేమా
మనసును కలుపును ప్రేమా మహిమలు చూపును ప్రేమా
ప్రేమే గగనం ప్రేమే సహనం
ప్రేమే కాదా ఉదయం ప్రేమించాలి హ్రుదయం
I love u love u రా I love u love u రా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో try చేశా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో try చేశా
కాళిదాసు లాగ మారి కవితే రాసేశా
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో try చేశా
దేవదాసు లాగ మారి గెడ్డం పెంచేశా
food లేకపోయినా bed లేకపోయినా
పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేసా

రమ్ము లోనా కిక్కు లేదు hello మైనా
నీ lookse చూడబోతే మత్తులోకి దించేనా
sunlight వేళ నించి moonlight వెళ్ళే దాక
fulltime నా గుండెల్లో thoughtలన్ని నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు నమ్మవు గాని కలవరమాయ్
ఓ మగువా ... ఓ మగువా ... ఓ మగువా ||ఓ మగువా||

కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కొరుతుంటే దంచుతావే కారాన్ని
crazyగా ఉంటే చాలు ప్రేమ లోన పడతారండీ
true love చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె ... నీ మాటలు లేక మోడైపోయే
మగువా ... ఓ మగువా... ఓ మగువా ||ఓ మగువా||

నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు

నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
నువ్వుంటే చాలు నువ్వు నవ్వుతుంటే చాలు
ప్రేమ వుంటే చాలు నీ పేరు వింటే చాలు
మనసు కొమ్మ పై కోయిలమ్మ వై వచ్చి వాలితే చాలు చాలు చాలు

అవమానాలు ఎన్నెదురైన నువ్వుంటే చాలు
బహుమానాలు అక్కరలేదు నువ్వుంటే చాలు
కొండా కోన దాటొస్తాను నువ్వుంటే చాలు
మండుటెండలో నడిచొస్తాను నువ్వుంటే చాలు
నువ్వు నీడలాగా మారి నా తోడు వుంటే చాలు
నీ కౌగిలింతలో నేను మంచు లాగా కరిగిపొతే చాలు చాలు చాలు

ఎవ్వరినైన ఎదిరిస్తాను నువ్వుంటే చాలు
ఎక్కడికైన ఎగిరొస్తాను నువ్వుంటే చాలు
ఎన్నటికైన కరుణిస్తావ అవునంటే చాలు
ఈ క్షణమేనే మరణిస్తాను ఊ అంటే చాలు
చీరుగాలి లాగా మారి నను తాకుతుంటే చాలు
నీ లేత బుగ్గ పై నేను సిగ్గు లా మారి పొతే చాలు చాలు చాలు

నువ్వేనా నువ్వేనా నా ప్రేమ నువ్వేనా

నువ్వేనా నువ్వేనా నా ప్రేమ నువ్వేనా
నువ్వేనా నువ్వేనా నా పేరు నువ్వేనా
నువ్వేనా నువ్వేనా నా ప్రేమ నువ్వేనా
నువ్వేనా నువ్వేనా నా పేరు నువ్వేనా
నా ప్రతి కదలికలో నువ్వేనా
నా అణువణువులలో నువ్వేనా
నా ఇష్టం నువ్వేనా అదౄష్టం నువ్వేనా
నా ప్రతిది నువ్వేనా నా ప్రతిమలో నువ్వేనా

నే వెన్నెల్లో నిలబడి ఉన్న పొగమంచే నువ్వేనా
నా గుండెల్లో విహరించేది ప్రియా నువ్వే నువ్వేనా
నీ కన్నుల్లో ఆ వెన్నెలగా కనిపించేది నేనేనా
నీ గుండెల్లో వినిపించేటి ఎద సవ్వడి నేనేనా
నా క్షేమం నువ్వేనా
నా లక్ష్యం నువ్వేనా
నీ తలపుల నేనేనా నీ పిలుపుల నేనేనా
నా బంధం ఆనందం అది నువ్వే నువ్వేనా

ఏంచూస్తున్నా ఎటు వెళ్ళుతున్నా నా ఊహే నువ్వేనా
నిదురిస్తున్నా మెలకువగున్నా నా ఊసే నువ్వేనా
ఏంచేస్తున్నా ఏమంటున్నా నీ ధ్యానం నేనేనా
నీ శ్వాసల్లో నీ జ్యాసల్లో ఆ రూపం నేనేనా
చిరునవ్వులు నువ్వేనా చిరుకోపం నువ్వేనా
నీ మాటల్లో నేనేనా ఎద పాటల్లో నేనేనా
నా మౌనం నా ప్రాణం నాలో నువ్వేనా

నీలోని అందాలు చూసానులే తొలి మంచు తెరచాటులో

నీలోని అందాలు చూసానులే తొలి మంచు తెరచాటు లో
నాలోని భావలు తెలిసాయిలే తొలిప్రేమ తీరాలలో
నువ్వు లేని క్షణమే నాకేమొ యుగామే నీడల్లే నీవెంటే నేనుంటా
కలలన్ని నిజమై నీలోనే సగమై కడదాక విడిపోక నీతో ఉంటా
నిన్ను చూస్తూ నన్ను నేనే మరిచానంటా

నిన్నా మొన్నా లేని ఆత్రమా నిన్ను నన్ను కలిపే మంత్రమా
నీకు నాకు ఇంత దూరమా నేనే నువ్వయ్యావు చూడుమా
చినుకై నను తాకితే చిగురై పులకించదా
ఏదో అయ్యింది నాలో నువ్వేం చెసావో ఏమో
పెదవంచున చిరునవ్వు గా నిన్ను చేరేదేలా ?

కల్లలోకి నువ్వు చూడిలా నువ్వు తప్ప వేరే లేరు గా
రాతిరి వేళ నిదుర రాదుగా చూడకుంటే నిన్ను నేరుగా
నదిలా నువ్వు మారితే అలలా నిన్ను చేరనా
మైకం కమ్మింది నీలో దీపం కమ్మన్నది చూడు
నడువంపులో శ్రుతి చేయగా నిన్ను తాకేదేలా

నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్ని నువ్వె

నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్ని నువ్వె
నా మౌనం నా గానం నా గుణ్డెల సవ్వడి నువ్వె
నువ్వే ఆశా నువ్వే స్వాస
నువ్వు లేని ఈ నిమిషం యుగమైన అవదుగ

నాలొ ఉన్న నిన్ను మరిచె పొలేని నేను
తీరం లేని అలలా నిజమే కాలేని కలలా
నాలొ లేని నేను కలవాలంటునె నిన్ను
నీరే లేని నదిలా కన్నీరై ఉన్న మదిలా
వర్షం కొరి యండే చూసి మండే భూమిలా
ప్రేమే కోరి విరహం చూసి మిగిలా నేనిలా
వేరే దారి చూపె వేళ నిన్నే చేరుకొనా

నీ కౌగిళ్ళలోనే కాలం మాయమవని
నీ వేడి ఉపిరిలొ ఇక నన్నేఎ కరిగిపోని
నా ప్రతి అడుగులొను వెంటాడే ఙ్నాపకాలు
నువ్వే లేని నాడు చనిపొయే వరమే చాలు
వేళ్ళే దారి ముళ్ళే చల్లి నన్నే ఆపితె
నీళ్ళే మారి నిప్పై పొంగి నన్నే ముంచితే
గాలే జాలి చూపే వేళ పువ్వై చేరుకొనా

మోన మోన మోన మీన కనుల సోన

మోన మోన మోన మీన కనుల సోన
నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా
సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే
మహవీర చూపులతో నా తనువె నీదైతె
నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరలి
నువ్వాడే సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి

హిమమే యెదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి
వనమేదో చెయ్యాలి చిరుగాలి వెయ్యాలి
వలపేంటో అడిగిందంటు కౌగిట్లో చేరాలి
చలి గిలి చేసెను మోన
తొలి ముద్దులకై రాన
చలి గిలి చేసెను మోన
తొలి ముద్దులకై రాన
జరిగేది ఏమైన జరగాలి కలలాగ
ఆనందం అంబరమై నను నేను మరవాల

జపమేదో చెయ్యాలి హౄదయాలు కలవాలి
గగనాన తారల తొడైఇ గలము విప్పి పాడలి
జతలన్ని మురియాలు ఒకటైన మన చూసి
కధ అల్లుకోవలి ఘన చరితై నిలవాలి
బ్రహమలె నిజమే ఆగున
బ్రతుకే నీవనుకోన
బ్రహమలె నిజమే ఆగున
బ్రతుకే నీవనుకోన
చింతేల ప్రియభామ
నీ చెంత నేలేన
కొంతైన ఓపిక ఉంటే
సొంతం నే కాలేన

మల్లె తీగరోయ్ మనసె లాగుతొందిరోయ్

మల్లె తీగరోయ్ మనసె లాగుతొందిరోయ్
పిట్ట నడుమురోయ్ పిల్లా చంపుతొందిరోయ్
హే నవ్వమాకురోయ్ కళలే రువ్వమాకురోయ్
నరము నరములో వేడే పెంచమాకురోయ్
అంతో ఇంతో నే ట్రై చేస్తా
ఎంతో ఇంతో రూటుకు తెస్తా
నాతో నాతో లేపుకుపోతా
lipstick పెదవే లాగేస్తొంది
అల్లుకోకురోయ్ అలలా గిల్లిపోకురోయ్
అగ్గిపుల్లవై నాలో భగ్గుమనకురోయ్

నడక చూడరోయ్ ఆ నైలు నదిరోయ్
తాకి చూడరోయ్ నాజూకు వెన్నెరోయ్
అమ్మతోడు ఆగలేనురోయ్
హే స్పీడు చూడరోయ్ ముంబాయి రైలురోయ్
చూపు చూడరోయ్ గుండెల్లో ముల్లురోయ్
హాతుకుంటే పట్టులే హోయ్
హోయ్ గుమ్మా గుమ్మా గుమ్మ సోకు నే ఆడేసుకుందునా ఆడసోకు
రెమ్మా రెమ్మా తుంచమాకు హే ఆటాదుకుందాం హోయ్
హే పాతికేళ్ళ పోరి వద్దకొస్తవా అడ్డుపెట్టకుండా ముద్దులిస్తవా
చీకటైనాక ఇంటికొస్తవా నిన్ను కౌగిట్లో కమ్మేసుకుంటా

తళుకు తళుకుల కిలాడి నువ్వురోయ్ చమకు చమకుల గులాబి నేనురోయ్
లిప్పు లిప్పు లింకు చెయ్యరోయ్
పాల బుగ్గలను పట్టేసుకుంటా ముద్దు కుంపటై పెట్టేసుకుంటా
బుగ్గ మస్తు red గుందిలే
మావా మావా లాగమాకు నన్ను మొత్తంగా ముగ్గులోకి దించమాకు
భామా భామా పాల గ్లాసు ఇక పంచేసుకుందాము హోయ్
కోర చూపు తోటి గిల్లమాకురా పంటి గాటు లేసి చంపమాకురా
నంగనాచి పిల్లా నాడి పట్టనా నీ సోకంతా కాజేసుకోనా
న నా న నా న…హే..హే

కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు

కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
వెన్నెల రాతిరి తారక నువ్వై ఊరిస్తున్నావు
కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
వెన్నెల రాతిరి తారక నువ్వై ఊరిస్తున్నావు
ఏమంత్రమేసావో నన్నేమి చేసావో
ఇంకేమి చూడదు కన్ను క్షణమినా వీడదు నిన్ను
ఇంకేమి చూడదు కన్ను క్షణమినా వీడదు నిన్ను
నా పక్కన చేరి గుండెను చోరి ఎందుకు చేసావు

అల్లిబిల్లి గా కదలాడే ముంగురులు
గుండెలో వేయవా పచ్చని పందిరిలు
మెల్ల మెల్లగా కనిపించె తొందరలో
ఇంతలో వింతగా తీయని తిమ్మిరిలు
ఓ మైనా యేమైనా ఈ సంగతి బాగుందే
పగలైనా రేయైనా మరి నిద్దుర రాకుందే
ఓ నదిలా ప్రశాంతమా నువ్వె నా సొంతమా
దిగిరా విహంగమా యెగిరే పతంగమా
వరమా కలవరమా మది నిండిన సంబరమా

ఊపిరాగినా నీ ఊసులే చాలునుగా
వెన్నెలా వేకువా రెండు నువ్వేగా
ప్రాణమెందుకే నీ ధ్యానం ఉన్నదిగా
గుండెలో ఎప్పుడు చప్పుడు నీవేగా
మనసంతా పులకింతా పుడుతున్నది ఈ వేళా
చెలికంతా తనువంతా అవుతున్నది ఏదోలా
ఎగసే తరంగమా ఎదలో పతంగమా
చెలియా నమో నమా మనమే నిజం సుమా
వరమా కలవరమా మది నిండిన సంబరమా

చికిత చికిత తం చికి చికి చికితం

లలలల లలాలలల లలలల లలాలలల
లాలలల లలలాల లాలలల
చికిత చికిత తం చికి చికి చికితం
థకిట థకిట తం చికినక చికితం
చికిత చికిత తం చికి చికి చికితం
థకిట థకిట తం చికినక చికితం

కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితొ ఒకటయ్యేల
కలిపి చూడాలి నింగి నేల ఇంద్రధనసు ఉయ్యాలయ్యెల
చలి పుట్టే ఎండల్లొన చెమటొచ్చె వానేదైనా
nine o' clock కూసే కొడి round the clock ఆడి పాడి
సరదాగా గడిపెద్దామ హూ

ప్రియురాలై ఈ నేల ఆకశం చూసే వేళ
కదిలొచ్చే ప్రతి చినుకు ఒ ముత్యం అయిపోలేదా
ప్రతి పూవ్వు చిరునవ్వై చెప్పాలి హెల్లొ
ఈ గాలి జొ లాలి పాడాలి ఇలలొ
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చెఏదాం ఇప్పటికైనా హూ
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చెఏదాం ఇప్పటికైనా హొ హొ

చెయ్యేత్తి పిలిచానా చుక్కల్లొ చంద్రుడు కూడా
పరిగెత్తి దిగివచ్చి నా జళ్ళొ పూవైపొడా
కొమ్మలనే కుర్చీలా వాడె కొయిల
వాసంతం విరిసింది కూ అనవే ఎలా
వదిలేద్దాం కొపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హూ
వదిలేద్దాం కొపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హూ